న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018: ఏ స్థానంలోనై బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా

By Nageshwara Rao
IPL 2018: Ready to bat anywhere, says Wriddhiman Saha

హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్‌లో టాపార్డర్‌లోనే కాకుండా, లోయర్‌ ఆర్డర్‌లో కూడా బ్యాటింగ్‌ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వికెట్ కీపర్ వృద్దిమాన్‌ సాహా స్పష్టం చేశాడు. ఐపీఎల్ 11వ సీజన్‌లో వృద్దిమాన్‌ సాహా సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున బరిలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

ఈ నేపథ్యంలో సాహా తన బ్యాటింగ్‌ స్థానంపై స్పందించాడు. తన కొత్త ఫ్రాంచైజీ హైదరాబాద్‌ కోరితే ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు. 'నేను ఇప్పుడు సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నా. జట్టు మేనేజ్‌మెంట్‌ ఆదేశాల మేరకు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయడానికి సిద్దంగా ఉన్నా' అని సాహా అన్నాడు.

 ఐపీఎల్ 2018: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టికెట్ అమ్మకాలు షురూ ఐపీఎల్ 2018: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టికెట్ అమ్మకాలు షురూ

'పొట్టి ఫార్మాట్‌లో పరిస్థితులకు తగ్గట్టు ఆడాల్సిన అవసరం ఉంటుంది. ధావన్, డేవిడ్ వార్నర్‌ల రూపంలో మా జట్టులో గొప్ప ఓపెనర్లు ఉన్నారు. అందుచేత ఫలానా స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాననడం సరైంది కాదు. నాకు అప్పజెప్పే బాధ్యతల్ని నిర్వర్తించడానికి రెడీగా ఉన్నా. ఆ క్రమంలో ఎక్కడ బ్యాటింగ్‌ చేయాల్సిన వచ్చినా అది సమస్యగా భావించను' అని అన్నాడు.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

'గత సీజన్‌లో పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాను. అక్కడి వికెట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రస్తుతం హైదరాబాద్‌కు ఆడుతున్నా. ఇక్కడి వికెట్‌కు అలవాటు పడాల్సి ఉంటుంది. ఆటగాళ్లకు ఇదేమంత పెద్ద సమస్య కాదు. ఈ స్టేజిలో ఇదంతా మామూలే' అని సాహా పేర్కొన్నాడు.

ఆప్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌పై కూడా సాహా స్పందించాడు. 'నెట్స్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేశా. అతడి బౌలింగ్‌లో ఔట్ కూడా అయ్యా. ఐపీఎల్‌లో ప్రస్తుతం చెన్నై జట్టు చాలా పటిష్టంగా ఉంది. చెన్నై జట్టు బెంచ్ కూడా చాలా పటిష్టంగా ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం' అని అన్నాడు.

మరొవైపు ఆగస్టు 1వ తేదీ నుంచి ఇంగ్లాండ్‌తో వారి దేశంలో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌పై కూడా సాహా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌తో కఠినమైన సవాల్‌ ఉంటుందని పేర్కొన్నసాహా... అక్కడ పరిస్థితులకు తగ్గట్టు ఆడితే అది కచ్చితంగా టీమిండియాకు లాభిస్తుందని అన్నాడు. ఇంగ్లాండ్‌లో వికెట్ల వెనుక కీపింగ్‌ చేయడం అంత ఈజీ కాదని తెలిపాడు.

Story first published: Friday, March 23, 2018, 13:51 [IST]
Other articles published on Mar 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X