Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ ర్యాంకింగ్స్: టెస్టుల్లో గిల్ గారి కేప్టెన్సీ ఎఫెక్ట్?

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజా ర్యాంకింగ్స్ విడుదల చేసింది. వార్షిక టెస్ట్ ర్యాంకింగ్స్ ఇవి. అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ కు సంబంధించిన పాయింట్ల పట్టిక కూడా విడుదల అయింది. ఏడాది కాలంలో ఆయా జట్లు ఆడిన టెస్ట్ మ్యాచ్ లు, వాటిల్లో సాధించిన విజయాల ఆధారంగా తాజా ర్యాంకింగ్స్ ను రూపొందించింది ఐసీసీ.

ఈ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో నిలిచింది. వార్షిక ర్యాంకింగ్‌ల ప్రకారం.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 87.50 శాతంతో అగ్రగామిగా ఉంది. న్యూజిలాండ్ 77.78 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. భారత జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది.

ICC Latest Rankings India Stand at No 3 in Test and Australia dominating in other formats WTC table

టెస్ట్ ఫార్మట్ ఆస్ట్రేలియా తన నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది.. ఏడాది కాలంగా. ఇందులో తన పాయింట్లను మరింత మెరుగుపర్చుుకుంది. ఏకంగా మూడు అదనపు పాయింట్లను సాధించింది. దీంతో ఆ జట్టు ఖాతాలో ఉన్న పాయింట్ల సంఖ్య 131కి చేరుకుంది.

టెస్ట్ ర్యాంకింగ్స్‌లోని మొదటి రెండు స్థానాలపై ఎటువంటి ప్రభావం చూపలేదు. ఆస్ట్రేలియాతో పాటు దక్షిణాఫ్రికా కూడా ఈ ఫార్మట్ లో తన అధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఆస్ట్రేలియా 131 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, 119 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది. 104 పాయింట్లతో భారత్ మూడో స్థానాన్ని దక్కించుకుంది.

ఇంగ్లాండ్-102, న్యూజిలాండ్- 101 పాయింట్లతో నాలుగు, అయిదు స్థానాల్లో నిలిచాయి. పాకిస్థాన్ 89 రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకోవడానికి ఎగబాకింది. మిగిలిన జట్లలో శ్రీలంక 86 పాయింట్లతో ఏడు, వెస్టిండీస్ 68 పాయింట్లతో ఎనిమిది, బంగ్లాదేశ్ 67 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. ఐర్లాండ్- 25 పాయింట్లతో పదో స్థానానికి చేరింది. జింబాబ్వే- 10 పాయింట్లతో 11, ఆఫ్ఘనిస్తాన్ జీరో రేటింగ్‌తో చివరి స్థానంలో కొనసాగుతోంది.

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలోనూ ఆస్ట్రేలియాదే ఆధిపత్యం. ఆ జట్టు 87.50 శాతంతో టాప్ లో ఉంది. న్యూజిలాండ్- 77.78, సౌత్ ఆఫ్రికా- 75, శ్రీలంక- 66.67, పాకిస్తాన్- 50, భారత్- 48.15, ఇంగ్లాండ్- 31.67, బంగ్లాదేశ్- 16.67, వెస్టిండీస్- 4.17 శాతం పాయింట్లో ఉన్నాయి. భారత్ కంటే పాకిస్తాన్ మెరుగ్గా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Story first published: Friday, May 1, 2026, 16:47 [IST]
Other articles published on May 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+