న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అనుష్కకు బర్త్ డే కానుక: ముంబైపై బెంగళూరు విజయం

By Nageshwara Rao
Kohli

హైదరాబాద్: ఐపీఎల్‌లో ముంబై ఖాతాలో మరో ఓటమి చేరింది. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 168 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది.

ముంబై ఆటగాళ్లలో హార్ధిక్ పాండ్యా(50) ఫరవాలేదనిపించగా.... సూర్యకుమార్ యాదవ్(9), ఇషాన్ కిషన్(0), డుమిని(23), కీరన్ పొలార్డ్(13), కృనాల్ పాండ్యా(23), బెన్ కటింగ్(12 నాటౌట్) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, సిరాజ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. మంగళవారం అనుష్క 30వ పుట్టినరోజును జరుపుకుంది. దీంతో ఈ విజయాన్ని అనుష్కకు విరాట్ కోహ్లీ పుట్టినరోజు కానుకగా ఇచ్చాడని అభిమానులు ట్విట్టర్లో కామెంట్లు పెట్టారు.

మంగళవారం తన సతీమణి అనుష్క శర్మ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. కేక్ కట్ చేసిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తమ హోటల్ రూమ్‌ను విభిన్న రకాల పూలతో అలంకరించి వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన అనంతరం అనుష్కకు కేక్ తినిపిస్తున్న ఫొటోను పోస్ట్ చేశాడు.

1
43441

ఐదు వికెట్లు కోల్పోయిన ముంబై
చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. పొలార్డ్, డుమిని కాసేపు పోరాడటంతో ముంబై పవర్ ప్లేలో 40/3తో నిలిచింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ 8వ ఓవర్ తొలి బంతికి పొలార్డ్‌ను సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో ముంబై 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హార్దిక్ పాండ్యా, జేపీ డుమిని ఆదుకోవడంతో ముంబై ఇండియన్స్ పది ఓవర్లలో 77/4తో నిలిచింది. కోలుకుంటున్న దశలో డుమిని (23) అనవసర పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. దీంతో ముంబై 84 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 14 ఓవర్లకు గాను ముంబై 5 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. క్రీజులో హర్ధిక్ పాండ్యా (28), కృనాల్ పాండ్యా(5) పరుగులతో ఉన్నారు.


పట్టు బిగిస్తున్న బెంగళూరు
చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పట్టు బిగిస్తోంది. 168 పరుగుల ఛేదనకు దిగిన ముంబైని 10 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది.
21 పరుగుల వద్ద రోహిత్‌ శర్మ (0)ను ఉమేశ్‌, 47 వద్ద కీరన్‌ పొలార్డ్‌ (13)ను సిరాజ్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ప్రస్తుతం డుమిని (20), హార్దిక్‌ పాండ్య (21) క్రీజులో ఉన్నారు.


మూడు వికెట్లు కోల్పోయిన ముంబై
చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో ముంబై వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి ఓవర్‌లోనే కిషన్‌ డకౌట్‌గా వెనుదిరగగా.. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన నాలుగో ఓవర్‌ మొదటి బంతికి సూర్యకుమార్‌ యాదవ్‌ 9(9) ఎల్బీగా ఔట్‌ కాగా, తర్వాతి బంతికి రోహిత్‌ శర్మ ఖాతా తెరవకుండానే కీపర్‌ డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌‌కు చేరాడు. దీంతో ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై మూడు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డుమిని (13), కీరన్‌ పొలార్డ్‌ (12) పరుగులతో ఉన్నారు.


తొలి వికెట్ కోల్పోయిన ముంబై
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్‌ తొలి కోల్పోయింది. సౌథీ వేసిన తొలి చివరి బంతికే ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ ఖాతా తెరవకుండానే క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో మూడు ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్‌ నష్టానికి 21 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్‌ యాదవ్‌ (9), డుమిని (9) పరుగులతో ఉన్నారు.


ముంబై విజయ లక్ష్యం 168
చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్‌కు 168 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు మనన్ వోహ్రా (45) చక్కటి ఆరంభం ఇవ్వగా... ఆ తర్వాత క్రీజులోకి దిగిన బ్రెండన్ మెక్‌కల్లమ్ (37) దూకుడుగా ఆడాడు. కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించిన మెక్‌కల్లమ్‌ దూకుడుగా ఆడే క్రమంలో రనౌట్ వెనుదిరిగాడు.

121 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి పటిష్టంగా కనిపించిన బెంగళూరు జోరును పాండ్యా అడ్డుకున్నాడు. వరుస బంతుల్లో మన్‌దీప్(14), కోహ్లీ(32)లను పెవిలియన్‌కు చేర్చాడు. అదే ఓవర్ చివరి బంతికి వాషింగ్టన్ సుందర్‌(1)ను కూడా పెవిలియన్ చేర్చాడు.

దీంతో ఒకే ఓవర్లో బెంగళూరు మూడు కీలక వికెట్లను కోల్పోయింది. చివర్లో ఓవర్లో గ్రాండ్ హోమ్(10 బంతుల్లో 23) రెండు సిక్సులు బాదడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో పాండ్యా మూడు వికెట్లు తీసుకోగా, మార్కెండే, బుమ్రా, మెక్లెన్‌గన్ తలో వికెట్ తీసుకున్నారు.


మెక్‌కల్లమ్ రనౌట్: 3వ వికెట్ కోల్పోయిన బెంగళూరు
చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు మూడో వికెట్ కోల్పోయింది. తొమ్మిది ఓవర్లలోపే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి 62 పరుగులు చేసిన బెంగళూరు విరాట్ కోహ్లీ క్రీజులోకి రాగానే దూకుడు పెంచింది. మెక్ కల్లమ్‌తో కలిసి కోహ్లీ వేగంగా పరుగులు రాబట్టాడు. వీరిద్దరూ 25 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ మూడో బంతికి పాండ్యా డైరెక్ట్ త్రో విసరడంతో మెక్‌కల్లమ్ (37) రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో బెంగళూరు 15 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ(29), మన్దీప్ సింగ్(1) పరుగుతో ఉన్నారు.


రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు: 10 ఓవర్లకు 82/2
చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న వోహ్రా (31 బంతుల్లో 45)ను మయాంక్ మార్కండే ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. రివ్యూకి వెళ్లినప్పటికీ బ్యాట్‌ను బంతి తాకకపోడవంతో వోహ్రా నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 10 ఓవర్లకు బెంగళూరు 2 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. క్రీజులో మెక్‌కల్లమ్ (23), కోహ్లీ(3) పరుగులతో ఉన్నారు.


డికాక్ ఔట్: తొలి వికెట్ కోల్పోయిన బెంగళూరు
చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. మిచెల్ మెక్‌క్లెన్‌గాన్ వేసిన ఐదో ఓవర్‌లో డి కాక్(7) ముంబై కెప్టెన్ రోహిత్ శర్మకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో బెంగళూరు ఆరు ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. క్రీజులో వోహ్రా(35), మెక్‌కల్లమ్(0) పరుగులతో ఉన్నారు.


3 ఓవర్లకు బెంగళూరు 11/0
చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ కట్టుదిట్టంగా బంతులు వేస్తోంది. 3 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మనన్‌ వోహ్రా (9), డికాక్‌ (2) పరుగులతో ఉన్నారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై
ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. ఫిట్‌గా లేకపోవడంతో ఈ మ్యాచ్‌లోనూ ఏబీ డివిలియర్స్ బరిలో దిగడం లేదు. గత మ్యాచ్‌ మాదిరిగానే ఈ మ్యాచ్‌లో కూడా మెక్‌కల్లమ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక, ముంబై ఓపెనర్ ఎవిన్ లూయిస్ స్థానంలో డుమినీ జట్టులోకి వచ్చాడు.

దీంతో రోహిత్ ఓపెనర్‌గా బరిలో దిగనున్నాడు. ఈ సీజన్‌లో వరుస విజయాలతో సతమతమవుతున్న ఇరు జట్లకి ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇప్పటికే వరుస విజయాలు సాధించిన చెన్నై, హైదరాబాద్‌, పంజాబ్‌ దాదాపు ప్లేఆఫ్స్‌కు చేరువలో ఉండగా... ముంబై-బెంగళూరు మాత్రం గెలుపు కోసం తీవ్రంగా పోరాడుతున్నాయి.

హైదరాబాద్ Vs ముంబై లైవ్ స్కోరు కార్డు

ఐపీఎల్ 11వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో ఆ స్థాయి తగ్గ విజయం దక్కించులేకపోయింది. దీంతో ఫ్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇప్పటి నుంచి ముంబై ఇండియన్స్ ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ సీజన్‌‌లో ఏడు మ్యాచ్‌లలో రెండు విజయాలు, ఐదు పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై అద్భుత విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ఈ రోజు అదే దూకుడు కొనసాగించాలని అనుకుంటుంది.

జట్ల వివరాలు:
ముంబై ఇండియన్స్:

సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ(కెప్టెన్), ఇశాన్ కిషన్(కీపర్), హార్థిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్, జీన్ పాల్ డుమినీ, బెన్ కట్టింగ్, మిషెల్ మెక్‌క్లెన్‌గాన్, మయాంక మార్ఖండే, జస్ప్రీత్ బుమ్రా.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
క్వింటన్ డి కాక్(కీపర్), బ్రెండన్ మెక్‌కల్లమ్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), మనన్ వోహ్రా, మన్‌దీప్ సింగ్, కొలిన్ డి గ్రాండ్‌‌హోం, వాషింగ్టన్ సుందర్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, యుజవేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్.

Story first published: Wednesday, May 2, 2018, 0:00 [IST]
Other articles published on May 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X