న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఊరించి ఊసురుమనిపించారు: కోల్‌కతా టెస్టు డ్రా, ఈడెన్‌లో కోహ్లీ తొలి సెంచరీ

By Nageshwara Rao
Srilanka

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. 231 పరుగుల విజయ లక్ష్యంతో చివరిరోజైన సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంక ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. దీంతో విజయం దిశగా పయనించిన కోహ్లీసేన డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు సాధించగా, షమీ రెండు వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్ ఒక వికెట్ తీశాడు.ఇరు జట్ల మధ్య రెండో టెస్టు నవంబర్ 24(శుక్రవారం) నాగ్ పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది.

కోల్‌కతా టెస్టు బ్యాటింగ్ స్కోరు కార్డు:
తొలి ఇన్నింగ్స్
భారత్ - 172 ఆలౌట్
శ్రీలంక - 294 ఆలౌట్

రెండో ఇన్నింగ్స్
భారత్ - 352/8 డిక్లేర్
శ్రీలంక - 75/7


శ్రీలంక రెండో ఇన్నింగ్స్ సాగిందిలా:

ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక
ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ఆదినుంచే తడబడుతూ ఆడుతోంది. 25వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ విసిరిన బంతికి దిల్రువాన్ పెరీరా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 26 ఓవర్లకు గాను శ్రీలంక 7 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది.

ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక
ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఐదో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ దినేశ్‌ చండిమాల్‌ (20) పెవిలియన్‌ చేరాడు. టీమిండియా బౌలర్‌ మహ్మద్‌ షమి 20.4వ బంతికి అతడిని ఔట్‌ చేశాడు. 21 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 5వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. శ్రీలంక గెలవాలంటే ఇంకా 163 పరుగులు చేయాలి. అదే భారత్ గెలవాలంటే 5 వికెట్లు తీయాలి. ప్రస్తుతం క్రీజులో డిక్వెలా (27), షనకా పరుగులేమీ చేయకుండా ఉన్నారు.

నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక
ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. భారత బౌలర్లను ఎదుర్కొనలేక లంక బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ బాట పడుతున్నారు. 11వ ఓవర్లో ఉమేష్ యాదవ్ విసిరిన బంతికి మాథ్యూస్ ఎల్బీగా వెనుదిరిగాడు. 23 బంతులను ఎదుర్కొన్న మాథ్యూస్ 12 పరుగులు చేశాడు. ప్రస్తుతం 14 ఓవర్లకు గాను శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది.

మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక
ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. 352/8 వద్ద భారత్‌ తన రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన అనంతరం రెండో ఇన్నింగ్స్‌‌ను ఆరంభించిన శ్రీలంక ఆరంభం నుంచీ తడబడుతోంది. రెండో ఇన్నింగ్స్ మొదలైన కాసేపటికే వికెట్ కోల్పోయిన శ్రీలంక, ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోతుంది. తిరుమన్నే (7) పరుగుల వద్ద భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో 8వ ఓవర్ తొలి బంతికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో 16 పరుగులకే శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయింది.

వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక
ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కొద్దిసేపటికే రెండు వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్‌ కుమార్‌ వేసిన తొలి ఓవర్‌‌లో ఓపెనర్‌ సమరవిక్రమ్‌ చివరి బంతికి ఔటయ్యాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్‌ కోల్పోయింది.

India Vs Sri Lanka, Kolkata Test, Day 5

భారత్ 352/8 వద్ద డిక్లేర్

ఈడెన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌ను భారత్ 352/8 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో తొలి టెస్టులో శ్రీలంకకు 231 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. లంచ్ విరామం అనంతరం విరాట్ కోహ్లీ సెంచరీ చేయగానే భారత్ తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం విశేషం.

ఈడెన్‌లో తొలి సెంచరీని నమోదు చేసిన కోహ్లీ

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. విరాట్ కోహ్లీకి ఇది 50వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. 119 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. అంతేకాదు ఈ సెంచరీకి ఎంతో ప్రత్యేకతం ఉంది. విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్‌లో ఈడెన్‌లో చేసిన తొలి సెంచరీ ఇది. ఇన్నింగ్స్ 88.4వ బంతిని సిక్స్‌గా మలిచి కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు.

ఇప్పటి వరకూ తన టెస్టు కెరీర్‌లో 18 సెంచరీలను నమోదు చేసిన కోహ్లీ ఈడెన్ గార్డెన్స్‌లో ఒక్కటీ నమోదు చేయలేదు. ఇందులో 4 డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే తొలిసారి ఈడెన్ గార్డెన్స్‌లో సత్తాచాటాడు. రెండో ఇన్నింగ్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. సోమవారం చివరి రోజు ఆటలో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ లంచ్ విరామం తర్వాత సెంచరీని నమోదు చేశాడు.

ఈ సెంచరీతో విరాట్ కోహ్లీ అరుదైన క్లబ్‌లో చేరాడు. వన్డేల్లో 32 సెంచరీలు చేసిన కోహ్లీకి.. టెస్టుల్లో ఇది 18వ సెంచరీ. సచిన్ టెండూల్కర్ (100 సెంచరీలు) తర్వాత క్రికెట్‌లో 50 అంతకన్నా ఎక్కువ సెంచరీలు చేసిన రెండో క్రికెటర్ భారత క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. పాంటింగ్ (71), సంగక్కర (63), కలిస్ (62), ఆమ్లా (54), జయవర్దనె (54), లారా (53) అంతర్జాతీయ క్రికెట్‌లో 50కిపైగా సెంచరీలు చేశారు.

15వ హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ
ఈడెన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 82 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో కోహ్లీ 52 పరుగులతో హాఫ్ సెంచరీని సాధించాడు. ఈ హాఫ్ సెంచరీకి ఓ ప్రత్యేకత ఉంది. విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్‌లో ఈడెన్‌లో చేసిన తొలి హాఫ్ సెంచరీ ఇది. ఇన్నింగ్స్ 71.6వ బంతిని బౌండరీకి తరలించి కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు. కాగా, రవిచంద్రన్ అశ్విన్ (7) పరుగుల వద్ద అవుటయ్యాడు. అనంతరం సాహా క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం భారత్ 74 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. కోహ్లీ 52, సాహా పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. శ్రీలంకపై తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 146 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

లంచ్ విరామానికి భారత్ 251/5

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు, రెండో ఇన్నింగ్స్‌ లంచ్ విరామానికి కోహ్లీసేన 5 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 67 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. కోహ్లీ 41, అశ్విన్ ఖాతా తెరవకుండా క్రీజులో ఉన్నారు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 129 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఐదో వికెట్ కోల్పోయిన భారత్
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. జట్టు స్కోరు 249 వద్ద రవీంద్ర జడేజా కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసి పెరీరా బౌలింగ్‌లో అవుటయ్యాడు. దిల్రువాన్‌ పెరీరా వేసిన 65.5వ బంతిని జడేజా వెనుదిరిగాడు. కోహ్లీ-జడేజా ఇద్దరూ ఐదో వికెట్‌కు 36 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు.

మరో ఎండ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఆడుతూ హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. జడేజా అవుటైన తర్వాత క్రీజులోకి రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. ప్రస్తుతం భారత్ 67 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. కోహ్లీ 41, అశ్విన్ ఖాతా తెరవకుండా క్రీజ్‌లో ఉన్నారు. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే భారత్ 129 పరుగుల ఆధిక్యంలో ఉంది.

నాలుగో వికెట్ కోల్పోయిన భారత్

ఈడెన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన నాలుగో వికెట్ కోల్పోయింది. శ్రీలంక పేసర్ లక్మల్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి టీమిండియాను కష్టాల్లోకి నెట్టాడు. ఇన్నింగ్స్ 53 ఓవర్‌లో రెండో బంతికి పుజారాను, చివరి బంతికి రహానేను ఔట్ చేశాడు.

దీంతో ఒకే ఓవర్‌లో భారత్ రెండు వికెట్లను కోల్పోయింది. పుజారా 51 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 22 పరుగులు చేయగా, రహానే డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ 53 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. కోహ్లీ 13, జడేజా ఖాతా తెరవకుండా క్రీజ్‌లో ఉన్నారు. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే భారత్ 92 పరుగుల ఆధిక్యంలో ఉంది.

భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు 5వ రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్‌నైట్‌ వ్యక్తిగత స్కోరు 73తో ఐదో రోజైన సోమవారం బ్యాటింగ్‌ ఆరంభించిన ఓపెనర్ కేఎల్ రాహుల్‌ మరో ఆరు పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. లక్మల్‌ వేసిన 44.2వ బంతికి కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డయ్యాడు.

ఇదిలా ఉంటే 2017కి ముందు టెస్టుల్లో 4 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేసిన కేఎల్ రాహుల్... 2017లో మాత్రం హాఫ్‌ సెంచరీలను సెంచరీలుగా మలచడంలో విఫలమవుతున్నాడు. మొత్తం 125 బంతులను ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ ఎనిమిది బౌండరీలతో 79 పరుగులు చేశాడు.

ఓవర్ నైట్ స్కోరు 171/1తో చివరి రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన భారత బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో లంక బౌలర్ సురంగ లక్మల్ వేసిన బంతికి రాహుల్ అవుటయ్యాడు.

ప్రస్తుతం భారత్ 47 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. పుజారా 16, కోహ్లీ 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే భారత్ 77 పరుగుల ఆధిక్యంలో ఉంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, November 20, 2017, 17:07 [IST]
Other articles published on Nov 20, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X