న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs South Africa: భారత పర్యటన నేపథ్యంలో సఫారీ కోచ్‌కు నిద్రలేని రాత్రులు

India vs South Africa: Proteas coach Enoch Nkwe sleepless ahead of India tour

హైదరాబాద్: భారత పర్యటనలో కోహ్లీసేనపై మెరుగైన ప్రదర్శన చేసేందుకు 'బెస్ట్ ఫార్ములా' కనుగొనేందుకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని దక్షిణాఫ్రికా జట్టుకు ఇటీవలే తాత్కాలిక టీమ్ డైరెక్టర్‌గా ఎంపికైన ఎనోచ్‌ వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా సఫారీ జట్టు 3 టీ20లు, 3 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.

సెప్టెంబర్‌ 15 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరిస్‌తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా పేలవ ప్రదర్శన చేయడంతో ఆ జట్టు కోచ్ ఓట్టీస్ గిబ్సన్ తన పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఎనోచ్‌‌ను టీమ్ డైరెక్టర్‌గా నియమించింది.

ఎనోచ్ మాట్లాడుతూ

ఎనోచ్ మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో ఎనోచ్ మాట్లాడుతూ "భారత పర్యటనకు వెళ్లేందుకు బెస్ట్ ఫార్ములా కనుగొనేందుకు తెరవెనక చాలా జరుగుతోంది. ఓ మంచి పనికోసం నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. ఇది ప్రతి ఒక్కరికీ ఓ సవాల్‌. సహాయ సిబ్బంది, ఆటగాళ్లు, బోర్డు మధ్య భావప్రసారం చాలా బాగా సాగుతోంది. కోహ్లీసేనతో సిరీస్‌ కోసం చాలా కఠోర శ్రమ జరుగుతోంది. స్పష్టమైన దశ దిశ కోసం ప్రయత్నిస్తున్నాం" అని అన్నాడు.

క్లూసెనర్‌కు చాలా అనుభవం ఉంది

క్లూసెనర్‌కు చాలా అనుభవం ఉంది

భారత పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ కోచ్‌గా మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్‌ను ఆ దేశ క్రికెట్ బోర్డు నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై ఎనోచ్ మాట్లాడుతూ "క్లూసెనర్‌కు చాలా అనుభవం ఉంది. తెలుపు బంతి క్రికెట్‌లో మంచి నేర్పరి. ప్రపంచం మొత్తం తిరిగాడు. వివిధ టీ20 లీగుల్లో సైతం ఆడాడు. తన ఆలోచనలు పంచుతూ ఆటగాళ్లపై ప్రభావం చూపడం నేను చూశాను" అని చెప్పుకొచ్చాడు.

విండిస్ పర్యటనలో ఎలా ఆడిందో

విండిస్ పర్యటనలో ఎలా ఆడిందో

"విండిస్ సిరీస్‌లో టీమిండియా ఎలా ఆడిందో నిజంగా నేను పరిశీలించలేదు. ఆ పనిని ప్రదర్శనా విశ్లేషకుడు ప్రసన్న అగోరమ్‌కు అప్పగించాను. ప్రత్యర్థిపై ఎక్కువ దృష్టిపెట్టాలని భావించడం లేదు. మంచి ప్రణాళిక సిద్ధం చేయాలని పట్టుదలతో ఉన్నాం" అని ఎనోచ్‌ తెలిపాడు.

బ్లూప్రింట్‌తో ఇండియా నుంచి తిరిగొస్తాం

బ్లూప్రింట్‌తో ఇండియా నుంచి తిరిగొస్తాం

"రాబోయే నాలుగు ఏళ్లకు మా సొంత మార్గాన్ని కనుగొనాల్సి ఉంది. ఆ ప్రణాళికలో భాగంగా నేను ముందుకు వెళ్తున్నాను. మంచి స్థితిలో ఉండటానికి ఎవరైతే పూర్తి సమయం ప్రాతిపదికన బాధ్యతలు స్వీకరిస్తారనే దాని కోసం మేము ఒక విధమైన బ్లూప్రింట్‌తో భారతదేశం నుండి తిరిగి రావాలనుకుంటున్నాం" ఎనోచ్ పేర్కొన్నాడు.

Story first published: Friday, September 6, 2019, 12:20 [IST]
Other articles published on Sep 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X