న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs South Africa, 3rd Test Day 3: తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 162 ఆలౌట్, ఆధిక్యం 335

 India vs South Africa Live Score 3rd Test Day 3: India enforce follow-on, South Africa trail by 335 runs


హైదరాబాద్: రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటారు. దీంతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టుని 162 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు 335 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో సఫారీలను కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి ఫాలో ఆన్‌కు ఆహ్వానించాడు.

దీంతో మూడో టెస్టులో దక్షిణాఫ్రికాకు మళ్లీ ఫాలోఆన్‌ ముప్పు తప్పలేదు. పూణె వేదికగా జరిగిన రెండో టెస్టులో కూడా దక్షిణాఫ్రికాను విరాట్ కోహ్లీ ఫాలో ఆన్ ఆడించిన సంగతి తెలిసిందే. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు తీయగా... షమీ, నదీమ్, రవీంద్ర జడేజాలు తలో రెండు వికెట్లు పడగొట్టారు.

ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ

ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ

9/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆడిన తొలి బంతికే దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఔటయ్యాడు. ఆడిన తొలి బంతికే దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఔటయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

బవుమా నిలకడగా

బవుమా నిలకడగా

ఈ సమయంలో క్రీజులోకి వచ్చి బవుమా నిలకడగా ఆడుతూ స్కోరుని పెంచే ప్రయత్నం చేశాడు. మరోవైపు జుబైర్ హమ్జా హాఫ్ సెంచరీ చేసి క్రీజులో పాతుకుపోయాడు. వీరిద్దరి జోడీ నిలకడగా ఆడుతూ సుమారు 22 ఓవర్ల పాటు క్రీజులో నిలబడి వికెట్లు కోల్పోకుండా అడ్డుకున్నారు. ఇద్దరూ కలిసి 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

విడదీసిన నదీమ్

విడదీసిన నదీమ్

అలాంటి సమయంలో వీరిద్దరి జోడిని నదీమ్ తన స్పిన్‌తో విడదీశాడు. అంతకముందు 28వ ఓవర్లో జడేజా వేసిన నాలుగో బంతిని ఆడిని హంజా(62) బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్లాసెన్‌(6)ను జడేజా ఆరోవికెట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. 31.4వ ఓవర్లో జడేజా వేసిన బంతికి క్లాసెన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

చివర్లో ప్రతిఘటించిన లిండే

చివర్లో ప్రతిఘటించిన లిండే

లంచ్ విరామానికి ముందు ఐదు ఓవర్ల వ్యవధిలో భారత బౌలర్లు మూడు వికెట్లు పడగొట్టారు. ఇక, లంచ్ విరామం అనంతరం భారత బౌలర్లు మరింతగా చెలరేగడంతో సఫారీ ఇన్నింగ్స్ ఎక్కువసేపు కొనసాగలేదు. డేన్ పైడిట్(4), రబడా(0)లు స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. చివర్లో జార్జి లిండే(37; 81 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌) ఫరవాలేదనిపించాడు.

19 ఓవర్ల పాటు క్రీజులో

19 ఓవర్ల పాటు క్రీజులో

అతడికి అన్రిచ్ నోర్జి నుంచి మద్దతు లభించడంతో వీరిద్దరూ భారత బౌలర్లకు వికెట్ ఇవ్వకుండా చాలాసేపు ప్రతిఘటించారు. వీరిద్దరూ సుమారు 18 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నారు. లిండే తొమ్మిదో వికెట్‌గా ఔట్ కాగా... ఆ తర్వాత కొద్దిసపేటికే నోర్జే(4) నదీమ్‌ బౌలింగ్‌లో ఎల్బీ అయ్యాడు.

Story first published: Monday, October 21, 2019, 14:09 [IST]
Other articles published on Oct 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X