న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్‌తో భారత్ సూపర్ పోరు, భీకరమైన ఫామ్‌లో టీమిండియా

India vs Pakistan, Asia Cup: Fancied India wary of unpredictable Pakistan

న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సిరీస్‌లు ఆగిపోయాక భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఏడాదికి ఒక్క క్రికెట్‌ మ్యాచ్‌ జరగడమే గగనంగా మారిపోయింది. ఐతే ఆసియా కప్‌ కొత్త ఫార్మాట్‌ పుణ్యమా అని చిరకాల ప్రత్యర్థులు నాలుగు రోజుల వ్యవధిలో రెండో మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. గ్రూప్‌ దశలో ఢీకొన్న ఇరు జట్లూ.. సూపర్‌-4లో మళ్లీ పోరాటానికి సిద్ధమయ్యాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌.. పాకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది.

స్వల్ప వ్యవధిలో భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య మరో పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం ఆసియా కప్‌ సూపర్‌-4 మ్యాచ్‌లో రెండు జట్లూ అమీతుమీ తేల్చుబోతున్నాయి. గ్రూప్‌ దశలో ఈ రెండు జట్లూ తలపడే సమయానికి ఉన్న వాతావరణం వేరు. ఇప్పుడు పరిస్థితి వేరు. ఆ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌ హాంకాంగ్‌ను చిత్తుగా ఓడిస్తే.. అదే జట్టుపై భారత్‌ అతి కష్టం మీద నెగ్గింది. పాక్‌ నుంచి గట్టి సవాలు తప్పదని భావిస్తే.. ఆ జట్టు టీమిండియాకు తేలిగ్గా లొంగిపోయింది.

పాకిస్థాన్‌‌తో ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం:

పాకిస్థాన్‌‌తో ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం:

టోర్నీలో చాలా మ్యాచ్‌లు అంచనాలకు అందని రీతిలో సాగిన నేపథ్యంలో రోహిత్‌ సేన అప్రమత్తంగా ఉండాల్సిందే. అందులోనూ పాకిస్థాన్‌ ఆట ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం. రెండు జట్లూ ఒక్కో మ్యాచ్‌ గెలిచాయి కాబట్టి ఆదివారం నెగ్గే జట్టు దాదాపుగా ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుంటుంది. భారత్‌కు నెట్‌ రన్‌రేట్‌ కూడా చాలా బాగుంది కాబట్టి పాక్‌ను మామూలుగా ఓడించినా ఫైనల్‌కు చేరిపోయినట్లే. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం.

అదనపు బ్యాట్స్‌మన్‌గా మనీష్‌ పాండేను

అదనపు బ్యాట్స్‌మన్‌గా మనీష్‌ పాండేను

పాక్‌తో గ్రూప్‌ దశ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య గాయపడటంతో.. బంగ్లాపై అతడి స్థానంలో జడేజాను ఆడించారు. 14 నెలల తర్వాత వన్డే తుది జట్టులోకి వచ్చిన అతను అద్భుత ప్రదర్శన చేసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' గెలిచాడు. దీంతో అతడిని కొనసాగించక తప్పదు. మరి గత మ్యాచ్‌ మాదిరే ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తారా.. లేక చాహల్‌, కుల్దీప్‌ల్లో ఒకరిని పక్కన పెట్టి మూడో పేసర్‌ను తీసుకుంటారా అన్నది ఆసక్తికరం. ఒక స్పిన్నర్‌ను తగ్గించుకుని అదనపు బ్యాట్స్‌మన్‌గా మనీష్‌ పాండేను ఎంచుకునే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేం.

 ఒత్తిడంతా పాక్‌ పైనే..:

ఒత్తిడంతా పాక్‌ పైనే..:

కీలక పోరులో మార్పులతో బరిలోకి దిగాలని భావిస్తోంది. ఫహీమ్‌ అష్రాఫ్‌ స్థానంలో హరీస్‌ సొహైల్‌, షాదాబ్‌ ఖాన్‌ స్థానంలో మొహమ్మద్‌ నవాజ్‌ వచ్చే అవకాశాలున్నాయి. జట్టు బ్యాటింగ్‌కు షోయబ్‌ మాలిక్‌ వెన్నెముకలా ఉంటున్నాడు. ఇమామ్‌ ఉల్‌ హక్‌, బాబర్‌ ఆజమ్‌ తమ స్థాయి ఆటను ప్రదర్శిస్తున్నా ఫఖర్‌ జమాన్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌ కావడం ఆ జట్టును ఆందోళనపరుస్తోంది. పాక్ ప్రధాన బౌలర్‌ మొహ్మద్‌ అమీర్‌ పేలవ ఫామ్‌ పాక్‌ను దెబ్బతీస్తోంది. అందుకే అతడు అఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో చోటు కోల్పోవాల్సి వచ్చింది. భారత్‌పై గెలవాలంటే పేసర్లు హసన్‌ అలీ, ఉస్మాన్‌ ఖాన్‌ రాణించాల్సి ఉంటుంది.

 జట్లు (అంచనా), పిచ్ స్వభావం:

జట్లు (అంచనా), పిచ్ స్వభావం:

భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్‌ ధవన్‌, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోనీ, దినేశ్‌ కార్తీక్‌, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చాహల్‌, జస్ర్పీత్‌ బుమ్రా.

పాకిస్థాన్‌: ఫఖర్‌ జమాన్‌, ఇమామ్‌ ఉల్‌ హక్‌, బాబర్‌ ఆజమ్‌, షోయబ్‌ మాలిక్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌ (కెప్టెన్‌), ఫహీమ్‌ అష్రా్‌ఫ/హరీస్‌ సొహైల్‌, ఆసిఫ్‌ అలీ, షాదాబ్‌ ఖాన్‌/మొహమ్మద్‌ నవాజ్‌, హసన్‌ అలీ, ఉస్మాన్‌ ఖాన్‌, షహీన్‌ అఫ్రీది/మహ్మద్‌ ఆమెర్‌.

పిచ్‌ వాతావరణ పరిస్థితి:

ఇక్కడ ఉపయోగించిన రెండు పిచ్‌లు నెమ్మదిగానే ఉన్నాయి. భారీ స్కోర్లు కష్టమే కాబట్టి 250కి పైగా పరుగులు చేస్తే పోటీ ఇవ్వవచ్చు. స్పిన్నర్లు రాణించే అవకాశముంది.

Story first published: Sunday, September 23, 2018, 12:09 [IST]
Other articles published on Sep 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X