న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ vs దక్షిణాఫ్రికా 2019: కోహ్లీ, రోహిత్ శర్మ బద్దలు కొట్టబోయే రికార్డులివే!

India vs South Africa 2019 : Virat Kohli, Rohit Eyeing Record-Fest Outing In South Africa Series
India vs South Africa 2019: Virat Kohli, Rohit Sharma chase these T20I records

హైదరాబాద్: సెప్టెంబర్ 15న ధర్మశాల వేదికగా జరగనున్న తొలి టీ20తో భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా సఫారీలు మూడు టీ20లు, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనున్నారు. తొలి టీ20 కోసం ఇప్పటికే ఇరు జట్లు ధర్మశాలకు చేరుకున్నాయి.

ఈ పర్యటనలో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అనేక రికార్డులపై కన్నేశారు. ఆ రికార్డులేంటో ఒక్కసారి చూద్దాం...

మరోసారి నిరాశపరిచిన వార్నర్: ఈసారి బ్రాడ్ కాదు ఆర్చర్మరోసారి నిరాశపరిచిన వార్నర్: ఈసారి బ్రాడ్ కాదు ఆర్చర్

టీ20ల్లో అత్యధిక పరుగులు

టీ20ల్లో అత్యధిక పరుగులు

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ(88 ఇన్నింగ్స్‌ల్లో 2422 పరుగులు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, విరాట్ కోహ్లీ 65 ఇన్నింగ్స్‌ల్లో 2369 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ కేవలం 53 పరుగుల వెనుకంజలో ఉండటంతో ఈ సిరిస్‌లో రోహిత్ శర్మను అధిగమిస్తాడో లేదో చూడాలి మరి. న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గుప్టిల్(2283) పరుగులతో ఈ జాబితాలో మూడో స్థానంలో నిలవగా, పాకిస్థాన్‌కు చెందిన షోయబ్ మాలిక్(2263) నాలుగో స్థానంలో నిలిచాడు.

సెంచరీ కోసం వేట

సెంచరీ కోసం వేట

టీ20ల్లో రోహిత్ శర్మ ఇప్పటికే నాలుగు సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు సాధించాడు. అయితే, విరాట్ కోహ్లీ ఖాతాలో 21 హాఫ్ సెంచరీలు ఉన్నప్పటికీ ఒక్క సెంచరీ కూడా లేదు. టెస్టులు, వన్డేల్లో సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్‌లో కూడా సెంచరీ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

గత సిరిస్‌లో సఫారీలదే విజయం

గత సిరిస్‌లో సఫారీలదే విజయం

సొంతగడ్డపై టీమిండియా సిరిస్‌ను చేజార్చుకునే సందర్భాలు చాలా తక్కువ. అయితే, 2015లో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చిన సందర్భంలో అటు వన్డే సిరిస్‌తో పాటు టీ20 సిరిస్‌ను సైతం సొంతం చేసుకుంది. మూడు టీ20ల సిరిస్‌ను 2-0తో నెగ్గింది. ఈ నేపథ్యంలో మరోసారి సఫారీ జట్టుకు ఆ అవకాశం ఇవ్వకూడదని కోహ్లీసేన భావిస్తోంది. అయితే, 2008 నుంచి ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య మొత్తం 13 టీ20లు జరగ్గా టీమిండియా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్

టీ20 సిరిస్ తర్వాత సఫారీ జట్టుతో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో మయాంక్ అగర్వాల్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో అతడు టీ20 సిరిస్‌లో ఫామ్‌ని అందుకోవడం తప్పనిసరి. మరోవైపు విండిస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కోహ్లీ ప్రదర్శన కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ సఫారీలతో జరగనున్న టీ20 సిరిస్‌లో చక్కటి ప్రదర్శన చేయాలి.

Story first published: Friday, September 13, 2019, 18:04 [IST]
Other articles published on Sep 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X