న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో టీ20.. మరో రికార్డుపై కన్నేసిన పొలార్డ్‌!!

India vs West Indies 2nd T20I:  Kieron Pollard on verge of joining Chris Gayle, Dwayne Bravo in elite list

తిరువనంతపురం: టీమిండియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారీ పరుగులు చేసినా వెస్టిండీస్‌ జట్టుకు ఓటమి తప్పలేదు. ఆ చేదు అనుభవాన్ని మరచి విండీస్ మరో సమరానికి సిద్దమయింది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం భారత్-వెస్టిండీస్‌ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. తమ టీ20 చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన టీమిండియా సిరీస్‌ విజయంపై కన్నేయగా.. భారత్ జోరుకు అడ్డుకట్ట వేసి సిరీస్‌లో నిలవాలని విండీస్ చూస్తోంది.

షోయబ్‌తో సానియా పరిచయం: ఓ రెస్టారెంట్‌.. సాయంత్రం 6 గంటలు!!షోయబ్‌తో సానియా పరిచయం: ఓ రెస్టారెంట్‌.. సాయంత్రం 6 గంటలు!!

రెండో టీ20 నేపథ్యంలో విండీస్‌ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ టీ20 ఫార్మాట్‌లో వెయ్యి పరుగుల మైలురాయికి దగ్గరలో ఉన్నాడు. పొలార్డ్‌ మరో 10 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్‌లో విండీస్ తరఫున వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. పొలార్డ్‌ 66 మ్యాచ్‌ల్లో 990 పరుగులతో ఉన్నాడు. పొలార్డ్ తొలి టీ20లో 19 బంతుల్లో 37 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటివరకు విండీస్‌ ఆటగాళ్లలో క్రిస్‌ గేల్‌ (1627), మార్లన్‌ సామ్యుల్స్‌ (1611), డ్వేన్ బ్రావో (1142) మాత్రమే వెయ్యి పరుగులు పూర్తి చేసారు. మరో 10 పరుగులు చేస్తే.. టీమిండియాపై పొలార్డ్ ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. గత మ్యాచులో టీమిండియా ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ టీ20 ఫార్మాట్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు.

హైదరాబాద్ మ్యాచ్ అనంతరం పొలార్డ్ మాట్లాడుతూ... 'పిచ్‌ గురించి ఏం మాట్లాడను. టీ20 ఫార్మట్‌కు ఇలాంటి మైదానాలే కావాలి. మా బ్యాట్స్‌మన్‌ వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. కానీ.. మా బౌలర్ల ప్రదర్శన ఏ మాత్రం బాగాలేదు. కనీస ప్రాథమిక సూత్రాలను కూడా మా బౌలర్లు పాటించలేదు. ఇందుకు 23 ఎక్స్‌ట్రాలు సమర్పించుకోవడమే ఉదాహరణ. అంతేకాకుండా దాదాపు 15 వైడ్‌లు వేశారు' అని మండిపడ్డాడు.

దక్షిణాఫ్రికా బోర్డుకు పీటర్సన్‌ సలహా.. డైరెక్టర్‌గా గ్రేమ్‌ స్మిత్‌ బాధ్యతలు చేపట్టాలి!!దక్షిణాఫ్రికా బోర్డుకు పీటర్సన్‌ సలహా.. డైరెక్టర్‌గా గ్రేమ్‌ స్మిత్‌ బాధ్యతలు చేపట్టాలి!!

'తొలి పది ఓవర్ల వరకు మ్యాచ్ మా చేతిలోనే ఉందనిపించింది. అయితే విరాట్ కోహ్లీ దాటిగా ఆడి మ్యాచ్‌ను మా చేతుల్లోంచి లాగేసుకున్నాడు. ఈ విషయంలో కోహ్లీ గొప్పతనం ఎంత ఉందో.. మా బౌలర్ల వైఫల్యం అంతే ఉంది. అయితే మరో రెండు మ్యాచ్‌లు ఉండటంతో ఈ లోపాలన్నింటిపై దృష్టి సారిస్తాం. తిరిగి పుంజుకుంటామనే నమ్మకం ఉంది' అంటూ పొలార్డ్‌ అన్నాడు.

Story first published: Sunday, December 8, 2019, 16:16 [IST]
Other articles published on Dec 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X