న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెప్టెంబర్ 15 నుంచి భారత్ vs దక్షిణాఫ్రికా సిరిస్: షెడ్యూల్, వేదికలు, టీవీ టైమింగ్స్

India vs South Africa Series 2019: Full Schedule, Squads Deatails ! || Oneindia Telugu
 India vs South Africa 2019: Series schedule, venues, TV timings, live streaming, squads, head to head

హైదరాబాద్: టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సిరీస్ సెప్టెంబర్ 15న ధర్మశాల వేదికగా జరగనున్న తొలి టీ20లో ప్రారంభం కానుంది. భారత పర్యటనలో భాగంగా సఫారీ జట్టు 3 టీ20లు, 3 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. టీ20 సిరిస్ ముగిసిన తర్వాత టీమిండియా అక్టోబర్ 2 నుంచి ఇరు జట్ల మధ్య టెస్టు సిరిస్ ప్రారంభమవుతుంది.

బంగ్లాతో ఏకైక మ్యాచ్: సంచలన నిర్ణయం తీసుకున్న మహ్మద్ నబీబంగ్లాతో ఏకైక మ్యాచ్: సంచలన నిర్ణయం తీసుకున్న మహ్మద్ నబీ

అయితే, ఈ సిరిస్‌లో ఇరు జట్ల మధ్య ఎలాంటి వన్డేలు జరగడం లేదు. చివరగా 2015-16లో భారత పర్యటనకు వచ్చిన సఫారీ జట్టు టీ20, వన్డే సిరిస్‌ను గెలిచినప్పటికీ టెస్టు సిరిస్‌లో మాత్రం 0-3తో ఓడిపోయింది. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను ఎదుర్కొనలేక సఫారీలు ఒక ఇన్నింగ్స్‌లో కూడా 200 పరుగుల మార్కుని అందుకోలేకపోయారు.

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో అశ్విన్ 31 వికెట్లు తీయగా... రవీంద్ర జడేజా 23 వికెట్లు తీసి సఫారీల భరతం పట్టారు. ఇక, బ్యాట్స్‌మెన్లలో రహానే 51.55 యావరేజితో 266 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. మళ్లీ మూడేళ్ల తర్వాత సఫారీ జట్టు భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో సిరిస్ షెడ్యూల్, వేదికలు, టీవీ టైమింగ్స్ మొదలైన వివరాలు మీకోసం...

టీ20 సిరిస్ షెడ్యూల్

టీ20 సిరిస్ షెడ్యూల్

Ist T20I: September 15: Dharamshala, 7 pm IST

2nd T20I: September 18: Mohali, 7 pm IST

3rd T20I: September 22: Bengaluru, 7 pm IST

టెస్టు సిరిస్ షెడ్యూల్

టెస్టు సిరిస్ షెడ్యూల్

Ist Test: October 2-6: Visakhapatnam, 9.30 am IST

2nd Test: October 10-14: Ranchi, 9.30 am IST

3rd Test: October 19-23: Pune, 9.30 am IST

మ్యాచ్‌ని ఎక్కడ వీక్షించాలి

మ్యాచ్‌ని ఎక్కడ వీక్షించాలి

భారత్-దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి అన్ని మ్యాచ్‌లు డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. దీంతో పాటు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో కూడా. హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్

టీ20:

టీ20:

భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, క్రునాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్ , ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైని.

దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుసెన్ (వైస్ కెప్టెన్), టెంబా బావుమా, జూనియర్ దాలా, జార్న్ ఫోర్టుయిన్, బ్యూరాన్ హెన్డ్రిక్స్, రీజా హెన్డ్రిక్స్, డేవిడ్ మిల్లెర్, అన్రిచ్ నార్ట్జే, ఆండిలే ఫెహ్లుక్వాయో, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రాబాడా తబ్రేజ్ షంసీ, జార్జ్ లిండే.

దక్షిణాఫ్రికాతో టెస్టుల కోసం టెస్టు జట్టుని టీమిండియా ఇంకా ప్రకటించలేదు. బెంగళూరులో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ముగిసిన తర్వాత టెస్టు జట్టుని ఎంపిక చేసే అవకాశం ఉంది.

దక్షిణాఫ్రికా: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), టెంబా బావుమా (వైస్ కెప్టెన్), థియునిస్ డి బ్రూయిన్, క్వింటన్ డి కాక్, డీన్ ఎల్గార్, జుబైర్ హమ్జా, కేశవ్ మహారాజ్, ఐడెన్ మార్క్రామ్, సెనురాన్ ముతుసామి, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నార్ట్జే, వెర్నాన్ ఫిలాండర్, డేన్ పీడ్ట్, కగిసో రబాడా, హెన్రిచ్ క్లాసెన్.

టీమిండియా, సపారీ జట్ల ఫామ్‌ గురించి

టీమిండియా, సపారీ జట్ల ఫామ్‌ గురించి

ఇండియా: విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ వేదికగా ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్ వరకు వెళ్లింది. సెమీస్‌లో కివీస్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత జరగిన వెస్టిండిస్ పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసింది. టీ20, వన్డే, టెస్టు సిరిస్‌లను సొంతం చేసుకుంది.

దక్షిణాఫ్రికా: వన్డే వరల్డ్‌కప్‌లో సపారీ జట్టు చెత్త ప్రదర్శన చేసింది. నాకౌట్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. సొంతగడ్డపై శ్రీలంకతో చివరగా ఆడిన టెస్టు సిరిస్‌ను 1-1తో డ్రాగా ముగించింది.

Story first published: Friday, September 6, 2019, 14:04 [IST]
Other articles published on Sep 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X