న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDW vs SLW 2nd T20: స్మృతి సొగసైన బ్యాటింగ్.. హర్మన్ ప్రీతికరమైన ఫినిషింగ్‌తో సిరీస్ ఇండియా వశం..

INDW vs SLW 2nd T20: Harman Preet Economical Bowling, Steady Batting Helps to Seal Series with 2-0.

శ్రీలంక వుమెన్స్ vs ఇండియా వుమెన్స్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శనివారం దంబుల్లాలో జరిగిన రెండో మ్యాచ్‌లో స్మృతి మంధాన సొగసైన బ్యాటింగ్, హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ ఫినిషింగ్ వల్ల 5 వికెట్ల తేడాతో భారత్ శ్రీలంకపై అలవోకగా గెలుపొందింది. తద్వారా ఈ సిరీస్‌‌ను 2-0తో భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. ఇక రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 125పరుగుల చేసింది. ఆ జట్టులోని ఓపెనర్లు విష్మి గుణరత్నే (45), కెప్టెన్ ఆటపట్టు (43) మినహా మిగతా వాళ్లు పెద్దగా రాణించలేదు. ఇక భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు తీసుకుంది. ఇక రేణుక సింగ్, పూజా, రాధాయాదవ్, హర్మన్ ప్రీత్ కౌర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

 ఇండియాకు శుభారంభాన్ని ఇచ్చి స్మృతి మంధాన

ఇండియాకు శుభారంభాన్ని ఇచ్చి స్మృతి మంధాన

ఇక 126పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌కు మంచి శుభారంభం దక్కింది. స్మృతి మంధాన (39 పరుగులు 34బంతుల్లో 8ఫోర్లు), షఫాలి వర్మ (17పరుగులు 10బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్‌), సబ్బినేని మేఘన (17 పరుగులు 10బంతుల్లో 4ఫోర్లు) హిట్టింగ్ చేస్తూ ఆడారు. దీంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. ఇక పది ఓవర్లు ముగిసేసరికి 80పరుగులకు చేరుకుంది. ఇక స్మృతి మంధాన.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (31పరుగులు 32బంతుల్లో నాటౌట్)తో కలిసి 3వ వికెట్‌కు 38పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి 11వ ఓవర్ చివరి బంతికి 86పరుగుల వద్ద ఔటయ్యింది.

కడవరకు క్రీజులో ఉండి గెలిపించిన హర్మన్

కడవరకు క్రీజులో ఉండి గెలిపించిన హర్మన్

ఇక మంధాన ఔటవ్వడంతో స్కోరు వేగం కాస్త మందగించింది. ఇక కడవరకు తాను క్రీజులో ఉండాలని హర్మన్ ప్రీత్ కౌర్ నిదానంగా ఆడింది. అప్పటికే సాధించాల్సిన పరుగులు చాలా తక్కువగా ఉండడంతో భారత్ సునాయసంగా టార్గెట్ అందుకుంది. ఈ మధ్యలో మరో రెండు వికెట్లు కోల్పోయింది. ఇక 20వ ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టి హర్మన్ ప్రీత్ కౌర్ విజయ లాంఛనాన్ని ముగించింది. తద్వారా మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి లాంటి సీనియర్లు లేకున్నా.. సగర్వంగా ఇండియా సిరీస్ గెలిచింది. ఇక శ్రీలంక బౌలర్లలో రణిసింగే, రణవీర తలా 2వికెట్లు తీయగా.. సుగంధిక కుమారి 1వికెట్ తీసింది. ఇక ఈ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ 3ఓవర్లు వేసి కేవలం 12పరుగులే ఇచ్చి 1 వికెట్ తీయడంతో పాటు బ్యాటింగ్లో 31పరుగులు చేయడంతో ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

 తుది జట్లు

తుది జట్లు

శ్రీలంక : విష్మీ గుణరత్నే, చమరి ఆటపట్టు (కెప్టెన్), హర్షిత మాదవి, హాసిని పెరీరా, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని (వికెట్ కీపర్), ఓషది రణసింగ్, సుగండిక కుమారి, ఇనోకా రణవీర, ఉదేశిక ప్రబోధని

ఇండియా : షఫాలీ వర్మ, స్మృతి మంధాన, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), సబ్బినేని మేఘన, దీప్తి శర్మ, సిమ్రాన్ బహదూర్, పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్, రాధా యాదవ్

Story first published: Saturday, June 25, 2022, 18:18 [IST]
Other articles published on Jun 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X