ఐపీఎల్: ఎట్టకేలకు 'బయట' బోణి చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

Posted By:

హైదరాబాద్: మొహాలి వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. 208 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది.

తాజా విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వేరే వేదికపై బోణి కొట్టింది. పంజాబ్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్ష్‌ 50 బంతుల్లో 84 పరుగులతో రాణించాడు. మ్యాక్స్‌వెల్‌ డకౌట్‌గా వెనుదిరిగినా, ఆ వెంటనే వచ్చిన మోర్గాన్‌‌తో కలిసి మార్ష్‌ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు.

SRH

ఈ క్రమంలో 21 బంతుల్లో 26 పరుగులు చేసిన మోర్గాన్‌... రషీద్‌ఖాన్‌ బౌలింగ్‌లో దీపక్ హూడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం అనభువనేశ్వర్‌ బౌలింగ్‌లో మార్ష్‌ కూడా పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సాహా 2, అక్షర పటేల్ 16, అనిరుథ్ సింగ్ 15, మోహిత్ శర్మ 2 పరుగులతో నిరాశపరిచారు.

సన్ రైజర్స్ బౌలర్లలో ఆశిష్ నెహ్రా, సిద్ధార్ద్ కౌల్ చెరో మూడు వికెట్లు తీయగా భువనేశ్వర్ కుమార్ రెండు, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశారు.

పంజాబ్ విజయ లక్ష్యం 208

మొహాలిలో పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. దీంతో పంజాబ్‌కు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్‌లు చెలరేగారు.

ఈ ఇద్దరూ పవర్ ప్లేలో 60 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో వార్నర్ 25 బంతుల్లో అర్ధసెంచరీ చేయగా, ధావన్ 31 బంతుల్లో అర్ధ సెంచరీ చేశారు. ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో వార్నర్ 51 ( 4 ఫోర్లు, 4 సిక్సర్లు)ను అవుట్ చేయడంతో 107 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

వార్నర్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్ కూడా చెలరేగి ఆడాడు. ఈ క్రమంలో శిఖర్ ధావన్ (48 బంతుల్లో 77; 9 ఫోర్లు, ఒక సిక్సు) మోహిత్ శర్మ బౌలింగ్‌లో ఓ భారీషాట్‌కు ప్రయత్నించి మ్యాక్స్ వెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువరాజ్ (15) పరుగుల వద్ద అవుటయ్యాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హెన్రిక్స్‌తో విలియమ్సన్ కలిసి స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. ఈ సమయంలో విలియమ్సన్ (27 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్ల)తో అర్ధసెంచరీని పూర్తి చేశాడు. ఇక పంజాబ్ బౌలర్లలో మాక్స్ వెల్ రెండు వికెట్లు తీసుకోగా, మోహిత్ శర్మకు ఒక వికెట్ దక్కింది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శుక్రవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. మొహాలిలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరబాద్ విజయం సాధించింది.

KXIP win the toss and elect to field

దీంతో ఈ మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వేరే వేదికపై గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు హైదరాబాద్ వేరే వేదికపై విజయం సాధించలేదు.

సన్‌రైజర్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్ యువరాజ్‌ సింగ్‌ సొంత మైదానం మొహాలిలో ఈ మ్యాచ్ జరుగుతోంది. అనారోగ్యం కారణంగా గత మ్యాచ్‌‌లో ఆడని యువరాజ్ సింగ్, పేసర్‌ ఆశిష్ నెహ్రా తిరిగి తుది జట్టులోకి వచ్చారు.

సన్ రైజర్స్ హైదరాబాద్‌:
డేవిడ్ వార్నర్(కెప్టెన్), శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్, హెన్రిక్స్, యువరాజ్ సింగ్, దీపక్ హుడా, నమాన్ ఓజా, భువనేశ్వర్ కుమర్,ఆశిష్ నెహ్రా, సిద్ధార్ధ కౌల్, రషిద్ ఖాన్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
మ్యాక్స్ వెల్(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, వోహ్రా, షాన్ మార్ష్, ఇయాన్ మోర్గాన్, సాహా, అక్షర్ పటేల్, మోహిత్ శర్మ, అనురీత్ సింగ్, ఇషాంత్ శర్మ,కేసీ కరియప్ప

Story first published: Friday, April 28, 2017, 20:11 [IST]
Other articles published on Apr 28, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి