న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్.. ఒక మార్పుతో భారత్!!

India vs West Indies 2nd ODI, Live Score: West Indies have won the toss and have opted to field

విశాఖపట్నం: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌-భారత్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ సాగర తీరం విశాఖలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ మైదానంలో జరగనుంది. టాస్ గెలిచిన కెప్టెన్ విండీస్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. విండీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. లెవిస్, పెర్రీ జట్టులోకి వచ్చారు. మరోవైపు కోహ్లీసేన ఒక మార్పు చేసింది. శివమ్ దూబే స్థానంలో పేసర్ శార్దూల్ ఠాకూర్ తుది జట్టులో చోటు సంపాదించాడు.

విశాఖలో కోహ్లీ 118, 117, 99, 65, 157 ట్రాక్‌ రికార్డు.. ఆందోళనలో విండీస్!!

చెన్నై వన్డేలో ఓడిపోవడంతో ఇప్పుడు ఒత్తిడంతా టీమిండియాపైనే ఉంది. సిరీస్‌ రేసులో నిలవాలంటే భారత్‌ ఇప్పుడు కచ్చితంగా గెలవాల్సిందే. అటు తొలి మ్యాచ్‌లో విజయంతో జోష్‌లో ఉన్న వెస్టిండీస్‌ సిరీస్ విజయంపై కన్నేసింది. దీంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

విశాఖ వికెట్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామం. సాధారణంగా ఈ పిచ్‌ స్పిన్నర్లకు కూడా సహకరిస్తుంది. రెండో ఇన్నింగ్స్‌ సమయంలో మంచు ప్రభావం ఉంటుంది. మ్యాచ్‌కు వరుణుడి ముప్పులేదు. 2010 నుంచి ఈ మైదానంలో తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 275గా ఉంటోంది. ఇక్కడ జరిగిన చివరి ఐదు వన్డేల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు ఒక్కసారే గెలిచింది. ఈ స్టేడియంలో భారత్‌ ఆడిన ఎనమిది మ్యాచ్‌ల్లో 6 గెలిచి, ఒకటి ఓడింది. ఓ మ్యాచ్‌ టైగా ముగియగా.. ఒక ఓటమి విండీస్‌ చేతిలోనే ఎదురైంది.

ఈ వన్డేతో విరాట్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 400 మ్యాచ్‌లు ఆడిన ఎనిమిదో భారత ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లీ ఇప్పటి వరకు 399 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 84 టెస్టులు, 240 వన్డేలు, 75 టీ20లు ఉన్నాయి. 400 మ్యాచ్‌లు అంతకంటే ఎక్కువ ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ (664), ధోనీ (538), ద్రవిడ్‌ (509), అజారుద్దీన్ (433), గంగూలీ (424), కుంబ్లే (403), యువరాజ్‌ (402)లు ఉన్నారు.

Teams:
India (Playing XI): Rohit Sharma, Lokesh Rahul, Virat Kohli(c), Shreyas Iyer, Rishabh Pant(w), Kedar Jadhav, Ravindra Jadeja, Deepak Chahar, Mohammed Shami, Shardul Thakur, Kuldeep Yadav.

West Indies (Playing XI): Shai Hope(w), Evin Lewis, Shimron Hetmyer, Nicholas Pooran, Roston Chase, Kieron Pollard(c), Jason Holder, Keemo Paul, Alzarri Joseph, Sheldon Cottrell, Khary Pierre

Story first published: Wednesday, December 18, 2019, 13:17 [IST]
Other articles published on Dec 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X