న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018 వేలం: యువీ, భజ్జీ, గంభీర్ బ్రేస్ ప్రైజ్ ఎంతో తెలుసా?

By Nageshwara Rao
IPL 2018 Auction: Harbhajan Singh, Yuvraj Singh, Gautam Gambhir's base price revealed

హైదరాబాద్: జనవరి 4న ముగిసిన ఐపీఎల్ ప్లేయర్ రిటెన్షన్ ప్రాసెస్‌లో ఐపీఎల్ ప్రాంఛైజీలు కొందరు ఆటగాళ్లను అట్టిపెట్టుకుని మరికొందరు ఆటగాళ్లను వేలానికి వదిలేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2018 సీజన్ కోసం జనవరి 27, 28వ తేదీల్లో బెంగుళూరు వేదికగా ఆటగాళ్ల వేలం జరగనుంది.

ఇందులో భాగంగా పలువురు వెటరన్ క్రికెటర్లు వేలంలో పాల్గొంనేందుకు గాను తమ తమ బేస్ ధరలను ప్రకటించారు. బిడ్డింగ్ ప్రాసెస్‌లో బేస్ ధరలను ప్రకటించిన ఆటగాళ్ల జాబితాలో హార్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీలు తదితరులు ఉన్నారు. ఈ ముగ్గురూ వెటరన్ క్రికెటర్లు కావడం విశేషం.

అంతేకాదు ప్రస్తుతం జాతీయ జట్టులో కూడా చోటు కోల్పోయినప్పటికీ తమ బేస్ ధరను రూ. 2 కోట్లుగా ప్రకటించుకున్నారు. ఐపీఎల్ 2018 వేలంలో నిర్వహాకులు ఆటగాళ్ల బేస్ ధరలను రూ. 50 లక్షలు, రూ. కోటి, రూ. కోటిన్నర, రూ. 2 కోట్లుగా నిర్ధారించారు.

టైమ్స్ ఆఫ్ ఇండియాలో వార్తా కథనం ప్రకారం గౌతమ్ గంభీర్, హార్భజన్ సింగ్‌లు తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా ప్రకటించుకున్నారు. వీరితో ఐపీఎల్ 2018 వేలంలో టాప్ ఆటగాళ్ల జాబితాలో యువరాజ్ సింగ్, వెస్టిండిస్‌కు చెందిన క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్, న్యూజిలాండ్‌కు చెందిన బ్రెండన్ మెక్‌కల్లమ్ తదితరులు ఉన్నారు.

టీమిండియా చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కూడా ఈ ఏడాది వేలంలోకి రానున్నారు. ఈ క్రమంలో చాహల్ తన బేస్ ధరను రూ. 2 కోట్లుగా ప్రకటించుకున్నాడు. వీరితో పాటు యూసఫ్ పఠాన్ బేస్ ధర రూ. 75 లక్షలుగా ఉంది. ఇటీవలే యూసఫ్ పఠాన్ డోపీగా దొరకడంతో అతడిపై బీసీసీఐ ఆరునెలల పాటు నిషేధం విధించింది.

అయితే ఈ నిషేధం ఫిబ్రవరితో ముగుస్తుండటం విశేషం. ఇక యూసఫ్ పఠాన్ సోదరుడు ఇర్ఫాన్ పఠాన్ కూడా తన కనీస ధరను రూ. 50 లక్షలుగా ప్రకటించాడు. ఐపీఎల్ 2018 సీజన్‌లో పై ఆటగాళ్లు ప్రకటించుకున్న ధరకే ప్రాంఛైజీలు కొనుగోలు చేస్తాయో లేక ఇంకాస్త తక్కువ ధరకే అమ్మూడుపోతారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 11, 2018, 17:34 [IST]
Other articles published on Jan 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X