న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాతో వన్డే సిరిస్‌కు దేశంలోనే ఎత్తైన బౌలర్: ఎవరీ కైల్ జామిసన్?

Injury-hit New Zealand call countrys tallest bowler Kyle Jamieson for India ODIs

హైదరాబాద్: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియాతో తలపడేందుకు న్యూజిలాండ్ తమ దేశంలోని ఎత్తైన బౌలర్ కైల్ జామిసన్‌ను ఎంపిక చేసింది. కైల్ జామిసన్ ఎత్తు 6 అడుగుల 8 అంగుళాలు. ఆక్లాండ్‌కు చెందిన కైల్ జామిసన్‌కు ఇప్పటివరకు న్యూజిలాండ్ తరుపున ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు.

టీమిండియాతో వన్డే సిరిస్‌కు సీనియర్‌ బౌలర్లు బౌల్ట్‌, హెన్రీ, ఫెర్గూసన్‌ గాయాలతో బాధపడుతున్న వేళ యువ ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఇండియా-ఏపై అద్భుత ప్రదర్శన చేయడంతో భారత్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులో 25 ఏళ్ల కైల్ జామిసన్‌‌కు అవకాశం దక్కింది.

<strong>బుమ్రాకు ఉచిత సలహా.. సంజయ్‌ మంజ్రేకర్‌పై నెటిజన్ల ఫైర్‌!!</strong>బుమ్రాకు ఉచిత సలహా.. సంజయ్‌ మంజ్రేకర్‌పై నెటిజన్ల ఫైర్‌!!

ఫిబ్రవరి 5న తొలి వన్డే

ఫిబ్రవరి 5న తొలి వన్డే

మౌంట్ మాంగనూయి వేదికగా ఫిబ్రవరి 5న టీమిండియాతో జరిగే తొలి వన్డేలో కైల్ జామిసన్‌‌ ఆడనున్నాడు. కైల్ జామిసన్ న్యూజిలాండ్ తరుపున 26 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడి 5.44 ఎకానమీతో 33 వికెట్లు పడగొట్టాడు. 2014లో ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారిన కైలీ జామిసన్ న్యూజిలాండ్ ఏ జట్టుకు మూడు ఫార్మాట్లలోనూ 13 సార్లు ప్రాతినిథ్యం వహించాడు.

న్యూజిలాండ్ ఏ తరుపున 15 వికెట్లు

న్యూజిలాండ్ ఏ తరుపున 15 వికెట్లు

ఈ క్రమంలో అతడు 15 వికెట్లు పడగొట్టాడు. గతవారం ఇండియా-ఏతో క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశాడు. ఆఖరి ఓవర్‌లో 7 పరుగులను డిఫెండ్ చేయడంతో పాటు రెండు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్-ఏ జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ జామిసన్ రాణించగలడు.

మూడు హాఫ్ సెంచరీలు

మూడు హాఫ్ సెంచరీలు

లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో అతఢి ఖాతాలో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం టీ20 సిరిస్‌లో చక్కటి ప్రదర్శన చేస్తోన్న పేసర్లు కుగ్లెయిన్‌, బెన్నెట్‌‌లు కూడా టీమిండియాతో మూడు వన్డేల సిరిస్‌కు ఎంపికయ్యారు. స్పిన్నర్‌ ఇష్ సోధీని కూడా తొలి వన్డే కోసం ఎంపిక చేశారు.

టీమిండియాతో మూడు వన్డేల సిరిస్‌కు కివీస్ జట్టు:

టీమిండియాతో మూడు వన్డేల సిరిస్‌కు కివీస్ జట్టు:

కేన్ విలియమ్సన్‌ (కెప్టెన్‌), మార్టిన్ గప్టిల్‌, రాస్ టేలర్‌, కొలిన్ డీ గ్రాండ్‌హోమ్‌, టామ్‌ లాథమ్‌, జేమ్స్ నీషమ్‌, హెన్రీ నికోల్స్‌, మిచెల్ శాంట్నర్‌, బెన్నెట్‌, బ్లండెల్‌, కైల్ జేమిసన్‌, కుగ్లెయిన్‌, ఇష్ సోధీ, టిమ్ సౌథీ

Story first published: Friday, January 31, 2020, 15:48 [IST]
Other articles published on Jan 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X