న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అభిమానులకు శుభవార్త.. రెండో వన్డేకు వరణుడి ముప్పు లేనట్టే!!

India Vs West Indies: Port Of Spain Trinidad Weather Forecast, No rain for 2nd ODI?

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ను వరుణుడు ఏ స్థాయిలో ఆడుకున్నాడో అందరికీ తెలిసిందే. గయానాలోని ప్రావిడెన్స్ మైదానం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో వర్షం వస్తూ పోతుండడంతో విండీస్ బ్యాటింగ్ కేవలం 13 ఓవర్లు మాత్రమే సాగింది. భారీ వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయింది. అయితే పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో ఈ రోజు జరగనున్న రెండో వన్డేకు వరుణుడి ముప్పు లేదని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.

కోహ్లీ వినూత్న 'బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌'.. రవిశాస్త్రి కామెంట్రీ (వీడియో)కోహ్లీ వినూత్న 'బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌'.. రవిశాస్త్రి కామెంట్రీ (వీడియో)

ఆదివారం ఉదయం చిన్నపాటి జల్లులు పడే అవకాశం 20 శాతం మాత్రమేనని, ఇది మ్యాచ్‌కు పెద్ద ఆటకం ఏమీ కల్పించదని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అక్కడ వర్షం ఏమీ కురవట్లేదట. కొన్ని సందర్భాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇక మ్యాచ్ సమయంలో కూడా ఎండ కాస్తుందని సమాచారం. 25 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వాతావరణం ఆటకు అన్ని విధాల అనుకూలంగా ఉండనుంది.

ఓవల్‌ మైదానం పేస్ కంటే స్పిన్‌కు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది. ఇక్కడ 2010 నుంచి స్పిన్నర్ల సగటు 27.40 కాగా.. పేసర్ల సగటు 32.12. ఈ గణకాంకాలు చూస్తే స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ మైదానంలో జరిగిన చివరి ఐదు వన్డేల్లో నాలుగు వర్షం ప్రభావానికి గురయ్యాయి. రెండేళ్ల క్రితం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్‌ నెగ్గింది.

26 ఏళ్ల పాకిస్థాన్‌ క్రికెటర్‌ రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ26 ఏళ్ల పాకిస్థాన్‌ క్రికెటర్‌ రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ

ఓపెనర్ క్రిస్ గేల్‌కు ఇది 300వ వన్డే మ్యాచ్. దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా (299)ను వెనక్కి నెట్టి విండీస్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన బ్యాట్స్‌మెన్‌గా గేల్ రికార్డు సృష్టించనున్నాడు. విండీస్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచేందుకు గేల్(10,397)కు ఈ మ్యాచ్‌లో 9 పరుగులు అవసరం. ప్రస్తుతం 10,405 పరుగులతో లారా మొదటి స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ కూడా ఓ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. వెస్టిండీస్‌పై వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును నమోదు చేసేందుకు 19 పరుగుల దూరంలో కోహ్లీ (1912) ఉన్నాడు. పాకిస్థాన్‌ దిగ్గజ ఆటగాడు జావెద్‌ మియాందాద్‌ (1930) పరుగులతో కోహ్లీ కంటే ముందున్నాడు.

Story first published: Sunday, August 11, 2019, 14:05 [IST]
Other articles published on Aug 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X