కౌగిలింత కల్లోలం: లైవ్‌లోనే హగ్ చేసుకున్న మహిళా క్రికెటర్! (వీడియో)
పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రస్తుతం ప్లేఆఫ్ దశకు చేరుకుని పాక్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. క్వాలిఫయర్ మ్యాచ్‌లో పెషావర్ జల్మీ విజయం సాధించి ఫైనల్‌కు చేరుకోగా.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్టు ముల్తాన్ సుల్తాన్స్‌పై గెలిచింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలోని ఆట కంటే కూడా కామెంటరీ బాక్సులో చోటు చేసుకున్న ఓ సన్నివేశం ఇప్పుడు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, భారత్ వరకు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లో ఊహించని ఘటన
ముల్తాన్ సుల్తాన్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ జరుగుతున్న సమయంలో కామెంటరీ బాక్సులో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా, ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్ లిసా స్టాలెకర్ విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో లిసా స్టాలెకర్ చిరునవ్వుతో రమీజ్ రాజాను హగ్ చేసుకుందు. ఈ దృశ్యం లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లో స్పష్టంగా కనిపించడంతో నెటిజన్లు ఆ క్లిప్పింగ్‌ను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇది కేవలం స్నేహపూర్వక చర్యగా అనిపించినప్పటికీ.. పాకిస్థాన్ వంటి సంప్రదాయ దేశంలో ఇలా జరగడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

క్రికెట్ ప్రపంచంలో ఇద్దరూ దిగ్గజాలే
ఈ ఘటనలో ఉన్న ఇద్దరూ క్రికెట్ ప్రపంచంలో దిగ్గజాలే కావడం విశేషం. రమీజ్ రాజా 1992లో ప్రపంచ కప్ గెలిచిన పాకిస్థాన్ జట్టులో సభ్యుడిగా ఉండటమే కాకుండా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆధ్యక్షుడిగా కూడా పని చేశాడు. మరోవైపు లిసా స్టాలెకర్ ఆస్ట్రేలియా తరపున అద్భుతమైన ఆల్ రౌండర్ ప్రదర్శన ఇచ్చింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో 1000 పరుగులు చేయడంతో పాటు 100 వికెట్లు పడగొట్టిన మొట్టమొదటి క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది. ఆమె ఖాతాలో 2728 పరుగులు, 146 వికెట్లు ఉన్నాయి.
సోషల్ మీడియాలో వైరల్
ఈ వీడియో వైరల్ కావడంతో పాకిస్థాన్‌లోని క్రికెట్ అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఇది క్రీడా స్ఫూర్తితో కూడిన సాధారణ స్నేహపూర్వక చర్య అని అంటుంటే.. మరికొందరు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పొరుగు దేశాలైన భారత్, ఆఫ్ఘనిస్థాన్‌లలో కూడా ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పీఎస్ఎల్ ఫైనల్ వైపు అందరి దృష్టి ఉన్నప్పటికీ.. ఈ 'హగ్' వీడియో మాత్రం ఇంటర్నెట్‌లో సంచలనంగా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications