న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెహ్వాగ్‌కు ఓకే: ఆప్ఘన్, యూఏఈ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు

By Nageshwara Rao
IPL 2018 auction: KXIP Team Director Virender Sehwag hints at picking Afghanistan, UAE players

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలోని క్యాష్ రిచ్ టోర్నీల్లో ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది. కొంతమంది క్రికెటర్లకు కాసుల వర్షం కూడా కురిపించింది. ఐపీఎల్ 2016లో నిర్వహించిన వేలం బరిలో ఆప్ఘనిస్థాన్‌కు చెందిన ఐదురుగు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఇద్దరు ప్లేయర్లు ఉన్నారు.

వీరిలో ఆప్ఘనిస్థాన్‌కు చెందిన మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్‌లను సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ వేలంలో కొనుగోలు చేసింది. అయితే వీరిద్దరూ అంచనాలకు తగ్గట్లే రాణించారు. ఐపీఎల్ 10 సీజన్‌లో రషీద్ ఖాన్ ఓ సంచలన స్పిన్నర్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరు ఆటగాళ్లు మరోసారి వేలంలోకి రానున్నారు. ఐపీఎల్ 2018 కోసం ఫిబ్రవరిలో జరిగే వేలంలో ఆప్ఘనిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఆటగాళ్లు మరిన్ని అవకాశాలు దక్కనున్నాయా? అంటే అవుననే అంటున్నారు టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.

ఇటీవలే షార్జా వేదికగా జరిగిన టీ10 లీగ్‌లో మరాఠా అరేబియన్స్ జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ టీ10 లీగ్‌లో ఆడిన యువ క్రికెటర్లు సెహ్వాగ్‌ను ఎంతగానో ఆకట్టుకున్నారట. దీంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు డైరెక్టర్ హోదాలో సెహ్వాగ్ వేలంలో వారిని ఎంపిక చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

టీ10 లీగ్‌లో ఆడిన కొందరు ఆటగాళ్లు ఐపీఎల్‌కు అతికినట్టు సరిపోతారని సెహ్వాగ్ ఓ జాతీయ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నాడు. 2018 ఐపీఎల్ కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఇప్పటి నుంచే కసరత్తులు మెదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ జట్టు టీ20 క్యాంపెయినర్ అయిన బ్రాడ్ హాడ్జిని కోచ్‌గా నియమించుకుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 19, 2017, 15:22 [IST]
Other articles published on Dec 19, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X