న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫోటో వైరల్: తన రాజ్యంలోని రాజుతో రవిశాస్త్రి

India vs West Indies: Ravi Shastri shares picture with ‘the king in his kingdom’ ahead of first Test

హైదరాబాద్: వెస్టిండిస్ లెజెండరీ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో కలిసి దిగిన ఫోటోని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఐసీసీ ప్రతిషాత్మకంగా ప్రవేశపెట్టిన టెస్టు చాంపియన్‌షిప్‌ను టీమిండియా వెస్టిండిస్‌ పర్యటనతో ప్రారంభించనుంది.

లారా సూచన.. విండీస్ ఆటగాళ్లు మానసికంగా దృఢంగా ఉండాలి!!లారా సూచన.. విండీస్ ఆటగాళ్లు మానసికంగా దృఢంగా ఉండాలి!!

ఇందులో భాగంగా ఈ పర్యటనలో భాగంగా నార్త్‌ సౌండ్‌లో సర్‌ వివ్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో విండిస్‌తో గురువారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సందర్భంగా రవిశాస్త్రి తన ట్విట్టర్‌లో "నా మనిషితో. తన రాజ్యంలో రాజు. ఆంటిగ్వా" అనే కామెంట్‌తో వివ్ రిచర్డ్స్‌తో కలిసి దిగిన ఫోటోని పోస్టు చేశాడు.

వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లు కైవసం చేసుకున్న భారత్.. టెస్టు సిరీస్‌నూ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అసలు పోరుకు ముందు వెస్టిండీస్‌ ఎ జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత్‌ అన్ని విభాగాల్లో అదరగొట్టింది. ఇక గురువారం నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పుపై తర్జనభర్జన పడుతోంది. తొలి టెస్టులో వన్డే వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మకు స్థానం కల్పించాలా? లేక టెస్టు వైస్‌ కెప్టెన్‌ అంజిక్య రహానేను ఆడించాలో? లేదా ఐదో బౌలర్‌ వైపు మొగ్గు చూపాలో? అని సతమతమవుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదుగురు బౌలర్ల కూర్పుతో బరిలో దిగాలనుకుంటే.. రహానే, రోహిత్లో ఒక్కరికే అవకాశం దక్కుతుంది.

ఫోటో ప్లీజ్: విండిస్‌తో తొలి టెస్టుకు భారత ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీ ఇదేఫోటో ప్లీజ్: విండిస్‌తో తొలి టెస్టుకు భారత ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీ ఇదే

నలుగురు బౌలర్లతో బరిలోకి దిగితే ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కొచ్చు. ఇద్దరు ఉంటే.. స్పిన్నర్ రవీంద్ర జడేజాపై వేటు పడుతుంది. ఏదేమైనా తుది జట్టులో చోటు కోసం పోటీ ఎక్కువగా ఉన్న కారణంగా ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతున్న రహానేకు అవకాశం లభించకపోవచ్చని సమాచారం.

Story first published: Wednesday, August 21, 2019, 16:57 [IST]
Other articles published on Aug 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X