న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చీకట్లో మా వికెట్లు తీశారంటూ డుప్లెసిస్‌ సంచలన వ్యాఖ్యలు.. మండిపడుతున్న అభిమానులు!!

Indian Cricket Fans Slams Faf du Plessis After His Comments On Team India || Oneindia Telugu
Indian cricket fans slams: Faf du Plessis Ridiculous Statement On Toss, India Thrashing

ఢిల్లీ: భారత బౌలర్లు చీకట్లో మా వికెట్లు తీశారు అని సంచలన వ్యాఖ్యలు చేసిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌పై భారత క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. బ్యాట్స్‌మన్‌, బౌలర్లు సమిష్టి ప్రదర్శన చేయడంతో.. మూడు టెస్టులలో రెండు టెస్టులు ఇన్నింగ్స్‌ పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘోర పరాభవాన్ని చవిచూసింది. అయితే దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ ఓటమికి కొత్త కారణం చెబుతూ.. టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనను కించపరిచాడు. చీకటిగా ఉన్న సమయంలో భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి.. ఆపై మూడు వికెట్లు తీసిందని అన్నాడు. ప్రతిమ్యాచ్‌ కాపీ, పేస్ట్‌లా సాగిందని చులకనగా మాట్లాడాడు.

<strong>కపిల్‌దేవ్‌తో గోల్ఫ్‌.. హర్భజన్‌ను ట్రోల్ చేసిన కోహ్లీ, యువీ</strong>కపిల్‌దేవ్‌తో గోల్ఫ్‌.. హర్భజన్‌ను ట్రోల్ చేసిన కోహ్లీ, యువీ

చీకట్లో మా వికెట్లు తీశారు:

చీకట్లో మా వికెట్లు తీశారు:

డుప్లెసిస్‌ మాట్లాడుతూ... 'ప్రతి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచేది. తొలుత బ్యాటింగ్‌ చేసి 500లకు పైగా పరుగులు సాధించేది. చీకటి పడుతుండగా ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసి.. చీకట్లో మమ్మల్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించి మూడు వికెట్లు పడగొట్టేది. దీంతో మూడో రోజు ఆట ఒత్తిడితో మేము కొనసాగించాల్సి వచ్చేది. ప్రతి టెస్టులోనూ ఇదే తంతు. కాపీ, పేస్ట్‌లా సాగిపోయింది' అని అన్నాడు.

మాజీల సహాయం అవసరం:

మాజీల సహాయం అవసరం:

'ఆతిధ్య జట్టు టాస్‌ గెలవపోతే పర్యాటక జట్టుకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. దక్షిణాఫ్రికాలో అంతే. మేము పచ్చిక మైదానంలో కూడా బ్యాటింగ్‌ చేయగలం. భారత్‌తో జరిగిన ఆఖరి టెస్టును గొప్పగా ప్రారంభించాం. కానీ.. తర్వాత తీవ్ర ఒత్తిడికి లోనయ్యాం. ఇప్పుడు దక్షిణాఫ్రికా క్రికెట్‌కు మాజీల సహాయం ఎంతో అవసరం. ఖర్చు ఎక్కువైనా మాజీ క్రికెటర్ల సేవలను ఉపయోగించుకోవాలి' అని డుప్లెసిస్‌ ఓ స్పోర్ట్స్‌ చానెల్‌లో వ్యాఖ్యానించాడు.

దక్షిణాఫ్రికా ఎప్పటికీ తేరుకోలేదు:

దక్షిణాఫ్రికా ఎప్పటికీ తేరుకోలేదు:

డుప్లెసిస్‌ వ్యాఖ్యలపై భారత అభిమానులు ట్విటర్‌లో మండిపడుతున్నారు. 'ఓటమికి సిల్లీ కారణాలు చెప్పకుండా గెలవడానికి ప్రయత్నించు' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'ఇలాంటి మానసిక స్థితి ఉన్న వ్యక్తి జట్టుకు కెప్టెన్‌గా ఉంటే దక్షిణాఫ్రికా ఎప్పటికీ తేరుకోలేదు అని మరో అభిమాని కామెంట్ చేసాడు. 'జట్టులో సీనియర్‌ ఆటగాడిగా ఉన్న నువ్వు.. ఇలాంటి వ్యాఖ్యలు చేసి నీపై ఉన్న అభిమానాన్ని పోగొట్టుకుంటున్నావు' అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డుప్లెసిస్‌ మారడు:

డుప్లెసిస్‌ మారడు:

'డుప్లెసిస్‌ మాటలు కోపం తెప్పించేవిగా ఉన్నాయి. అతన్ని తిట్టాలనుంది. కానీ.. సీఎస్‌కే ఆటగాడు కదా అని వదిలేస్తున్నా', 'డుప్లెసిస్ చెప్పే సాకులు భయంకరంగా ఉన్నాయి', 'డుప్లెసిస్‌ను వదిలేద్దాం అనుకుంటే పొరబాటే. అతను మారడు', ''డుప్లెసిస్‌ను వదిలేయకుండా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుందాం', 'చిన్నపిల్లల మనస్తత్వం. కాపీ పేస్ట్‌లా మ్యాచ్‌లు సాగాయట' అని కామెంట్‌లు చేస్తున్నారు.

Story first published: Sunday, October 27, 2019, 18:43 [IST]
Other articles published on Oct 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X