యువీ 25వ అర్ధసెంచరీ: ఢిల్లీతో సన్‌రైజర్స్, మ్యాచ్ హైలెట్స్

Posted By:

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. ఢిల్లీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని యువరాజ్ (41 బంతుల్లో 70 నాటౌట్‌; 11 ఫోర్లు, ఒక సిక్సు)తో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్‌ 3 వికెట్ల కోల్పోయి 185 పరుగులు చేసింది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

30 పరుగుల వద్ద ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు సంజూ శాంసన్ ఇచ్చిన లైఫ్‌ని యువరాజ్ సింగ్ సద్వినియోగం చేసుకున్నాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(21 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్సు), శిఖర్‌ ధావన్‌ (17 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్సు)తో చక్కటి శుభారంభం అందించారు.

 Yuvraj Singh slams 25th T20 fifty

ఆరో ఓవర్‌లో కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను షమీ ఎల్బీగా అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు వీరిద్దరూ 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విలియమ్సన్‌(24 బంతుల్లో 24)తో కలిసి ధావన్‌ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలో అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి ధావన్‌ పెవిలియన్‌ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ నెమ్మదిగా ఆడుతూ స్కోరుబోర్డుని పరుగులెత్తించాడు. ఈ క్రమంలో మూడో వికెట్‌గా విలియమ్సన్‌ పెవిలియన్‌కు చేరాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హెన్రిక్స్‌తో కలిసి యువరాజ్ సింగ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. వీరిద్దరి జోడీ చివరి నాలుగు ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ 41 బంతుల్లో 11 ఫోర్లు 1 సిక్సర్‌ సాయంతో 70 పరుగులతో రాణించాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ Vs ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్ హైలెట్స్:

* 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డేవిడ్ వార్నర్ పేసర్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
* 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అమిత్ మిశ్రా బౌలింగ్‌లో రెండో వికెట్‌గా ధాన్ అవుటయ్యాడు.
* మహ్మద్ షమీ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.
* 35 బంతుల్లో యువరాజ్ సింగ్ అర్ధసెంచరీని పూర్తి చేశాడు.
* టీ20ల్లో యువీకి ఇది 25వ అర్ధసెంచరీ.
* క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ ఇచ్చిన క్యాచ్‌ని ఢిల్లీ ఆటగాడు సంజూ శాంసన్ మిస్ చేశాడు.
* సన్ రైజర్స్ ఆల్ రౌండర్ హెన్రిక్స్‌ ఈ మ్యాచ్‌లో యువీకి మంచి సపోర్ట్ ఇచ్చాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 51 బంతుల్లో 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
* ఢిల్లీ బౌలర్లలో రబాడ ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడు.
* నాలుగు ఓవర్లు వేసిన రబాడ 59 పరుగులిచ్చాడు.

Story first published: Tuesday, May 2, 2017, 23:22 [IST]
Other articles published on May 2, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి