న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సూపర్బ్ మ్యాచ్: వాంఖడెలో ముంబైపై హైదరాబాద్ సంచలన విజయం

By Nageshwara Rao
SRH

హైదరాబాద్: ఐపీఎల్‌లో రెండు వరుస ఓటముల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 119 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 87 పరుగులకే ఆలౌటైంది.

తాజా విజయంతో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ పటిష్టమైన బౌలింగ్ లైనప్ కలిగిన జట్టు అని మరోసారి రుజువు అయింది. సన్ రైజర్స్ బౌలర్లు బౌలర్లు సిద్ధార్థ కౌల్ (3/23), రషీద్ ఖాన్ (2/11) సంచలన బౌలింగ్‌తో పటిష్ట బ్యాటంగ్ లైనప్ కలిగిన ముంబై ఇండియన్స్ 87 పరుగులకే కుప్పకూల్చారు.

ముంబై ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్ (34), క్రునాల్ పాండ్యా (24)లు మాత్రమే ఫరవాలేదనిపించగా మిగితా వారంతా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.4 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.


ఐదు వికెట్లు కోల్పోయిన ముంబై
వాంఖడె స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ తొలి బంతికి కీరన్ పొలార్డ్ (9) పరుగుల వద్ద శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 14 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయిన ముంబై 75 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సూర్య కుమార్ యాదవ్ (33), హార్దిక్ పాండ్యా (1) ఉన్నారు.

అంతకముందు రషీద్ ఖాన్ బౌలింగ్‌లోనే క్రునాల్ పాండ్యా (24) ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసిన సందీప్ శర్మ బౌలింగ్‌లో బంతిని డీప్ మిడ్ వికెట్ దిశగా తరలించేందుకు ప్రయత్నించిన ఎవిన్ లావిస్ (5) ఫీల్డర్ మనీశ్ పాండే చేతికి చిక్కాడు.

ఆ తర్వాత ఓవర్‌లో ఇషాన్ కిషన్ (0) సిక్స్ కొట్టబోయి దీపక్ హుడా క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో బంతిని పాయింట్ దిశగా హిట్ చేసేందుకు ప్రయత్నించిన కెప్టెన్ రోహిత్ శర్మ (2) స్లిప్‌లో ధావన్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.


ఒంటరి పోరాటం చేస్తోన్న సూర్య కుమార్ యాదవ్
వాంఖడె స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి ముంబై 3 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్‌ యాదవ్‌ (27), కృనాల్‌ పాండ్యా (17) పరుగులతో ఉన్నారు.


ఆసక్తికరంగా ముంబై-హైదరాబాద్ మ్యాచ్
వాంఖడె స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. 119 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 6 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది. 21 పరుగులకే ఇవిన్‌ లూయిస్‌ (5), ఇషాన్‌ కిషన్‌ (0), రోహిత్‌ శర్మ (2)ను పెవిలియన్‌కు చేరారు. ప్రస్తుతం సూర్య కుమార్‌ యాదవ్‌ (13), కృనాల్‌ పాండ్యా (3) పరుగులతో ఉన్నారు.


ముంబై విజయ లక్ష్యం 119
వాంఖడె స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 18.4 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. దీంతో ముంబై ఇండియన్స్‌కి 119 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

దీంతో ఈ సీజన్‌లో ఇప‍్పటివరకూ జరిగిన మ్యాచ్‌ల్లో అత్యల్ప స్కోరును నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. మరొకవైపు ఐపీఎల్‌ చరిత్రలో సన్‌రైజర్స్‌కు ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. హైదరాబాద్ ఆటగాళ్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (29), యూసఫ్ పఠాన్ (29)లు మాత్రమే ఫరవాలేదనిపించగా మిగితా వారంతా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు.

ముంబై బౌలర్లలో మిచెల్ మెక్లనగన్, హార్దిక్ పాండ్యా, మయాంక్ మార్కండే తలో రెండు వికెట్లు తీసుకోగా.. జస్ప్రీత్ బమ్రా, రహ్మాన్‌లకు ఒక వికెట్ లభించింది.


పఠాన్ ఒంటరి పోరాటం
వాంఖడె స్టేడియంలో ముంబైతో జరుగుతోన్న మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. పవర్ ప్లే ముగిసే సమయానికి 51/4తో కష్టాల్లో నిలిచిన హైదరాబాద్ ఆ తర్వాత ముంబై బౌలర్ల దెబ్బకు ఏమాత్రం కోలుకోలేకపోయింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో శిఖర్ ధావన్ (5), సాహా (0) బంతి వ్యవధిలోనే ఔటవగా.. తర్వాత వచ్చిన మనీశ్ పాండే (16) దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షకీబ్ అల్ హసన్(2) పరుగుల వద్ద అవసరపు పరుగు కోసం ప్రయత్నించిన రనౌట్‌గా వెనుదిరిగాడు. ఓపెనర్‌గా వచ్చి క్రీజులో ఒంటరిపోరాటం చేసిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (29) ఔటయ్యాడు. ఒక ఎండ్‌లో క్రీజులో పాతుకుపోయి యూసఫ్ పఠాన్ (20 నాటౌట్) నిలకడగా ఆడుతున్నా.. నబీ (14), రషీద్ (2), బాసిల్ తంపి(3) సిద్దార్థ్ కౌల్(2) వికెట్లు చేజార్చుకోవడంతో 17 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ 109/9తో నిలిచింది.


10 ఓవర్లకు హైదరాబాద్ 82/5
వాంఖడె స్టేడియంలో ముంబైతో జరుగుతోన్న మ్యాచ్‌లో హైదరాబాద్ కష్టాల్లో పడింది. స్ట్రాటజిక్‌ టైమౌట్‌ తర్వాత వేసిన తొలి బంతి (8.1)కే హైదరాబాద్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ (29)ను ముంబై బౌలర్ హార్దిక్ పాండ్యా పెవిలియన్‌కు చేర్చాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ తొలి బంతికి కేన్‌ విలియమ్సన్‌ వికెట్ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్‌ 5 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో
మహ్మద్‌ నబీ (12), యూసఫ్‌ పఠాన్‌ (7) పరుగులతో ఉన్నారు.


నాలుగు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్
వాంఖడె స్టేడియంలో ముంబైతో జరుగుతోన్న మ్యాచ్‌లో హైదరాబాద్ నాలుగు వికెట్లు కోల్పోయింది. రెండో ఓవర్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ క్లీన్ బౌల్డ్ కాగా, ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సాహా అదే ఓవర్‌ చివరి వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం హార్థిక్ పాండ్యా వేసిన ఐదో ఓవర్‌లో మనీష్ పాండే(16) రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగాడు. ఆ తర్వాతి ఓవర్‌లో షకీబ్ అల్ హాసన్ అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో సన్‌రైజర్స్ 7 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. క్రీజ్‌లో యూసుఫ్ పఠాన్(0), విలియమ్‌సన్(23) పరుగులతో ఉన్నారు.


రెండు ఓవర్లకే 2 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్
వాంఖడె స్టేడియంలో ముంబైతో జరుగుతోన్న మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు రెండు ఓవర్లకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన మిచెల్ మెక్లనగన్ బౌలింగ్‌లో బంతిని హిట్ చేయబోయిన శిఖర్ ధావన్(5) బ్యాట్ ఎడ్జ్‌ని తాకిన బంతి.. ధావన్ ఫ్యాడ్స్‌ని తాకుతూ వెళ్లి వికెట్లను గీరాటేసింది. ఆ తర్వాత అదే ఓవర్ చివరి బంతికి వృద్ధిమాన్ సాహా(0) కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 3 ఓవర్లకు గాను హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయి 28పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మనీష్ పాండే(6), కేన్ విలియమ్సన్(12) పరుగులతో క్రీజులో ఉన్నారు.


మరోసారి గాయపడిన శిఖర్ ధావన్
వాంఖడె వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్ శిఖర్ ధవన్ మరోసారి గాయపడ్డాడు. మొహాలీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ధవన్ రెండు మ్యాచ్‌లు జట్టుకు దూరమయ్యాడు. కాగా నేడు ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో మిషెల్ మిక్లాన్‌గాన్ రెండో ఓవర్‌లో ఓ బౌండరీ బాదిన శిఖర్, ఆ తర్వాతి బంతికి తీవ్రంగా గాయపడ్డాడు. మిషెల్ వేసిన బంతి వేగంగా ధావన్ బ్యాట్‌కి తగిలి అతని మోకాలి భాగంలో తగలడంతో అతను గాయపడ్డాడు. అయినప్పటికీ బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఆ తర్వాతి బంతికే క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్ బాటపట్టాడు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై
ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఈ మ్యాచ్ సన్‌‌రైజర్స్ జట్టులో రెండు మార్పులు చేసింది. భువనేశ్వర్, స్టాన్‌లేక్‌ల స్థానంలో మహ్మద్ నబీ, బాసిల్ థంపిని తుది జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్‌లో వీరిద్దరికీ ఇదే తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌. మరోవైపు గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన శిఖర్ ధావన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.

హైదరాబాద్ Vs ముంబై లైవ్ స్కోరు కార్డు

ముంబై ఎటువంటి మార్పు లేకుండానే బరిలోకి దిగుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఇరు జట్లు ఒకసారి తలపడ్డాయి. హైదరాబాద్‌ వేదికగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఒక వికెట్‌ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను గాయాల బెడద తీవ్రంగా వేధిస్తోంది.

ఈ సీజన్‌లో ఇప‍్పటివరకూ ఐదు మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్‌ నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవటంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక హ్యాట్రిక్‌ విజయాలతో టోర్నీని ఘనంగా ఆరంభించిన సన్‌రైజర్స్‌.. వరుసగా చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.

మరొకవైపు ఆటగాళ్లను గాయాల వేధించడం సన్‌రైజర్స్‌ను కలవరపరుస్తోంది. వెన్నునొప్పి కారణంగా.. ఈ మ్యాచ్‌కి ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ దూరమయ్యాడు.

జట్ల వివరాలు:
ముంబై ఇండియన్స్:

సూర్య కుమార్ యాదవ్, ఎవిన్ లూయిస్, ఇషాన్ కిషన్(కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్, హార్థిక్ పాండ్యా, మిచెల్ మెకన్‌గన్, మాయంక్ మార్కండే, జస్ప్రీత్ బుమ్రా, ముస్తాఫిజుర్ రెహ్మన్

సన్‌రైజర్స్ హైదరాబాద్:
శిఖర్ ధావన్, కేన్ విలియమ్‌సన్(కెప్టెన్), వృద్ధిమాన్ సాహా(కీపర్), మనీష్ పాండే, దీపక్ హూడా, యూసుఫ్ పఠాన్, రషీద్ ఖాన్, సిద్ధార్ధ్ కౌల్, మహ్మద్ నబీ, బసిల్ థంపి, సందీప్ శర్మ.

Story first published: Wednesday, April 25, 2018, 0:00 [IST]
Other articles published on Apr 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X