బ్రావో ..బాలీవుడ్ హీరోయిన్ ప్రేమలో పడ్డాడు..?

Posted By:
IPL 2018: CSK’s Dwayne Bravo Spotted With This Actress

హైదరాబాద్: చెన్నై సూప‌ర్‌కింగ్స్ ఆటగాడు, వెస్టిండీస్ జ‌ట్టు మాజీ కెప్టెన్ ..డేన్ బ్రావో ప్రేమలో పడ్డట్లు సమాచారం. బాలీవుడ్ న‌టి, 2006 మిస్ ఇండియా న‌టాషా సూరితో ప్రేమాయ‌ణం సాగిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వీరిద్ద‌రూ ఈ మధ్య తెగ తిరిగేస్తున్నారట. ఈ క్రమంలోనే ముంబైలోని ఓ కాఫీ షాప్‌లో ఉండటం మీడియా కంట‌ప‌డింది. అలాగే బ్రావోతో దిగిన ఫోటోల‌ను న‌టాషా త‌న సోష‌ల్ మీడియాల్లో పోస్ట్ చేసింది.

బ్రావోకు, న‌టాషాకు దాదాపు ప‌దేళ్ల నుంచి ప‌రిచ‌యం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆ ప‌రిచ‌యంతోనే ప్ర‌స్తుతం ఐపీఎల్ కోసం ముంబై వెళ్లిన బ్రావో న‌టాషాతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడ‌ట‌. క్రికెట్ స్టేడియంలో బ్రావో ఏర్పాటు చేసిన వీఐపీ సీటింగ్‌లో సైతం కూర్చొని మ్యాచ్ చూస్తుందట. బ్రావో గురించి మాట్లాడుతూ..నటాషా అతనొక జెంటిల్‌మాన్ అంటూ చెప్పుకొస్తుంది. పదేళ్ల క్రితం బ్రావోను ఓ ఫన్నీ సంఘటన ద్వారా కలిశానని తర్వాత మళ్లీ న్యూయార్క్‌లో జరిగిన IIFA అవార్డుల ప్రదానోత్సవం అప్పుడే మళ్లీ అతన్ని కలిశానంటూ చెప్పుకొచ్చింది నటాషా.

బ్రావో ఇటీవ‌ల త‌న భార్య‌కు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో న‌టాషాతో బ్రావో ప్రేమాయ‌ణం సాగిస్తున్నాడని బాలీవుడ్ మీడియా వార్త‌లు రాస్తోంది. అయితే న‌ట‌షా స‌న్నిహితులు మాత్రం వారిది స్నేహం మాత్ర‌మేన‌ని, ప్రేమ కాద‌ని చెబుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఐపీఎల్ 11వ సీజన్ లో భాగంగా ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన రెండు మ్యాచ్ లలోనూ దిగ్విజయంగా దూసుకొచ్చింది. ప్రత్యర్థులతో హోరాహోరీగా పోరాడి అద్భుతమైన టర్నింగ్ పాయింట్లతో రెండు విజయాలను నమోదు చేసింది. రెండేళ్ల అనంతరం మళ్లీ సీజన్ లోకి అడుగుపెట్టిన చెన్నై జట్టు ఇలాంటి విజయాలను నమోదు చేసుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతుంది. అయితే చెన్నై జట్టు మ్యాచ్‌లను ఇకపై సొంతగడ్డపై ఆడేందుకు వీలు లేకుండా పోయింది. కావేరీ జలాల విషయమై స్థానికంగా తొలి నుంచి ఐపీఎల్‌ను వ్యతిరేకిస్తున్న చెన్నైవాసులు ఆందోళనను తీవ్రతరం చేయడంతో చివరకు బీసీసీఐ కిందకు దిగింది. తర్వాత జరగబోయే మ్యాచ్ నుంచి పూణెలో నిర్వహిస్తామని ప్రకటించింది. రవాణా సదుపాయాల రీత్యా పూణె బాగుంటుందని బీసీసీఐ నిర్ణయం.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Thursday, April 12, 2018, 17:09 [IST]
Other articles published on Apr 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి