న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒంటిచేత్తో కోహ్లీ కమాల్‌ క్యాచ్‌.. ఔరా అంటున్న అభిమానులు!! (వీడియో)

India Vs South Africa,2nd T20I : Virat Kohli Takes A Stunning Catch To Dismiss Quinton De Kock
India vs South Africa 2nd T20I: Virat Kohli took a sensational one-handed catch to remove Quinton de Kock

మొహాలి: బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చేజింగ్ కింగ్, కెప్టెన్ విరాట్ కోహ్లీ (52 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72 నాటౌట్‌), ఓపెనర్ శిఖర్ ధవన్‌ (31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 40)తో రాణించడంతో భారత్ లక్ష్యాన్ని మరో ఓవర్‌ మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లోనే కాదు.. అద్భుత ఫీల్డింగ్ కూడా చేసి ఔరా అనిపించాడు.

<strong>మెరిసిన దూబే, సాహా.. రెండో టెస్ట్ మ్యాచ్‌లో పట్టుబిగించిన భారత్!!</strong>మెరిసిన దూబే, సాహా.. రెండో టెస్ట్ మ్యాచ్‌లో పట్టుబిగించిన భారత్!!

డికాక్‌ భారీ షాట్:

డికాక్‌ భారీ షాట్:

ఓపెనర్ హెండ్రిక్స్‌ (6) పెవిలియన్ చేరినా.. బవుమా (43 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 49)తో కలిసి సౌతాఫ్రికా కెప్టెన్ క్వింటన్‌ డికాక్‌ (37 బంతుల్లో 8 ఫోర్లతో 52) హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. భారత బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ ధాటిగా పరుగులు చేసాడు. ఈ జోడి అప్పటికే ప్రమాదకరంగా మారింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో పేసర్ నవదీప్ సైనీ వేసిన ఆఫ్‌ కట్టర్‌ను డికాక్‌ భారీ షాట్ ఆడాడు.

కోహ్లీ కమాల్‌ క్యాచ్‌:

బంతి కాస్తా గాల్లోకి లేవడంతో మిడాఫ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న విరాట్ కోహ్లీ చిరుతలా పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్‌ చేసి ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లతో సహా అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. మరోవైపు షాక్ తిన్న డికాక్‌ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ క్యాచ్‌తో 57 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి కూడా తెరపడింది.

ఔరా ఏం క్యాచ్

ఔరా ఏం క్యాచ్

డికాక్‌ ఔటైన తర్వాత మిగతా బ్యాట్స్‌మెన్‌ తడబడటంతో టీమిండియాకు ప్రొటీస్ ఓ మోస్తారు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్యాచ్ టీమిండియాకు టర్నింగ్‌ పాయింట్‌ అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబందించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఔరా కోహ్లీ ఏం క్యాచ్ పట్టాడు అని అంటున్నారు.

ధర్మశాలలో చివరి మ్యాచ్‌:

ధర్మశాలలో చివరి మ్యాచ్‌:

టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 149 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీపక్‌ చాహర్‌ రెండు వికెట్లు పడగొట్టగా..సైనీ, జడేజా, హార్దిక్‌ ఒక్కో వికెట్‌ తీశారు. అనంతరం 150 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ మరో ఓవర్‌ మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. ఈ విజయంతో మూడు టీ20ల ఈ సిరీస్‌లో కోహ్లీ సేన 1-0 ఆధిక్యంలో నిలిచింది. ధర్మశాలలో జరగాల్సిన మొదటి మ్యాచ్‌ వర్షంతో రద్దయిన సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్‌ 22న బెంగళూరులో జరగనుంది.

Story first published: Thursday, September 19, 2019, 10:01 [IST]
Other articles published on Sep 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X