న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫిరోజ్‌షా కోట్లలో 'విరాట్ కోహ్లీ' స్టాండ్‌!!

Indian Captain Virat Kohli to have a stand named him at Feroz Shah Kotla stadium in Delhi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డులు సృష్టిస్తున్న భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఢిల్లీ క్రికెట్‌ సంఘం (డీడీసీఏ) వినూత్నంగా సత్కరించనుంది. ఢిల్లీకి చెందిన కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ అరంగ్రేటం చేసి 11 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా డీడీసీఎ కోహ్లీని గౌరవించింది. డిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ఓ స్టాండ్‌కు కోహ్లీ పేరును పెట్టింది. ఈ విషయాన్ని డీడీసీఎ తన ట్విటర్‌ ఖాతా ద్వారా పంచుకుంది.

<strong>బీసీసీఐకి ఈ మెయిల్‌.. భారత క్రికెట్‌ జట్టుకు ఉగ్రముప్పు!!</strong>బీసీసీఐకి ఈ మెయిల్‌.. భారత క్రికెట్‌ జట్టుకు ఉగ్రముప్పు!!

స్టాండ్‌కు కోహ్లీ పేరు:

'ఆగస్టు 18, 2008న డిల్లీ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటికి 11 ఏళ్ళు పూర్తయ్యాయి. ఇన్నేళ్ళలో అతడు క్రికెట్‌ లెజెండ్‌గా మారాడు. కోహ్లీ ప్రదర్శన డీడీసీఎకు గర్వంగా ఉంది. ఆటగాడిగా, కెప్టెన్‌గా ఎన్నో రికార్డులను అందుకున్నందుకు ఫిరోజ్‌షా కోట్ల మైదానంలోని ఓ స్టాండ్‌కు కోహ్లీ పేరును పెట్టాలని నిర్ణయించుకున్నాం' అని డీడీసీఎ ట్వీట్ చేసింది.

 కోహ్లీ జ్ఞాపకార్థంగా:

కోహ్లీ జ్ఞాపకార్థంగా:

'ప్రపంచ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శన గర్వించదగినది. అతని ఆటతో డీడీసీఎ ఎంతో గర్వంగా ఉంది. కెరీర్‌లో ఆటగాడిగా, కెప్టెన్‌గా ఎన్నో రికార్డులను అందుకున్న కోహ్లీని గౌరవించడం సంతోషంగా ఉంది. కోహ్లీ జ్ఞాపకార్థంగా డీడీసీఎ తన పేరు మీద ఒక స్టాండ్‌ని అంకితం చేయాలనుకుంది. ఢిల్లీ యువ క్రికెటర్లకు ‘కోహ్లీ స్టాండ్‌' ఎంతో స్ఫూర్తినిస్తుందని డీడీసీఎ అధ్యక్షుడు రజత్‌ శర్మ పేర్కొన్నారు. 'కోహ్లీ మాత్రమే కాదు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌, వికెట్ కీపర్, ఫాస్ట్ బౌలర్లు కూడా భారత జట్టులో ఢిల్లీ నుండి ఉండడం మాకు సంతోషం' అని ఆయన పేర్కొన్నారు.

మాజీలు ఆటగాళ్లకు కూడా:

మాజీలు ఆటగాళ్లు బిషన్‌ సింగ్‌ బేడీ, మొహిందర్‌ అమర్‌నాథ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌లకు కూడా ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో స్టాండ్‌లు ఉన్నాయి. వీరందరూ రిటైర్మెంట్‌ తర్వాత ఆయా స్టాండ్‌లకు వారి పేర్లు పెట్టారు. కానీ విరాట్ కోహ్లీ ఆటలో కొనసాగుతుండగానే.. డీడీసీఎ ఫిరోజ్‌షా కోట్ల మైదానంలోని ఓ స్టాండ్‌కు పేరు పెట్టింది. ఈ గౌరవాన్ని దక్కించుకున్న పిన్న వయసు క్రికెటర్‌గా కోహ్లీ అరుదైన ఘనతను అందుకోనున్నాడు.

Story first published: Monday, August 19, 2019, 11:50 [IST]
Other articles published on Aug 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X