'కోహ్లీ నా ఫేవరేట్ ప్లేయర్, అతని వికెట్ నేనే తీయాలి'

Posted By:

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా ఆదివారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయంలో బౌలర్ సందీప్ శర్మ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. నాలుగు ఓవర్లు వేసిన సందీప్ శర్మ 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

తద్వారా ఢిల్లీపై పంజాబ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో కొనసాగుతోంది. మ్యాచ్ అనంతరం సందీప్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో రెండో అర్ధభాగం జరుగుతోందని, ఫ్లే ఆఫ్‌కి చేరాలని ప్రతి జట్టు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నాడు.

పంజాబ్ జట్టు లీగ్‌లో ఆడేందుకు ఇంకా ఐదు మ్యాచ్‌లే మిగిలున్నాయని, తదుపి మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చి ప్లేఆఫ్‌కి చేరాలని జట్టు భావిస్తోందని సందీప్ పేర్కొన్నాడు. టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్లు సత్తా చాటే అవకాశం ఉందని, అయితే బౌలర్లు కూడా వికెట్లు తీసి సత్తా చాటొచ్చని తెలిపాడు.

IPL 2017: Virat Kohli is my favourite player, says Kings XI Punjab's (KXIP) Sandeep Sharma

నిజానికి సొంతగడ్డపై ఆడటం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుందని, ఇక్కడి పరిస్థితులు కూడా మనకు అనుకూలిస్తాయని సందీప్ చెప్పుకొచ్చాడు. డే మ్యాచ్‌ల్లో ఇక్కడ వికెట్ స్లోగా ఉంటుందన తనకు ముందే తెలియడం వల్ల బ్యాట్స్‌మెన్లపై ఒత్తిడి పెంచగలిగామని చెప్పాడు.

చెత్తగా ఆడి చిత్తుగా ఓడిన ఢిల్లీ: 67 రన్స్‌కు ఆలౌట్, వికెట్ పోకుండా పంజాబ్ విన్

టోర్నీలో భాగంగా పంజాబ్ తదుపరి మ్యాచులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంంది. 'విరాట్‌ కోహ్లీ నా అభిమాన బ్యాట్స్‌మెన్‌. ఈ మ్యాచ్‌లో అతని వికెట్‌ నేనే తీయాలనుకుంటున్నా. తోటి ఆటగాడు ఆమ్లా, మార్గనిర్దేశకుడు వీరేంద్ర సెహ్వాగ్‌ ఇచ్చిన విలువైన సలహాలు నాకెంతో స్ఫూర్తినిచ్చాయి' అని సందీప్‌ తెలిపాడు.

Story first published: Monday, May 1, 2017, 17:04 [IST]
Other articles published on May 1, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి