న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2018: CSK vs RR: భారీ ఆధిక్యంతో రాజస్థాన్‌పై చెన్నై గెలుపు

Chennai Super Kings

హైదరాబాద్: ఐపీఎల్ 11లో భాగంగా చెన్నై, రాజస్థాన్ ఇరు జట్లు పుణె వేదికగా మూడో విజయం కోసం పోరుకు తలపడ్డాయి. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 18.3 ఓవర్లలో 140 పరుగులకే పరిమితమై ఘోర పరాజయం చెందింది.

రాజస్థాన్ రాయల్స్‌ ఆటగాళ్లలో బెన్‌ స్టోక్స్‌(45) రాణించగా, జాస్‌ బట్లర్‌(22) మోస‍్తరుగా ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో దీపక్‌ చాహర్‌, డ్వేన్‌ బ్రేవో, కరణ్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, వాట్సన్‌, తాహీర్‌లు తలో వికెట్‌ తీశారు.


మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి:

చెన్నై సుడిగాలుల వంటి షాట్లకి భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు.. పది ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్లు కోల్పోయింది. దాంతో పాటు పదకొండో ఓవర్ మొదటి బంతికే జోస్ బట్లర్ అవుటయ్యాడు. బ్యాటింగ్ తో పాటుగా ఫీల్డింగ్ లోనూ బాగా కుదిరిన చెన్నై జట్టు రాజస్థాన్ ను తీవ్రంగా కట్టడి చేస్తోంది. 10.2 రన్ రేట్‌తో కొనసాగాల్సిన ఇన్నింగ్స్ 8ని కూడా చేరలేకపోతోంది.


చెన్నై దూకుడుతో రాజస్థాన్‌ భారీ టార్గెట్: 205

చెన్నై ఇన్నింగ్స్‌లో షేన్ వాట్సన్ ప్రముఖపాత్ర వహించాడు. ఓపెనర్ గా దిగిన వాట్సన్ ఆఖరి బంతి ముందు అవుట్ అయ్యాడు. 106పరుగులు చేసిన వాట్సన్ ఐపీఎల్‌లో సెంచరీ చేసిన ఆటగాళ్లలో మూడో వాడు. అంతేగాక, వాట్సన్ కు కూడా ఇది మూడో సెంచరీ. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విభాగంలో ఎంతకష్టపడినా వాట్సన్ ధాటికి ఆగలేకపోయారు.


సెంచరీ పూర్తి చేసుకున్న షేన్ వాట్సన్:

పూణె వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అదరగొడుతుంది. 17.2 ఓవర్లకు 177 స్కోరు సంపాదించింది. షేన్ వాట్సన్ కేవలం బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రాజస్థాన్ బౌలర్ ఎవరైనా సరే ఒకే శైలిలో బ్యాట్‌తో బదులిస్తున్నాడు.


ఐదు పరుగులకే ధోనీ, హాఫ్ సెంచరీకి ముందు రైనా:

రాజస్థాన్ రాయల్స్‌పై భారీ పరుగులను రాబట్టేందుకు గాయం నుంచి కోలుకున్న రైనా బరిలోకి దిగాడు. 29 బంతులు ఆడి 46పరుగులు చేసిన రైనా శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో కృష్టప్ప గౌతంకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

వెన్ను నొప్పితో బాధపడుతున్న ధోనీ అలాగే ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. క్రీజులోకి వచ్చీ రాగానే మొదటి ఓవర్‌లో ఫోర్ మాత్రమే చేయగలిగాడు. మొత్తం ధోనీ ఆడిన మూడు బంతులకు 5పరుగులు చేసి రైనా మాదిరిగానే శ్రేయాస్ గోపాల్ లోనే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.


పది ఓవర్లు పూర్తయ్యేసరికి: 107/1

షేన్ వాట్సన్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అప్పటికే ఒక వికెట్‌ను కోల్పోయిన చెన్నై సురేశ్ రైనాను బరిలోకి దింపింది. గాయం నుంచి కోలుకున్న రైనా మరో ఎండ్‌లో ఉన్న వాట్సన్‌కు సహకరిస్తూనే.. బౌండరీలను తీస్తున్నాడు. షేన్ వాట్సన్ (62), సురేశ్ రైనా(32)


తొలి వికెట్ కోల్పోయిన చెన్నై జట్టు:

ఆరంభంలోనే అంబటి వికెట్ కోల్పోయింది చెన్నై జట్టు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. ఓపెనర్లుగా షేన్ వాట్సన్, అంబటి రాయుడులను బరిలోకి దిగింది. అంబటి రాయుడు 12 బంతులు ఆడి (8) పరుగులు మాత్రమే చేయగలిగాడు. షేన్ వాట్సన్ 21బంతుల్లో (36)పరుగులు చేశాడు.


టాస్ రిపోర్టు:

ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా అంబటి రాయుడు, షేన్ వాట్సన్ క్రీజులోకి వచ్చారు


కావేరి జలాల వివాదంతో తన సొంత మైదానాన్ని చెన్నై నుంచి పుణెకు మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త మైదానంలో తిరిగి జోరు కొనసాగించాలని ఆ జట్టు ఆశిస్తోంది.
రెండేళ్ల నిషేధం తర్వాత పునరాగమనం చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఈ సీజనులో తొలిసారిగా తలపడనున్నాయి. ఇప్పటికే జరిగిన ముంబై, కోల్‌కతాతో మ్యాచ్‌లలో ఉత్కంఠభరిత విజయాలతో జోరుమీదున్న చెన్నైకు పంజాబ్‌ మొహాలీ వేదికగా బ్రేక్ వేసినట్లైంది.

మరోవైపు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్ల ధాటికి రాజస్థాన్‌ రాయల్స్‌ తొలి మ్యాచ్‌లో చతికిలపడినా తర్వాతి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. చివరిగా జరిగిన మ్యాచ్‌లో మాత్రం కోల్‌కతాతో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓటమికి గురైంది.


ఇరు జట్ల ఆటగాళ్ల వివరాలు:

చెన్నై జట్టు: Shane Watson, Ambati Rayudu, Suresh Raina, Sam Billings, MS Dhoni (c) (wk), Ravindra Jadeja, Dwayne Bravo, Deepak Chahar, Karn Sharma, Shardul Thakur, Imran Tahir

రాజస్థాన్ జట్టు: Ajinkya Rahane (c), Sanju Samson, Rahul Tripathi, Ben Stokes, Heinrich Klaasen, Jos Buttler (wk), Stuart Binny, Krishnappa Gowtham, Shreyas Gopal, Jaydev Unadkat, Ben Laughlin

Story first published: Saturday, April 21, 2018, 15:03 [IST]
Other articles published on Apr 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X