న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంపైర్ల నిర్ణయంపై అసహనం.. పోలార్డ్‌కు జరిమానా

IPL 2019 Final : Kieron Pollard Fined 25% Of Match Fee In IPL Final Match || Oneindia Telugu
IPL 20019, CSK vs MI: Kieron Pollard Fined For Showing Dissent At Umpires Decision

ఐపీఎల్-12 ఫైనల్ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ల నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన ముంబై బ్యాట్స్‌మన్‌ కీరన్ పోలార్డ్‌కు భారీ జరిమానా పడింది. అతని మ్యాచ్‌ ఫీజులో 25శాతం జరిమానా విధించినట్లు ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య ఆదివారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతి వరకు కొనసాగిన ఈ థ్రిల్లర్‌ మ్యాచ్‌లో కేవలం ఒకే పరుగు తేడాతో ముంబై విజేతగా నిలిచింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ట్రామ్‌లైన్స్‌ దాటి వెళ్లినా:

టాస్ గెలిచి ముంబై జట్టు మొదటగా బ్యాటింగ్ చేస్తుంది. చెన్నై బౌలర్‌ డ్వేన్‌ బ్రావో చివరి ఓవర్ వేస్తున్నాడు. చివరి ఓవర్‌లోని రెండు, మూడు బంతులు ట్రామ్‌లైన్స్‌ (వైడ్ లైన్) దాటి దూరంగా వెళ్లాయి. మొదటి బంతిని ఆడేందుకు ప్రయత్నించిన పొలార్డ్‌.. రెండో బంతి దూరంగా వెళ్లడంతో వైడ్‌గా భావించి షాట్ ఆడకుండా వదిలేసాడు. వైడ్‌గా వెళ్లినా ఈ రెండు బంతులను ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ లీగల్‌ బంతులుగానే ప్రకటించాడు.

గాల్లోకి బ్యాటు:

గాల్లోకి బ్యాటు:

ట్రామ్‌లైన్స్‌ దూరంగా బంతులు వెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా.. అంపైర్‌ వైడ్‌ ఇవ్వకపోవడంతో పొలార్డ్‌ అసహనానికి లోనయ్యాడు. దీంతో పొలార్డ్‌ బ్యాటును గాల్లోకి ఎగరవేశాడు. అనంతరం నాలుగో బంతిని వేసేందుకు బ్రావో రన్నింగ్ చేస్తుండగా.. అంతకుముందు బంతులు ఎక్కడ నుంచి వెళ్ళాయో అక్కడ (ట్రామ్‌లైన్స్‌) నిలబడి బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. అనంతరం పొలార్డ్‌ వికెట్లకు పూర్తిగా పక్కకు జరగడంతో.. బ్రేవో బంతిని వేయలేదు. ఇద్దరు అంపైర్లు పోలార్డ్‌ వద్దకు వచ్చి మాట్లాడారు.

25శాతం జరిమానా:

25శాతం జరిమానా:

అంపైర్ల నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో.. మ్యాచ్‌ అనంతరం రిఫరీ పోలార్డ్‌పై చర్యలు తీసుకున్నాడు. ఐపీఎల్ లెవల్-1 2.8 ప్రకారం పోలార్డ్‌ మ్యాచ్‌ ఫీజులో 25శాతం జరిమానా విధించారు. ఈ విషయాన్ని ఐపీఎల్‌ క్రమశిక్షణ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది.

Story first published: Monday, May 13, 2019, 12:35 [IST]
Other articles published on May 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X