న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గవాస్కర్‌ సలహా పాటించా.. ఆ సమస్యను అధిగమించా: ఇంజమామ్‌

Inzamam-ul-Haq reveals how Sunil Gavaskars advice helped him tackle short balls

ఇస్లామాబాద్: భారత్-పాకిస్తాన్ మధ్య వాతావరణం ఎప్పుడూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది. క్రికెట్‌లో అభిమానుల్లో అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ఇరు జట్ల మధ్య మ్యాచ్ అంటే.. ఫాన్స్ అదో మినీ యుద్ధంలా ఫీల్ అయిపోతారు. ఇక ఆటగాళ్లు కూడా ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉంటారు. అయితే పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్‌హక్ భారత లెజెండ్ సునీల్‌ గవాస్కర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. బ్యాటింగ్‌లో గవాస్కర్ సలహా పాటించడం వల్లే తన కెరీర్ మలుపు తిరిగిందని చెప్పుకొచ్చాడు.

ఇంజమామ్‌కు సరళమైన, చిన్న సలహాలు ఇవ్వడం ద్వారా షార్ట్ పిచ్ డెలివరీ సమస్యను ఎలా అధిగమించాలో సునీల్‌ గవాస్కర్‌ తనకు సాయపడిన విషయాన్ని ఇటీవల తన యూట్యూబ్ చానల్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో వివరించాడు. 1992లో ఆస్ట్రేలియాలో ప్రపంచ కప్ తర్వాత తాను ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లానని, అక్కడ షార్ట్‌ పిచ్‌ డెలివరీలను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఇంజమామ్‌ అన్నాడు.

'ఆస్ట్రేలియాలో జరిగిన 1992 ప్రపంచకప్‌లో అంతకుముందే విజయ పతాకం ఎగురవేశాం. తరువాత మొదటి సారిగా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాను. అక్కడి పరిస్థితులు నాకు అసలు తెలియదు. దాంతో షార్ట్ పిచ్‌ బంతులు ఎదుర్కోవడం చాలా కష్టతరమైంది. అయితే అప్పటికి ఏదో చారిటీ మ్యాచ్‌ కోసం గవాస్కర్ ఇంగ్లాండ్‌లో ఉన్నారు. ఆ మ్యాచ్‌లో నేను కూడా ఆడాల్సి ఉంది. అలా ఆయనను కలిశాను. వెంటనే నా ఇబ్బందిని వివరించాను. వెంటనే ఆయన షార్ట్ పిచ్ బంతుల గురించి ఆలోచించడం, భయపడడం మానేయమని చెప్పారు' అని ఇంజీ తెలిపాడు.

'బౌలర్ బంతి వేయగానే ఆ బంతి ఏలాంటిదో అర్థమైపోతుందని, అందువల్ల బౌలర్ బంతిని వదిలే వరకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోమని గవాస్కర్ చెప్పారు. అదే తరహాలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాను. దాంతో ఆ తరువాత షార్ట్ బంతులను ఎదుర్కోవడం సులభతరమైంది. ఆ ఒక్క సలహా నా కెరీర్‌కు కూడా ఎంతగానో ఉపయోగపడింది. 1992 నుంచి నేను పదవీ విరమణ చేసిన సమయం వరకు, నేను మళ్లీ ఆ సమస్యను ఎదుర్కోలేదు' అని ఇంజమామ్ చెప్పుకొచ్చాడు. గవాస్కర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తాను లైవ్‌లో చూసి ఉండాల్సిందని, అలా చూడలేకపోవడం తన దురదృష్టమని ఇంజమామ్ చెప్పారు. ఇంజీ 120 టెస్టుల్లో 8830 పరుగులు, 378 వన్డేల్లో 11739 పరుగులు సాధించాడు.

నాట్‌వెస్ట్‌ సిరీస్‌కు 18 ఏళ్లు.. చొక్కా విప్పి బదులు తీర్చుకున్న గంగూలీ!!నాట్‌వెస్ట్‌ సిరీస్‌కు 18 ఏళ్లు.. చొక్కా విప్పి బదులు తీర్చుకున్న గంగూలీ!!

Story first published: Monday, July 13, 2020, 20:30 [IST]
Other articles published on Jul 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X