పంజాబ్‌కు బౌలింగే బలం: సొంతగడ్డపై ఆర్‌సీబీకి విజయం దక్కేనా?

Posted By:
IPL 2018 RCB vs KXIP: Royal Challengers Bangalore eye first win against Kings XI Punjab

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం బెంగళూని చిన్నసామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. సొంత మైదానంలో పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు జట్టు ఉంది.

తొలి మ్యాచ్‌లో కోల్‌కతా ఆటగాళ్లు సునీల్‌ నరైన్‌ మెరుపు ఇన్నింగ్స్‌, నితీష్‌ రాణా అల్‌రౌండ్‌ ప్రదర్శనతో కోహ్లీ సేన ఓటమి పాలైంది. ఇక, ఈ సీజన్‌లో కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తొలి మ్యాచ్‌ను విజయంతో మొదలుపెట్టింది. ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్‌‌లో పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో బెంగళూరు-పంజాబ్ జట్ల మధ్య మ్యాచజరగనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల బలబలాలు పరిశీలిద్దాం...

 ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బెంగళూరు

ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బెంగళూరు

సొంత అభిమానుల మధ్య మ్యాచ్ జరుగుతుండటంతో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బెంగళూరు జట్టు ఉంది. కోల్‌కతా నైట్‌‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓపెనర్ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌, ఏబీ డివిలియర్స్‌ అద్భుత ప్రదర్శన చేశారు.
చివరి ఓవర్లలో మన్‌దీప్‌ సింగ్‌ సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో తొలి మ్యాచ్‌లో బెంగళూరు భారీ స్కొరు సాధించే దిశగా అడుగులు వేసింది. కానీ, ఒత్తిడితో వరుసగా వికెట్లను కోల్పోయింది.

కోహ్లీ రాణిస్తే తిరుగుండదు

తొలి మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడలేకపోయాడు. ఒకవైపు డివిలియర్స్‌ సిక్సర్లు బాదుతుంటే, కోహ్లీ మాత్రం పరుగులు రాబట్టడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇక, పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ, డివిలియర్స్ ఫామ్‌‌లోకి వస్తే అందుకుంటే మ్యాచ్‌పై బెంగళూరు పట్టు సాగించే అవకాశం ఉంది. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న బెంగళూరు, సొంతగడ్డపై జరిగే మ్యాచ్‌లో విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరకుంటున్నారు.

 విఫలమైన స్పిన్నర్లు

విఫలమైన స్పిన్నర్లు

ఇక బెంగళూరు బౌలింగ్ విషయానికి వస్తే... కుల్వంత్‌, ఉమేశ్‌ యాదవ్‌ ఫరవాలేదనిపించారు. తొలి మ్యాచ్‌లో విఫలమైన స్పిన్నర్లు ఈ మ్యాచ్‌లో రాణిస్తే బాగుంటుంది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ ఓవర్‌కు 12 పరుగుల చొప్పున సమర్పించుకున్నాడు. ముఖ్యంగా సునీల్‌ నరైన్‌ అయితే సుందర్‌ బౌలింగ్‌లో ఫోర్లు, సిక్సులు బాదాడు.

ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోన్న పంజాబ్

ఇక, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ విషయానికి వస్తే తొలి మ్యాచ్‌ నెగ్గిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. బెంగళూరుపై కూడా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఆరంభాన్నిచ్చిన ఓపెనర్‌ రాహుల్‌ ఈ మ్యాచ్‌లోనూ అదే స్థాయిలో రాణించాలనుకుంటున్నాడు. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ ఫామ్‌లోకి వస్తే పంజాబ్‌ను ఆపడం కష్టమే.

తుది జట్టులో క్రిస్ గేల్

మిడిలార్డర్‌లో యువరాజ్‌ సింగ్‌, డేవిడ్‌ మిల్లర్‌ ఫామ్‌ అందుకుంటే పంజాబ్‌ భారీ స్కోరు చేయడం తథ్యం. కరుణ్‌ నాయర్‌ తొలి మ్యాచ్‌లో మెరుగ్గానే రాణించాడు. తొలి మ్యాచ్‌కు దూరమైన క్రిస్ గేల్‌ బెంగళూరుతో మ్యాచ్‌ ఆడే అవకాశం ఉంది. క్రిస్ గేల్ గనుక తుదిజట్టులో చోటు దక్కితే బెంగళూరు అభిమానులకు పండుగే. గేల్‌ ఈ మ్యాచ్‌లో ఆడతాడో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

పంజాబ్‌కు బౌలింగ్ బలం

ఇక పంజాబ్ బౌలింగ్‌ విషయానికి వస్తే కెప్టెన్‌ అశ్విన్‌‌తో పాటు ముజీబ్ ఉర్‌ రెహ్మాన్‌ అద్భుతంగా రాణిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో తక్కువ పరుగులిచ్చి ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసిన సంగతి తెలిసిందే. అయితే అక్షర్‌ పటేల్‌, ఆండ్రూ టై మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నారు. చూద్దాం ఈ మ్యాచ్‌లో ఏం జరుగుతుందో..!

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, April 13, 2018, 17:54 [IST]
Other articles published on Apr 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి