వికెట్ తీసి కోహ్లీని అసభ్య పదజాలంతో దూషించిన రాణా (వీడియో)

Posted By:
IPL 2018, KKR v RCB: Nitish Rana abuses Virat Kohli after taking his wicket, video goes viral

హైదరాబాద్: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బ్యాట్స్‌మన్‌ నితీష్‌ రాణాపై విరాట్ కోహ్లీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 11వ సీజన్‌లో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్‌లో నితీష్‌ రాణా అనుహ్యంగా వరుస బంతుల్లో విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌, కోహ్లీలను పెవిలియన్‌కు పంపిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేసిన రాణా పెద్దగా అరుస్తూ అతడిని అసభ్యంగా దూషించాడు. ఇది టీవీ రిప్లేలో స్పష్టంగా కనిపించడంతో కోహ్లీ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.

ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్‌ నెట్టింట్లో వైరల్‌ అయ్యాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా రాణా తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. 'ఒక్కసారి ఔట్‌ చేసినందుకు అంతలా ఎగిరిపడాలా' అని నెటిజన్ ప్రశ్నంచగా... 'కోహ్లీ భారత కెప్టెన్‌.. అతనికి నీవుచ్చే గౌరవం ఇదేనా' అని కామెంట్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అనంతరం 177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 9, 2018, 19:27 [IST]
Other articles published on Apr 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి