న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నెట్స్‌లో మయాంక్ షాట్‌లు, ఎంపిక బాలేదంటున్న సన్నీ

India Vs West Indies 2018 : Mayank Agarwal Gets His First Practice Session With Team India| Oneindia
India vs Windies: Mayank Agarwal Gets His First Practice Session With Team India. Watch Video

న్యూ ఢిల్లీ: విదేశీ గడ్డపై ఇంగ్లాండ్ జట్టుతో ఆడిన టీమిండియా 1-4తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఆడిన ఆసియా కప్ అనంతరం మళ్లీ విదేశీ జట్టుతో ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరగబోయే సిరీస్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ముఖ్యంగా టెస్టు జట్టులో స్థానం సంపాదించుకున్న యువ ఆటగాళ్లు మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా, మహ్మద్‌ సిరాజ్‌లపై అందరి దృష్టి ఉంది.

భారత్ vs వెస్టిండిస్: భువీ, బుమ్రాలకు విశ్రాంతిపై సన్నీ ఫైర్ భారత్ vs వెస్టిండిస్: భువీ, బుమ్రాలకు విశ్రాంతిపై సన్నీ ఫైర్

మయాంక్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియో

ఈ సిరీస్‌తో ఓపెనింగ్‌ జోడీపై ఓ క్లారిటీ వస్తుందని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. రేపటి(గురువారం) నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం టీమిండియా ఆటగాళ్లు కసరత్తులు ప్రారంభించారు. ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను బీసీసీఐ తన అధికార ట్విటర్‌లో పోస్టు చేసింది. ముఖ్యంగా యువ ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోతో పాటు ‘టీమిండియా నెట్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో మయాంక్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ మొదలెట్టేశాడు' అంటూ ట్వీట్‌ పెట్టింది.

జట్టుతో చేరి ప్రాక్టీస్‌ ప్రారంభించిన కోహ్లి

తొలి టెస్టులో కేఎల్‌ రాహుల్‌తో పాటు మయాంక్‌, పృథ్వీ షాలలో ఒకరికి అవకాశం లభించనుంది. రెండు టెస్టుల్లో ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. విశ్రాంతి అనంతరం విరాట్‌ కోహ్లి జట్టుతో చేరి ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. వెస్టిండీస్‌తో భారత జట్టు రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. టెస్టుల్లో టీమిండియా నంబర్‌ వన్‌ ర్యాంక్‌లో ఉండగా, ఆతిథ్య విండీస్‌ జట్టు ఎనిమిదో ర్యాంక్‌లో కొనసాగుతోంది.

 టీమిండియా ఎంపిక సరిగా లేదంటూ

టీమిండియా ఎంపిక సరిగా లేదంటూ

ఆసియా కప్‌లోనూ వెస్టిండీస్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌లకూ టీమిండియా ఎంపిక సరిగా లేదంటూ ఎంపిక అవలేకపోయిన క్రికెటర్ల నుంచి సీనియర్ క్రికెటర్ల వరకూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత పేసర్లు భువనేశ్వర్‌ కుమార్, జస్‌ప్రీత్‌ బుమ్రాలకు విశ్రాంతినివ్వడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

శార్దూల్‌, సిరాజ్‌లకు మంచి అవకాశం:

శార్దూల్‌, సిరాజ్‌లకు మంచి అవకాశం:

టెస్టు క్రికెట్‌ మనుగడ సాగించాలంటే అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లు కచ్చితంగా బరిలోకి దిగాలి. వారిద్దరి గైర్హాజరు వల్ల శార్దూల్‌ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌లాంటి ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. తమ సత్తా ఏమిటో ప్రదర్శించి ఆస్ట్రేలియా సిరీస్‌కు కూడా చోటు ఖాయం చేసుకునేందుకు ఈ యువ పేసర్లకు ఇది మంచి అవకాశం.

Story first published: Wednesday, October 3, 2018, 14:31 [IST]
Other articles published on Oct 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X