న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

4-0తో సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

India Women Beat Sri Lanka by 51 Runs in Final T20I, Clinch Series 4-0

హైదరాబాద్: శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన ఐదు టీ20ల సిరిస్‌నుఓటమి లేకుండా భారత జట్టు 4-0తో సిరిస్‌ను సొంతం చేసుకుంది. టోర్నీలో భాగంగా చివరిదైన ఐదో టీ20లో భారత మహిళల జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

మంగళవారం జరిగిన ఐదో టీ20లో భారత జట్టు తన జోరుని కొనసాగించింది. కనీసం చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకుందామనుకున్న ఆతిథ్య శ్రీలంకకు భారత బౌలర్లు చుక్కులు చూపించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 18.3 ఓవర్లలో 156 పరుగులు చేసింది.

ఓపెనర్లు మిథాలీ రాజ్‌(12), స్మృతీ మంధాన(0) ఈ మ్యాచ్‌లో కూడా నిరాశ పరిచినప్పటికీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్‌(46) మరోసారి చెలరేగింది. ఇక, కెప్టెన్‌ హర్మన్‌ప‍్రీత్‌ కౌర్‌(63) చెలరేగి ఆడటంతో భారత్‌‌కు గౌరవ ప్రదమైన స్కోరు చేసింది.

14 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసిన భారత జట్టు ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. 4.3 ఓవర్లలోనే భారత జట్టు మిగతా 7 వికెట్లు కోల్పోవడం విశేషం. అనంతరం 157 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళల జట్టు 17.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలటౌంది.

దాంతో భారత్‌ 51 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 4-0తో సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. భారత బౌలర్లలో పూనమ్‌ యాదవ్‌ మూడు వికెట్లు తీయగా, రాధా యాదవ్‌, దీప్తి శర్మలు తలో రెండు వికెట్లు తీశారు. ఈ సిరీస్‌లో రెండో టీ20 వర్షం కారణంగా రద్దవ్వగా, మిగతా వాటిలో భారత్‌ విజయం సాధించింది.

Story first published: Tuesday, September 25, 2018, 17:16 [IST]
Other articles published on Sep 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X