న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ vs దక్షిణాఫ్రికా మహిళల రెండో టీ20: ఎప్పుడు, ఎక్కడ, ఎలా వీక్షించాలి!

India women vs South Africa women live streaming: When and where to watch 2nd T20I online

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత మహిళల జట్టు ఇప్పుడు మరో పోరుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 గురువారం ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలుపు లక్ష్యంగా భారత మహిళల జట్టు బరిలోకి దిగుతోంది.

తొలి మ్యాచ్‌లో బ్యాట్స్‌వుమెన్‌ విఫలమైనప్పటికీ బౌలర్లు రాణించడంతో టీమిండియా విజయం సాధించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ అద్భుత ప్రదర్శనా... జట్టులోని మిగతా వారి నుంచి ఆమెకు తగిన సహకారం లభించలేదు. ఈ నేపథ్యంలో రెండో టీ20లో ఓపెనర్‌ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌ రాణించాల్సిన అవసరం ఉంది.

రిషబ్ పంత్ పేలవ ప్రదర్శనపై కోహ్లీకి ఓ చక్కటి సూచన చేసిన సౌరవ్ గంగూలీరిషబ్ పంత్ పేలవ ప్రదర్శనపై కోహ్లీకి ఓ చక్కటి సూచన చేసిన సౌరవ్ గంగూలీ

తొలి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన 15 ఏళ్ల షఫాలీ వర్మకు మరో అవకాశం ఇవ్వొచ్చు. తొలి మ్యాచ్‌లో 4 ఓవర్లలో 8 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసిన భారత స్పిన్నర్ దీప్తి శర్మ మరోసారి అదే పిచ్‌పై విజృంభిస్తే సఫారీలకు కష్టాలు తప్పవు. ఇక, సఫారీ జట్టు విషయానికి వస్తే డుప్రీజ్‌ నుంచి దక్షిణాఫ్రికా జట్టు భారీ ఇన్నింగ్స్‌ కోరుకుంటోంది.

తొలి మ్యాచ్‌లో భారత్ స్పిన్‌ను డుప్రెజ్(59) సమర్ధవంతంగా ఎదుర్కొంది. మిగతా బ్యాట్స్ ఉమెన్ అంతా భారత స్పిన్‌ను అంచనా వేయడంలో సఫారీలు తీవ్రంగా తడబడ్డారు. దీంతో రెండో టీ20లో విజయం సాధించి సిరిస్‌ను సమం చేయాలని దక్షిణాఫ్రికా మహిళల జట్టు భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

భారత్-దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య 2nd T20I ఎప్పుడు?
రాత్రి 7.00 గంటలకు, గురువారం (సెప్టెంబర్ 26)

భారత్-దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య 2nd T20I ఎక్కజ జరుగుతుంది?
లాల్‌భాయ్ కాంట్రాక్టర్ స్టేడియం, సూరత్

2nd T20Iని ఏ ఛానెల్ లైవ్‌లో ప్రసారంచేస్తోంది?
స్టార్‌స్పోర్ట్స్ -3లో

జట్ల వివరాలు:
భారతదేశం: హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), స్మృతి మంధనా, శిఖా పాండే, పూనమ్ యాదవ్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, పూజ వస్త్రకర్, తానియా భాటియా (wk), రాధా యాదవ్, షఫాలిజా జోమి, అనూలీ అరుంధతి రెడ్డి

దక్షిణాఫ్రికా: మిగ్నాన్ డు ప్రీజ్, షాబ్నిమ్ ఇస్మాయిల్, సునే లూస్ (సి), లిజెల్ లీ (డబ్ల్యుకె), అయాబోంగా ఖాకా, లారా వోల్వార్డ్ట్, నాడిన్ డి క్లెర్క్, టాజ్మిన్ బ్రిట్స్, తుమి సేఖుఖూన్, నోండుమిసో షాంగేస్, నాన్‌కులులేకో గులా అన్నే బాష్.

Story first published: Thursday, September 26, 2019, 14:10 [IST]
Other articles published on Sep 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X