న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

5వ వన్డే: 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన వెస్టిండిస్

India vs West Indies, 5th ODI: WIndies 2 down as Bhuvi, Bumrah strike early

హైదరాబాద్: తిరువనంతపురం వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత్ పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా ఆరంభంలోనే చెలరేగారు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఓపెనర్ కీరన్ పొవెల్ (0) డకౌట్ కాగా, ఆ తర్వాత వచ్చిన షై హోప్(0) కనీసం ఖాతా కూడా తెరవకుండానే రెండో ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.

<strong>5వ వన్డే: టాస్ గెలిచిన విండిస్, కెప్టెన్ కోహ్లీ రికార్డు మిస్</strong>5వ వన్డే: టాస్ గెలిచిన విండిస్, కెప్టెన్ కోహ్లీ రికార్డు మిస్

2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి భారత్

దీంతో తొలి ఓవర్‌లో 1/1తో నిలిచిన ఆ జట్టు రెండో ఓవర్‌లో 2/2తో కష్టాల్లో పడింది. భువనేశ్వర్ కుమార్ విసిరిన ఔట్ స్వింగర్‌ని కట్ చేసేందుకు కీరన్ పొవెల్ ప్రయత్నించగా... బంతి ఊహించని విధంగా స్వింగ్‌ అయ్యి పొవెల్ బ్యాట్ అంచున తాకుతూ వెళ్లి వికెట్ కీపర్ ధోని చేతుల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హోప్.. బుమ్రా విసిరిన ఇన్‌స్వింగర్‌కి ఔటయ్యాడు.

8 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసిన విండిస్

ఆఫ్ స్టంప్‌కి దూరంగా వెళ్తున్నట్లు కనిపించిన బంతిని హోప్ పాయింట్ దిశగా నెట్టేందుకు ట్రై చేశాడు. దీంతో బ్యాట్ అంచున తాకిన బంతి.. నేరుగా వెళ్లి వికెట్లపై పడింది. దీంతో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి వెస్టిండిస్ జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 8 ఓవర్లకు గాను వెస్టిండిస్ 2 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. క్రీజులో పోవెల్(5), శామ్యూల్స్(11) పరుగులతో ఉన్నారు.

టాస్ గెలిచిన వెస్టిండిస్

టాస్ గెలిచిన వెస్టిండిస్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండిస్ జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ తుది జట్టులో కెప్టెన్ కోహ్లి ఎలాంటి మార్పులు చేయలేదు. నాలుగో వన్డేలో ఆడిన జట్టునే ఈ వన్డేకీ కొనసాగించాడు. మరోవైపు వెస్టిండిస్ జట్టు ఓ మార్పు చోటు చేసుకుంది. న‌ర్స్ స్థానంలో దేవెంద్ర బిషూ తుది జట్టులోకి రాగా, హెమ్రాజ్‌ స్థానంలో ఒషేన్‌ థామస్‌ను జట్టులోకి తీసుకున్నారు.

 అరుదైన రికార్డు మిస్సైన కోహ్లీ

అరుదైన రికార్డు మిస్సైన కోహ్లీ

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ ఓడిపోవడంతో ఓ అరుదైన రికార్డుని మిస్సయ్యాడు. ఈ సిరీస్‌లో నాలుగు టాస్‌లనూ కోహ్లీయే గెలిచిన సంగతి తెలిసిందే. ఐదో వన్డేలోనూ టాస్ గెలిస్తే సొంతగడ్డపై జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించేవాడు.

1
44270
Story first published: Thursday, November 1, 2018, 14:53 [IST]
Other articles published on Nov 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X