Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా కప్‌లో గెలిచేదెవరు?: పాక్‌కే గెలిచే ఛాన్స్‌లెక్కువ!

Indian cricketers term Pakistan favourite team in Asia Cup

హైదరాబాద్: ఆసియా కప్ టోర్నీలో భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుకే గెలిచే ఛాన్స్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయని మాజీ పేసర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. టోర్నీలో భాగంగా గ్రూప్-ఏలో ఉన్న భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటికే చెరో మ్యాచ్ నెగ్గాయి. తొలి గ్రూప్‌ మ్యాచ్‌లో భారత్, పాక్ జట్లు హాంకాంగ్‌పై విజయం సాధించాయి.

ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి గ్రూప్-ఏలో టాపర్‌గా నిలవాలని ఇరు జట్లు ఊవిళ్లూరుతున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ "మొట్టమొదటిసారి, దాయాదుల పోరులో భారత్ జట్టు ఫేవరెట్ కాదని నాకు అనిపిస్తోంది. మన జట్టుతో పోలిస్తే పాకిస్థాన్ ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉంది" అని అన్నాడు.

"అంత మాత్రాన ఆ జట్టే గెలుస్తుందని నేను చెప్పడం లేదు. కానీ, భారత్‌‌తో పోలిస్తే పాక్‌కే గెలిచే ఛాన్స్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ టోర్నీలో విరామం లేకుండా పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడబోతోంది. భారత జట్టులో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడంతో పాక్‌‌ బలం మరింత పెరిగింది" అని అగార్కర్ వెల్లడించాడు.

కాగా, టోర్నీలో భాగంగా గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హాంకాంగ్‌‌ను 37.1 ఓవర్లలో కేవలం 116 పరుగులకే కుప్పకూల్చిన పాక్ అనంతరం లక్ష్యాన్ని 23.4 ఓవర్లలో 120/2తో అలవోకగా చేధించింది. కానీ, మంగళవారం అదే హాంకాంగ్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ జట్టు అతికష్టంగా 26 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (120 బంతుల్లో 127; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్‌లో 14వ సెంచరీతో చెలరేగగా, అంబటి రాయుడు (70 బంతుల్లో 60; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో రాణించారు.

అనంతరం 286 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ 240/3తో దాదాపు ఛేదించేసేలా కనిపించింది. కానీ చివర్లో భారత బౌలర్లు పుంజుకుని ఆ జట్టుని 259/8కి పరిమితం చేయడంతో 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో రాణించిన ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

Story first published: Wednesday, September 19, 2018, 15:50 [IST]
Other articles published on Sep 19, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+