ఐపీఎల్లో 6వ ఓటమి: బెంగళూరు ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం?

Posted By:

హైదరాబాద్: గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ పదో సీజన్‌లో చెత్త ప్రదర్శనను కనబరుస్తోంది. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న బెంగళూరు ఏమాత్రం పాఠాలు నేర్చుకున్నట్టు కనిపించడం లేదు.

కోహ్లీసేన ఘోర ఓటమి: పూణె Vs బెంగళూరు మ్యాచ్ హైలెట్స్

గురువారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమి పాలై ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. బెంగళూరు జట్టు బలం బ్యాటింగ్. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉన్న బెంగళూరు జట్టు చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేయడం అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది.

అంతేకాదు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న గుజరాత్ లయన్స్ బెంగళూరుపై విజయం సాధించి నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. గురువారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది.

IPL 2017: RCB's play-off chances over after 6th loss?

తద్వారా ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో బెంగళూరు ఆలౌటైంది. ఒకానొక దశలో బెంగళూరు 5 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్‌లో మరో చెత్త రికార్డుని సృష్టిస్తుందేమోనని అభిమానులు భావించారు.

అయితే ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పవన్ నేగి 32 (19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేదార్ జాదవ్ 31 (18 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులు చేయగలిగింది. అనంతరం 135 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ అరోన్ ఫించ్ రాణించడంతో 13.5 ఓవర్లలోనే విజయం సాధించింది.

34 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 72 పరుగులు చేసిన ఫించ్ బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన 9 మ్యాచుల్లో ఆరింటిలో ఓడి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా, ఆడిన 8 మ్యాచుల్లో మూడింటిలో గెలిచిన గుజరాత్ లయన్స్ ఆరోస్థానంలో నిలిచింది.

గురువారం నాటి మ్యాచ్‌తో పదేళ్ల ఐపీఎల్‌లో బెంగళూరు 14 సార్లు ఆలౌటైంది. దీంతో రాజస్ధాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల సరసన నిలిచింది. ఏడుగురు బెంగళూరు ఆటగాళ్లు డబుల్ డిజిట్ ను అందుకోలేకపోయారు. ఐపీఎల్ పదో సీజన్‌లో ఆర్సీబీ మిగతా మ్యాచ్‌లు:

April 29 (Saturday) - Vs Pune in Pune - 4 PM IST
May 1 (Monday) - Vs Mumbai in Mumbai - 4 PM
May 5 (Friday) - Vs Punjab in Bengaluru - 8 PM
May 7 (Sunday) - Vs Kolkata in Bengaluru - 4 PM
May 14 (Sunday) - Vs Delhi in Delhi - 8 PM

Story first published: Friday, April 28, 2017, 15:04 [IST]
Other articles published on Apr 28, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి