న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2018: KXIP vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తొలి పరాజయాన్ని రుచి చూపించిన పంజాబ్

2018 Indian Premier League‬, ‪

హైదరాబాద్: పంజాబ్ వేదికగా హైదరాబాద్, పంజాబ్ ఐపీఎల్ సమరంలో హ్యాట్రిక్‌ విజయాలతో అదరగొట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జోరుకు బ్రేక్‌ పడింది. కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 15 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కింగ్స్‌ విసిరిన 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో సన్‌రైజర్స్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమై పరాజయం చవిచూసింది. హైదరాబాద్‌ ఆటగాళ్లలో కేన్‌ విలియమ‍్సన్‌(54), మనీష్‌ పాండే(57 నాటౌట్‌), షకిబుల్‌ హసన్‌(24 నాటౌట్‌) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు.


మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి:
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌ నిలకడగా ఆడే ప్రయత్నం చేస్తున్నారు. ఐదు ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ను కెప్టెన్‌ విలియమ్సన్‌ 36(28) నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మనీశ్‌ పాండే 7(11) తోడుగా వీలుచికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్‌ రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది.


నాలుగో ఓవర్ పూర్తయ్యేసరికి:
మోహిత్‌ శర్మ వేసిన నాలుగో ఓవర్‌ చివరి బంతికి యుసుఫ్‌ పఠాన్‌ 19(13) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో 6ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. క్రీజులో విలియమ్సన్‌ 12(12), మనీశ్‌ పాండే 1(3) ఉన్నారు.


ధావన్ రిటైర్డ్ హర్ట్:
పంజాబ్‌ బౌలర్‌ బరీందర్‌ వేసిన తొలి ఓవర్‌ ఐదో బంతి ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ చేతికి నేరుగా తగలడంతో అతను రిటైర్డ్‌హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. మరోవైపు మోహిత్‌ శర్మ వేసిన రెండో ఓవర్‌ నాలుగో బంతికి వృద్ధిమాన్‌ సాహా 6(7) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో మూడు ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 22 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్‌‌ కేన్‌ విలియమ్సన్‌ 9(6), యూసఫ్‌ పఠాన్‌ 6(4) ఉన్నాడు.

పంజాబ్ ఇన్నింగ్స్:

ఓపెనర్‌గా దిగిన క్రిస్ గేల్ విధ్వంసానికి తెరలేపాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు ధాటిగా పరుగులు చేస్తూనే ఉంది. మొత్తం 14 సిక్సులు, 10 ఫోర్లతో స్కోరు పరిగెత్తింది.


గేల్ సెంచరీ:
కేవలం 58 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. హైదరాబాద్ జట్టు బౌలింగ్‌ను ఊచకోత కోస్తున్నాడు గేల్. 6 సిక్సులు, ఒక్క ఫోర్‌తో సెంచరీని పూర్తి చేశాడు. ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న గేల్ విధ్వంసంతో హైదరాబాద్ బౌలర్లకు చెమట్లు పుట్టిస్తున్నాడు.


కరుణ్ నాయర్ అవుట్, పంజాబ్ 168/3

టాస్ గెలవడం నుంచి పంజాబ్ జట్టు ధాటిగానే ఆడుతోంది. గేల్‌ మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తున్నాడు. సిక్సుల వర్షం కురిపిస్తున్నాడు. గేల్‌కి తోడుగా మంచి భాగస్వామ్యాన్ని అందించిన కరుణ్ నాయర్ 21 బంతుల్లో ఒక సిక్సు, 3 ఫోర్లతో (31) స్కోరును చేశాడు.


మయాంక్ అవుట్:

సిద్దార్ కౌల్ బౌలింగ్‌లో భారీ షాట్ కు యత్నించిన మయాంక్ అగర్వాల్ క్యాచ్ ఇవ్వడంతో హుడా చేతికి చిక్కింది. 9 బంతుల్లో 18 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.


తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ జట్టు:

బర్త్ డే బాయ్ కేఎల్ రాహుల్ ఎల్బీడబ్ల్యూ కింద అవుట్ అయ్యాడు. క్రిస్ గేల్‌తో పాటుగా ఓపెనర్‌గా దిగిన కేఎల్ రాహుల్ 3 ఫోర్ల సాయంతో 21బంతులకు 18పరుగులు చేశాడు. గేల్ విధ్వంసం కొనసాగుతూనే ఉంది.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు

ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

ఇప్పటివరకూ కింగ్స్‌ పంజాబ్‌ రెండు మ్యాచ్‌లు గెలిస్తే, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ విజయాల్ని నమోదు చేసింది. ఈ క‍్రమంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్‌ మరో గెలుపుపై కన్నేసింది. అయితే కింగ్స్‌ పంజాబ్‌ సాధించిన రెండు విజయాలు సొంత మైదానంలో రావడంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది.

ఇరు జట్లు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో పటిష్టంగా ఉండటంతో ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, సన్‌రైజర్స్‌ మాత్రం ఒక మార్పు చేసింది. స్టాన్‌ లేక్‌ స్థానంలో క్రిస్‌ జోర్డాన్‌ను తుది జట్టులోకి తీసుకుంది.


ఇరు జట్ల ఆటగాళ్లు:

పంజాబ్ జట్టు Lokesh Rahul (wk), Chris Gayle, Mayank Agarwal, Yuvraj Singh, Aaron Finch, Karun Nair, Ravichandran Ashwin (c), Andrew Tye, Barinder Sran, Mohit Sharma, Mujeeb Ur Rahman

హైదరాబాద్ జట్టు Wriddhiman Saha (wk), Shikhar Dhawan, Kane Williamson (c), Manish Pandey, Shakib Al Hasan, Deepak Hooda, Yusuf Pathan, Chris Jordan, Bhuvneshwar Kumar, Rashid Khan, Siddarth Kaul

Story first published: Friday, April 20, 2018, 0:04 [IST]
Other articles published on Apr 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X