న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018: స్లాగ్ ఓవర్లలో ఎక్స్‌పర్ట్ అవ్వడానికి ధోనినే కారణం

By Nageshwara Rao
IPL 2018: Bravo credits Dhoni for shaping him up as slog overs expert

హైదరాబాద్: స్లాగ్ ఓవర్లలో నమ్మకంగా బంతులు విసరగలుగుతున్నానంటే అందుకు కారణం ధోనీయేనని చెన్నై సూపర్ కింగ్స్‌ ఆటగాడు డ్వేన్ బ్రావో అన్నాడు. డెత్ ఓవర్‌ స్పెషలిస్టుగా పేరు సంపాదించడానికి, ఆటలో ఈ స్థాయిలో డెవలప్ అవ్వడానికి ధోనినే ప్రత్యక్షంగా తోడ్పాటునందించినట్లు బ్రావో పేర్కొన్నాడు.

రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని ఆటగాళ్లు ఇప్పటికే చెన్నైకు చేరుకుని చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ప్రాక్టీస్ అనంతరం మంగళవారం డ్వేన్ బ్రావో మాట్లాడుతూ 'ధోని నా మీద ఎంతో నమ్మకాన్ని ఉంచాడు. దానికనుగుణంగానే నేను ఎప్పుడూ సిద్ధమవుతుంటాను' అని అన్నాడు.

'ముఖ్యంగా ప్రాక్టీస్‌ సెషన్‌లో చివరి ఓవర్లలో అతనికి బౌలింగ్‌ వేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటాను. ప్రపంచంలోనే బెస్ట్‌ ఫినిషర్‌గా అతనికి మంచి పేరు ఉంది. అలాంటి ధోనికి చివరి ఓవర్లలో బౌలింగ్‌ చేయడం సవాలుగా తీసుకుంటాను. అదే విధంగా కెప్టెన్‌గా ధోని, ఆటగాళ్లు తమ అభిప్రాయాలు వ్యక్తపరచడంలో పూర్తి స్వేచ్ఛనిస్తాడు' అని బ్రావో పేర్కొన్నాడు.

ముఖ్యంగా వారి చేసిన తప్పుల నుంచే అన్ని నేర్చుకోవాలని ధోని చెప్తుంటాడని తెలిపాడు. ఐపీఎల్ 2018 సీజన్ ఏప్రిల్‌ 7న ప్రారంభం కానుంది. తోలి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఈ సీజన్‌ను ఘనంగా ఆరంభించాలని చూస్తున్నట్లు బ్రావో తెలిపాడు.

2011-15 ఐపీఎల్‌ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడిన బ్రావో ఇప్పటి వరకూ 706 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లో 79 వికెట్లు తీసుకున్నాడు. టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రెండు సార్లు పర్పుల్‌ క్యాప్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.

Story first published: Wednesday, March 28, 2018, 7:44 [IST]
Other articles published on Mar 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X