Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ లో కీలక మార్పు: 18 ఏళ్ల చిచ్చరపిడుగు ఎంట్రీ

ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తడాఖా చూపుతోంది. భారీ విజయాలతో దూసుకెళ్తోంది. వరుసగా అయిదు విజయాలను తన ఖాతలో వేసుకుంది. మొన్నటికి మొన్న ముంబై ఇండియన్స్ ను వాళ్ల సొంత గడ్డ వాంఖెడే స్టేడియంలో చితగ్గొట్టడం అదరహో అనిపించుకుంది. ఈ మ్యాచ్ లో ఓడిన దెబ్బకు ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరింది. ప్లేఆఫ్స్ పై దాదాపుగా ఆశలు వదులుకున్నట్టయింది.

ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ ఆరింట్లో నెగ్గింది. మూడింట పరాజయాన్ని చవి చూసింది. మొత్తం 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇంకా అయిదు మ్యాచ్ లు ఆడాల్సి ఉందీ జట్టుకు ఇందులో ఇంకో మూడు గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది పాట్ కమ్మిన్స్ సేన.

Sunrisers Hyderabad Brings in 18-Year-Old RS Ambrish After Shivam Mavi Injury to Bolster the Camp

ఈ పరిస్థితుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. గాయపడ్డ శివం మావి స్థానంలో 18 ఏళ్ల సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆర్‌ఎస్ అంబరీష్‌ ఎంట్రీ అయ్యాడు. అతనితో కాంట్రాక్ట్ ను కుదుర్చుకుంది జట్టు మేనేజ్మెంట్. గత ఏడాది జరిగిన ఐపీఎల్ లో వేలంలో 75 లక్షల రూపాయల ధరకు శివం మావిని జట్టులోకి తీసుకుంది సన్ రైజర్స్. గజ్జల్లో గాయం కారణంగా టోర్నమెంట్‌ మొత్తానికీ దూరం అయ్యాడు.

దీంతో ఆర్ఎస్ అంబరీష్ తో అతని స్థానాన్ని భర్తీ చేసింది. కుడిచేతి మీడియం పేసర్, ఎడమచేతి బ్యాటర్ అయిన అంబరీష్ 2026 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. ఆ టోర్నమెంట్‌లో 11 వికెట్లతో అతను టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్నాడు. జాయింట్ హయ్యెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడీ తమిళనాడు క్రికెటర్.

యంగ్ పేసర్లతో తొణికిసలాడుతోంది సన్ రైజర్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్. ఇప్పటికే ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తోన్నారు ప్రఫుల్ హింగ్, సాకిబ్ హుస్సేన్. ఇప్పుడు వారితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోనున్నాడు అంబరీష్. ఈ జట్టు ఈ ఆదివారం హైదరాబాద్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తదుపరి మ్యాచ్ ఆడనుంది.

Story first published: Friday, May 1, 2026, 17:08 [IST]
Other articles published on May 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+