న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌, దక్షిణాఫ్రికా మూడో టెస్ట్‌.. మ్యాచ్ జరుగుతుండగా నిద్రపోయిన రవిశాస్రి!!

IND vs SA 3rd Test : Ravi Shastri’s Nap During Ranchi Test Inspires Memes Online
India vs South Africa: Ravi Shastri Sleeping During 3rd Test Match, Photos viral in Social Media

రాంచీ: భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ప్రస్తుతం రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్ విజయం ఖాయం. దీంతో టీమిండియా సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయనుంది. ఇదిలా ఉంటే.. మూడో టెస్ట్‌ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా హెడ్ కోచ్‌ రవిశాస్త్రి పెవిలియన్‌ బాల్కనీలో కుర్చోని కునుకు తీస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

<strong>ధోనీ గ్యారేజ్‌లో మరో కొత్తవాహనం.. రాంచీ వీధుల్లో చక్కర్లు.. అభిమానులతో సెల్ఫీలు!!</strong>ధోనీ గ్యారేజ్‌లో మరో కొత్తవాహనం.. రాంచీ వీధుల్లో చక్కర్లు.. అభిమానులతో సెల్ఫీలు!!

రవిశాస్త్రి కునుకు

రవిశాస్త్రి కునుకు

సోమవారం మూడు టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా.. ఓ సమయంలో రవిశాస్త్రి కునుకు తీసాడు. అప్పుడే అక్కడి కెమెరాలలో ఈ దృశ్యం బందించబడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫోటోలలో రవిశాస్రి వెనకాలే కూర్చున్న యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ కోచ్‌ను చూస్తున్నట్లు కనిపిస్తోంది.

ప్రపంచంలోనే ఉత్తమమైన ఉద్యోగం:

రవిశాస్త్రి కునుకుకు సంబంధించిన ఫొటోలపై నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. కొందరు రవిశాస్త్రికి మద్దతుగా నిలుస్తే.. మరికొందరు విమర్శిస్తున్నారు. 'స్లీపింగ్ బ్యూటీ' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలుపు ఖాయం అనుకోని రవిశాస్త్రి కునుకు తీస్తున్నాడు' అని మరో నెటిజన్ కామెంట్ చేసాడు. 'రవిశాస్త్రిది ప్రపంచంలోనే ఉత్తమమైన ఉద్యోగం', 'పని సమయంలో కునుకు తీస్తున్న రవిశాస్త్రికి కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నారు', 'నిద్రపోవడానికి పది కోట్ల రూపాయలు చెల్లించాలా' అని నెటిజన్‌లు మండిపడుతున్నారు.

ఏడాదికి రూ. 10 కోట్ల జీతం

ఏడాదికి రూ. 10 కోట్ల జీతం

ఇటీవల రెండోసారి భారత హెడ్ కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి 2021లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌ వరకూ ఆ పదవిలో ఉండనున్నాడు. రవిశాస్త్రి జీతాన్ని బీసీసీఐ మరో 20 శాతం పెంచింది. రవిశాస్త్రి‌కి ప్రస్తుతం ఏడాదికి రూ. 9.5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల మధ్య జీతాన్ని బీసీసీఐ చెల్లిస్తోంది. తాజాగా 20 శాతం పెంచడంతో గతంలో కంటే అతని జీతం దాదాపు రూ. 1.5 కోట్ల మేర పెరిగింది. వన్డే ప్రపంచకప్‌ ఓటమి నేపథ్యంలో రవిశాస్త్రిపై వేటు పడుతుందని అంతా ఊహించారు. కానీ.. బీసీసీఐ మళ్లీ అతడికే పట్టం కట్టింది.

భారత పేసర్ల హవా

సొంతగడ్డపై గతంలో ఎన్నడూ లేనివిధంగా చెలరేగిపోతున్న భారత పేసర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ చివురుటాకులా వణికింది. మొహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ నిప్పులు చెరుగడంతో మూడో టెస్టు మూడో రోజు పర్యాటక జట్టు ఏకంగా 16 వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 56.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. ఇక సోమవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. భారత్‌ విజయానికి రెండు వికెట్ల దూరంలో నిలిచింది. నాలుగో రోజు ఆ రెండు వికెట్లు తీసి సపారీలపై చారిత్రక విజయాన్ని ఖాతాలో వేసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉంది.

Story first published: Tuesday, October 22, 2019, 9:48 [IST]
Other articles published on Oct 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X