న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీకి మరో ఓటమి: ఒంటిచేత్తో బెంగళూరుని గెలిపించిన డివిలియర్స్

By Nageshwara Rao
ABD

హైదరాబాద్: సొంతగడ్డపై ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ (90 నాటౌట్; 39 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సులు)లతో రాణించడంతో బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు ఓపెనర్లు మనన్ వోహ్రా (2), డికాక్ (18) తొందరగా ఔటయ్యారు. దీంతో 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి బెంగళూరు కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ కోహ్లీ (30: 26 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సు)తో దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు.

అయితే, సిక్స్ కొట్టే ప్రయత్నంలో కోహ్లీ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్డ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అండర్సన్ (15)తో కలిసి డివిలియర్స్ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. చివర్లో అండర్సన్‌ కూడా పెవిలియన్ చేరడంతో మన్‌దీప్ సింగ్ (17 నాటౌట్)తో కలిసి 18 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేశాడు.

ఢిల్లీ బౌలర్లలో హర్షల్ పటేల్, ట్రెంట్ బౌల్డ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ తలో వికెట్ తీసుకున్నారు. అంతకముందు అంతకముందు రిషబ్ పంత్ (85), శ్రేయాస్ అయ్యర్ (52) హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.


బెంగళూరు విజయ లక్ష్యం 175
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ చాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. దీంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు 175 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ కెప్టెన్ గౌతమ్ గంభీర్(3)తో పాటు మరో ఓపెనర్ జాసన్‌ రాయ్‌(5) తీవ్రంగా నిరాశపరిచారు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్‌ పంత్‌-శ్రేయస్‌ అయ్యర్‌ల జోడి నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

వీరిద్దరూ మూడో వికెట్‌ 65 పరుగులు జత చేశారు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు బాది 52 పరుగులు చేసి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరడంతో ఢిల్లీ జట్టు మరోసారి కష్టాల్లో పడింది. అప్పటికే క్రీజులో కుదురుకున్న రిషబ్‌ పంత్‌ దూకుడుగా ఆడాడు.

తొలుత 34 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న రిషబ్‌ పంత్‌.. ఆ తర్వాత చెలరేగాడు. 48 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సులు బాది 85 పరుగులు చేసి జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించడంతో పాటు రాహుల్‌ తెవాతియా(13 నాటౌట్; 2 ఫోర్లు‌) కలిసి 65 పరుగుల​ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. చివరి ఓవర్‌ నాలుగో బంతికి ఐదో వికెట్‌గా ఔటయ్యాడు.

దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. బెంగళూరు బౌలింగ్‌లో చాహల్ రెండు వికెట్లు సాధించగా, ఉమేశ్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కోరీ అండర్సన్‌లకు తలో వికెట్‌ తీశారు.


శ్రేయాస్ అయ్యర్ ఔట్
చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన శ్రేయాస్ అయ్యర్ (52) అదే ఓవర్‌లో మహ్మద్ సిరాజ్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం 17 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది.


నిలకడగా ఆడుతోన్న ఢిల్లీ డేర్‌డెవిల్స్
చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 66 పరగులుు చేసింది. క్రీజులో శ్రేయస్‌ అయ్యర్‌ (31), రిషబ్‌ పంత్‌ (24) పరుగులతో ఉన్నారు.


రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తడబడుతోంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఓపెనర్లు నిరాశపరిచారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే గౌతమ్ గంభీర్ (3) పేలవ షాట్ ఆడి ఔటవగా.. ఆరో ఓవర్‌లో మరో ఓపెనర్ జేసన్ రాయ్ (5) చాహల్ విసిరిన బంతిని క్లీన్ బౌల్డయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. ప్రస్తుతం రిషబ్‌ పంత్‌ (5), శ్రేయస్‌ అయ్యర్‌ (12) పరుగులతో క్రీజులో ఉన్నారు.


తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆరంభంలోనే కీలక వికెట్ చేజార్చుకుంది. ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో.. బంతిని బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించిన కెప్టెన్ గౌతమ్ గంభీర్ (3) చాహల్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం 4 ఓవర్లకు గాను ఢిల్లీ వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. క్రీజులో జాసన్ రాయ్ (4), శేయాస్ అయ్యర్ (1) పరుగులతో ఉన్నారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు
ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్-రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

బెంగళూరు Vs ఢిల్లీ లైవ్ మ్యాచ్ స్కోరు కార్డు

ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. బెంగళూరు జట్టులో సర్ఫరాజ్‌ ఖాన్‌ స్థానంలో మనన్‌ వోహ్రాను తీసుకున్నట్టు కోహ్లీ పేర్కొన్నాడు. మరోవైపు ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో మహమ్మద్ షమి స్థానంలో హర్షల్‌ పటేల్ చోటు దక్కించుకున్నాడు. కాగా, బెంగళూరులో కూడా వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కి వరుణుడు అంతరాయం కలిగించాడు. 192 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కింగ్స్‌ ఓపెనర్ల జోరుతో 8.2 ఓవర్లకు వర్షంతో మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి 96 పరుగులతో నిలిచింది. డక్‌వర్త్‌ లూయిస్‌ విధానం ప్రకారం పంజాబ్‌ 31 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్(45), క్రిస్ గేల్(49) పరుగులతో ఉన్నారు. డక్‌వర్త్‌ ప్రకారం ఈ సమయానికి లక్ష్య ఛేదనకు దిగిన జట్టు విజయం సాధించాలంటే 65 పరుగులు సాధించాలి. అయితే పంజాబ్ అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువ పరుగులే చేసింది. దీంతో వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే పంజాబ్‌ విజయం సాధించినట్లే.

ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట ఓడి కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారింది. సొంతగడ్డపై అభిమానుల మధ్య విజయం సాధించాలనే పట్టుదలతో బెంగళూరు ఉంది.

విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌‌పై అతిగా ఆధారపడుతున్న బెంగళూరు జట్టు గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఘోర పరాజయాన్ని చవిచూడగా.. సమష్టిగా విఫలమవుతున్న ఢిల్లీ జట్టు ఒత్తిడిలో బరిలోకి దిగుతోంది. ఈ సీజన్‌లో చక్కటి శుభారంభాన్ని అందుకోలేకపోయిన బెంగళూరు ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలని ఊవిళ్లూరుతోంది.

జట్ల వివరాలు:
ఢిల్లీ డేర్ డెవిల్స్:

గౌతం గంభీర్(కెప్టెన్), జేసన్ రాయ్, రిషబ్ పంత్(కీపర్), శ్రేయస్ అయ్యర్, క్రిస్ మోరిస్, విజయ్ శంకర్, క్రిస్ మోరిస్, రాహుల్ టెవాటియా, షాబాజ్ నదీమ్, ట్రెంట్ బౌల్ట్, హర్షల్ పటేల్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగూళరు:
క్వింటన్ డికాక్(కీపర్), మనన్ వోహ్రా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, కోరే ఆండర్‌సన్ మన్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, క్రిస్ వోక్స్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, యజువేంద్ర చాహల్.

Story first published: Saturday, April 21, 2018, 23:49 [IST]
Other articles published on Apr 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X