న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Virat Kohli vs Babar Azam: బ్యాటింగ్ మొనగాడెవ్వడు: లెక్కలివే: సెంచరీతో ఊపుమీదున్న రైవల్

India vs Pakistan T20 World Cup 2021: Virat Kohli vs Babar Azam: Who is the King, here is the statistics

అబుధాబి: టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా ఇంకొన్ని గంటల్లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. సాయంత్రం 7:30 గంటలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ హైఓల్టేజ్ మ్యాచ్ మొదలవుతుంది. ఈ రెండు జట్లు పరస్పరం పోరాడబోతోండటం.. సుదీర్ఘ విరామం తరువాత ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడేళ్ల తరువాత భారత్-పాకిస్తాన్ జట్లు ముఖాముఖి తేల్చుకోబోతోన్నాయి.

కోహ్లీ వర్సెస్ బాబర్..

కోహ్లీ వర్సెస్ బాబర్..

మ్యాచ్ సంగతి అలావుంటే- ప్లేయర్ల మీద కూడా అదే స్థాయిలో ఫోకస్ ఉంటోంది. ప్రత్యేకించి- టీమిండియా కేప్టెన్న విరాట్ కోహ్లీ, అతని కౌంటర్ పార్ట్ బాబర్ ఆజమ్‌ మీదే అందరి దృష్టీ నిలిచింది. బాబర్ ఆజమ్‌ను తమ దేశపు విరాట్ కోహ్లీగా పిలుచుకుంటుంటారు పాకిస్తాన్ అభిమానులు. ఇద్దరికీ మాస్ ఫాలోయింగ్ ఉంది. లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఇద్దరి బ్యాటింగ్ శైలిని, దూకుడును ఆరాధించే ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు. ఈ ఇద్దరిలో బ్యాటింగ్ కింగ్ ఎవరనేది ఈ సాయంత్రం నాటి మ్యాచ్‌లో తేలిపోతుంది.

ఇద్దరి మధ్యా సారూప్యత

ఇద్దరి మధ్యా సారూప్యత

విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్ ఇద్దరూ మాంచి దూకుడు మీద ఉన్న బ్యాటర్లే. వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఇంటర్నేషనల్స్, టెస్ట్ ఫార్మట్‌లో కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ 50కి పైగా ఉంటోంది. బాబర్ ఆజమ్ 40 ప్లస్‌ యావరేజ్‌ను రికార్డ్ చేశాడు. దశాబ్దకాలంగా విరాట్ కోహ్లీ మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాట్స్‌మెన్‌గా సత్తా చాటుతున్నాడు. అదే సమయంలో నాలుగేళ్లుగా బాబర్ ఆజమ్ కూడా ఫైనెస్ట్ ప్లేయర్‌గా ఉంటున్నాడు. ఇద్దరి బ్యాటింగ్‌లోనూ నిలకడ ఉంటోంది.

కోహ్లీ 50 ప్లస్..

కోహ్లీ 50 ప్లస్..

మూడు ఫార్మట్ల క్రికెట్‌లో విరాట్ కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడు. వన్డే ఇంటర్నేషనల్స్‌లో కోహ్లీ యావరేజ్ 59.07గా ఉంటోంది. అతను చేసిన మొత్తం పరుగులు 12,169. టెస్టు మ్యాచుల్లో అతని బ్యాటింగ్ సగటు 51.08. చేసిన పరుగులు 7,765. టీ20 ఇంటర్నేషనల్స్ ఫార్మట్‌లోనూ అదే స్థిరత్వాన్ని కొనసాగిస్తున్నాడు విరాట్ కోహ్లీ. అతని బ్యాటింగ్ యావరేజ్ 52.65గా నమోదైంది. చేసిన పరుగులు 3,159. కోహ్లీ బ్యాటింగ్ ఎంత స్థిరంగా సాగుతోందో తెలియజేస్తున్నాయి ఈ స్టాటిస్టిక్స్.

 బాబర్ ఆజమ్‌దీ అంతే

బాబర్ ఆజమ్‌దీ అంతే

పాకిస్తాన్ జట్టు కేప్టెన్, డాషింగ్ ఓపెనర్ బాబర్ ఆజమ్ కూడా అవే తరహా గణాంకాలను నమోదు చేశాడు. వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఇప్పటిదాకా 3,985 పరుగులు చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 56.92. టెస్ట్ ఫార్మట్‌లో అతని యావరేజ్ 42.94గా ఉంటోంది. చేసిన పరుగులు 2,326. టీ20 ఇంటర్నేషనల్స్‌లో బాబర్ బ్యాటింగ్ సగటు 46.89గా రికార్డయింది. ఇప్పటిదాకా అతను 2,204 పరుగులు చేశాడు. కొద్దిపాటి తేడాతో ఇద్దరి బ్యాటింగ్ యావరేజ్ దాదాపు సమానంగా సాగుతోంది. నిలకడ కనిపిస్తోంది.

ఈ ఏడాది టాప్ ఫామ్‌లో బాబర్..

ఈ ఏడాది టాప్ ఫామ్‌లో బాబర్..

బాబర్ ఆజమ్ ఈ ఏడాది టాప్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా అతను 17 టీ20 మ్యాచ్‌లను ఆడాడు. 523 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్థసెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 122 పరుగులు. 50కి పైగా నాలుగుసార్లు పరుగులు సాధించాడు. మిగిలిన మ్యాచుల్లో 30 ప్లస్ స్కోరును సాధిస్తూ వచ్చాడు. పాకిస్తాన్‌కే చెందిన మరో ఓపెనర్ రిజ్వాన్ కూడా దూకుడు మీద ఉన్నాడు. ఈ ఏడాది ఏడు మ్యాచులను ఆడాడు. ఒక సెంచరీ.. ఒక హాఫ్ సెంచరీ చేశాడు. అత్యధిక స్కోరు 115 పరుగులు నాటౌట్.

Story first published: Sunday, October 24, 2021, 11:38 [IST]
Other articles published on Oct 24, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X