న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2018: జైపూర్‌లో పంజాబ్‌కు షాక్, రాజస్థాన్ ఘన విజయం

By Nageshwara Rao
Rajasthan Royals

హైదరాబాద్: జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఫలితంగా కింగ్స్‌ పంజాబ్‌పై తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి రాజస్థాన్ ప్రతీకారం తీర్చకుంది. కింగ్స్‌ పంజాబ్‌ ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌ (95 నాటౌట్‌; 70 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసి ఓటమి పాలైంది.

అదే సమయంలో హ్యాట్రిక్‌ ఓటముల తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ బౌలర్లలో కృష్ణప్ప గౌతమ్‌ రెండు వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్‌, ఇష్‌ సోథీ, బెన్‌ స్టోక్స్‌, ఉనాద్కత్‌లకు తలో వికెట్‌ తీసుకున్నారు. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్‌ 158 పరుగులు చేసింది.


15 ఓవర్లకు పంజాబ్‌ 92/6
159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 15 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. కీలక వికెట్లు చేజార్చుకోవడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ (54) హాఫ్ సెంచరీ సాధించాడు. అంతకముందు మనోజ్‌ తివారి (7), అక్షర్‌ పటేల్‌ (9) ఔటయ్యారు. క్రీజులో స్టొయినిస్‌ (3) పరుగులతో ఉన్నాడు. పంజాబ్‌ గెలవాలంటే 30 బంతుల్లో 67 పరుగులు చేయాలి.


12 ఓవర్లకు పంజాబ్ 66/5
రాజస్థాన్ రాయల్స్‌ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ ఆరంభం నుంచీ తడబడుతోంది. 12 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ కేఎల్ రాహుల్(44) పరుగులతో ఉన్నాడు. అంతకముందు అక్షద్దీప్ నాథ్ (9), మనోజ్ తివారీ(7) పరుగుల వద్ద ఔటయ్యారు.


19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పంజాబ్
రాజస్థాన్ రాయల్స్‌ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌కు శుభారంభం దక్కలేదు. 19 పరుగులకే ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయింది. గౌతమ్ వేసిన మూడో ఓవర్ మొదటి బంతికి కీలక ఆటగాడు క్రిస్ గేల్(1) స్టంప్ ఔటయ్యాడు. అదే ఓవర్ మూడో బంతికి పంజాబ్ కెప్టెన్ అశ్విన్(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వీరిద్దరూ ఔటైనప్పుడు స్కోరు 14. ఇక జోఫ్రా ఆర్చర్‌ వేసిన 3.4వ బంతికి కరుణ్‌ నాయర్‌ (3) ఉనద్కత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. 5 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌ 3 వికెట్లు కోల్పోయి 25 పరుగులు చేసింది. క్రీజులో కేల్ రాహుల్‌ (19), అక్షదీప్‌ నాథ్‌ (1) పరుగుతో ఉన్నారు.


ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన పంజాబ్
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. 159 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. గౌతమ్ వేసిన మూడో ఓవర్ మొదటి బంతికి కీలక ఆటగాడు క్రిస్ గేల్(1) స్టంప్ ఔటయ్యాడు. అదే ఓవర్ మూడో బంతికి పంజాబ్ కెప్టెన్ అశ్విన్(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పంజాబ్ మూడో ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజ్‌లో కేఎల్ రాహుల్(13), కరుణ్ నాయర్(2) పరుగులతో ఉన్నారు.


పంజాబ్ విజయ లక్ష్యం 159

జైపూర్ సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ (82: 58 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సు) దూకుడుగా ఆడినా.. మిడిలార్డర్ విఫలమవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. దీంతో పంజాబ్‌కు 159 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

రాజస్థాన్ కెప్టెన్ రహానే(9) మరోసారి విఫలమయ్యాడు. ప్రయోగాత్మకంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన గౌతమ్ కృష్ణప్ప(8) సైతం నిరాశపరిచాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ (22) కీలక సమయంలో ఔటవడంతో రాజస్థాన్ తడబడింది. ఒక ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా.. జోస్ బట్లర్ మాత్రం వరుసగా మూడో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

పవర్‌ ప్లేలో దూకుడుగా ఆడిన జోస్ బట్లర్... మిడిల్ ఓవర్లలో ఎక్కువగా సింగిల్స్, డబుల్స్‌కే ప్రాధాన్యమివ్వడంతో స్కోరు బోర్డు ఆఖర్లో నెమ్మదించింది. జట్టు స్కోరు 132 వద్ద బట్లర్ స్టంపౌట్ కాగా అనంతరం వచ్చిన స్టువర్ట్ బిన్నీ (11) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. చివర్లో బెన్‌స్టోక్స్ (14) దూకుడుగా ఆడకపోవడంతో రాజస్థాన్‌ తక్కువ స్కోరుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

పంజాబ్ బౌలర్లలో ఆండ్రూ టై నాలుగు వికెట్లు తీయగా, ముజీబ్ రెండు, స్టాయినిస్ చెరో వికెట్ తీసుకున్నారు.


నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ఓపెనర్ జోస్ బట్లర్ (82: 58 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సు) పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన ముజీబ్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి షాట్ ఆడేందుకు ప్రయత్నించి బట్లర్ విఫలమయ్యాడు. ప్రస్తుతం 17 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. క్రీజులో బెన్ స్టోక్స్(9), స్టువర్ట్ బిన్నీ(1) పరుగుతో ఉన్నారు.


15 ఓవర్లకు రాజస్థాన్ 120/3
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ మూడో బంతికి సంజూ శాంసన్ (22) పరుగుల వద్ద మనోజ్ తివారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం15 ఓవర్లకు గాను రాజస్థాన్ 3 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(77), బెన్ స్టోక్స్(2) పరుగులతో ఉన్నారు.


హాఫ్ సెంచరీ చేసిన జోస్ బట్లర్
జైపూర్ వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (60; 39 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సు)తో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్‌ 2 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. క్రీజులో కృష్ణప్ప గౌతమ్‌ (8) ఔట్‌ కావడంతో సంజూ శాంసన్ (4) క్రీజులోకి వచ్చాడు.


8 ఓవర్లకు రాజస్థాన్ 72/2
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. మార్కస్ స్టోయినిస్ వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్ మూడో బంతికి కృష్ణప్ప గౌతమ్(8) మనోజ్ తివారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 8 ఓవర్లకు గాను రాజస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(51), సంజు శాంసన్(3) పరుగులతో ఉన్నారు.


తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్‌కి ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. అండ్రూ టై వేసిన నాలుగో ఓవర్‌లో రహానే(9) అక్షదీప్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 5 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ 1 వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజ్ులో బట్లర్(35), కృష్ణప్ప గౌతమ్(7) పరుగులతో ఉన్నారు.


దూకుడుగా ఆడుతున్న రాజస్థాన్ ఓపెనర్లు
పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (27) దూకుడుగా ఆడుతున్నాడు. వరుసగా బౌండరీలు బాదుతున్నాడు. ప్రస్తుతం 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేసింది. క్రీజులో రహానే (8), జోస్‌ బట్లర్‌ (27) పరుగులతో ఉన్నారు.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

ఐపీఎల్ టోర్నీలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ మంగళవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్టుతో తలపడనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

వరుస ఓటముల నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ తుది జట్టులో మూడు మార్పులు చేసింది. మహిపాల్, స్టువర్ట్ బిన్నీ, ఇష్ సోథీ తుది జట్టులోకి వచ్చారు. పంజాబ్ జట్టు కూడా రెండు మార్పులు చేసింది. మయాంక్ అగర్వాల్ స్థానంలో అక్షదీప్, అంకిత్ రాజ్‌పుత్ స్థానంలో మోహిత్ శర్మని జట్టులోకి తీసుకుంది.

టోర్నీలో ఇప్పటికే ఈ రెండు జట్లు ఒకసారి తలపడ్డాయి. ఇండోర్ వేదికగా గత ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు అదే జట్టుపై తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

టోర్నీలో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లాడిన పంజాబ్ ఆరింట గెలుపొంది పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. కేవలం మూడింట్లో గెలుపొందిన రాజస్థాన్ చివరి స్థానంలో ఉంది.

1
43450

ఆ జట్టు ప్లేఆఫ్‌కు చేరాలంటే ఇకపై ఆడే ఐదు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి. రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ సూపర్ ఫామ్‌‌ని కొనసాగిస్తూ గత రెండు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్‌కి మెరుపు ఆరంభాలిచ్చినా.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాణించలేకపోతున్నారు.

జట్ల వివరాలు:
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు:

లోకేశ్ రాహుల్, క్రిస్‌గేల్, అక్షదీప్‌నాథ్, కరుణ్ నాయర్, అక్షర్ పటేల్, స్టాయినిస్, మనోజ్ తివారి, అశ్విన్, ఆండ్రూ టై, మోహిత్ శర్మ, ముజీబ్ ఉర్ రెహ్మాన్

రాజస్థాన్ రాయల్స్:
జోస్ బట్లర్, రహానే, సంజు శాంసన్, బెన్‌స్టోక్స్, స్టువర్ట్ బిన్నీ, మహిపాల్, ఆర్చర్, గౌతమ్, జయదేవ్ ఉనాద్కత్, ఇస్ సోధీ, అనురీత్ సింగ్

Story first published: Tuesday, May 8, 2018, 23:52 [IST]
Other articles published on May 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X