న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెలరేగిన భారత బౌలర్లు.. 235 పరుగులకు కివీస్ ఆలౌట్.. బౌండరీలతో రెచ్చిపోయిన షా!!

India vs New Zealand XI warm-up: Mohammed Shami, Jasprit Bumrah rattle New Zealand

హామిల్టన్‌: టెస్టు సిరీస్‌కు ముందు హామిల్టన్‌లోని సెడాన్‌ పార్క్‌ మైదానంలో న్యూజిలాండ్‌ ఎలెవెన్‌తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. పేసర్లు మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, నవదీప్ సైనీ చెలరేగడంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 78.5 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌట్ అయింది. హెన్రీ కూపర్ (40) టాప్ స్కోరర్ కాగా.. రచిన్ రవీంద్ర (34), కెప్టెన్ డారిల్ మిచెల్ (32) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 28 పరుగుల ఆధిక్యం దక్కింది.

ధావన్ 'వాలెంటైన్స్‌ డే' స్సెషల్.. ఒక్కగానొక్క భార్యతో!!ధావన్ 'వాలెంటైన్స్‌ డే' స్సెషల్.. ఒక్కగానొక్క భార్యతో!!

ఆదిలోనే షాక్ :

రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన న్యూజిలాండ్‌ ఎలెవెన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ విల్ యంగ్ (2) మూడో ఓవర్లోనే బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. పదో ఓవర్లో టిమ్ సీఫెర్ట్ (9) కూడా ఔట్ అవ్వడంతో కివీస్ కష్టాల్లో పడింది. ఫిన్ అలెన్ (20) అండతో మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర కాసేపు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే కొద్ది వ్యవధిలోనే రవీంద్ర, అలెన్ పెవిలియన్ చేరడంతో కివీస్ టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయియింది.

మెరిసిన కూపర్:

హెన్రీ కూపర్, టామ్ బ్రూస్ (31) భారత బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొని జట్టు స్కోరును 100 పరుగులు దాటించారు. ఈసమయంలో భారత పేసర్లు పుంజుకుని బ్రూస్, కూపర్‌లను ఔట్ చేసారు. ఆపై జిమ్మీ నీశమ్ (1) కూడా నిరాశపరిచాడు. అనంతరం వరుస విరామాల్లో డేన్ క్లీవర్ (13), స్కాట్ కుగ్గెలీజ్న్ (11), ఇష్ సోధి (14) వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్‌ ఎలెవెన్‌ ఆలౌట్ అయింది. షమీ మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, ఉమేష్, సైనీ తలో రెండు వికెట్లతో రాణించారు.

బౌండరీలతో రెచ్చిపోయిన షా:

బౌండరీలతో రెచ్చిపోయిన షా:

ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్న టీమిండియాకు ఓపెనర్లు పృథ్వీ షా-మయాంక్‌ అగర్వాల్‌ అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కివీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా షా బౌండరీలతో రెచ్చిపోయాడు. షా-మయాంక్‌ ఇప్పటికే 50కి పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం పృథ్వీ షా (35), మయాంక్‌ అగర్వాల్‌ (23) పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా 7 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. ఇక 87 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంపర్లు రెండో రోజు ముగిసినట్టు ప్రకటించారు. ఇంకా ఒక రోజు మిగిలి ఉన్న నేపథ్యంలో భారత్ దూకుడుగా ఆడి కివీస్ ముందు భారీ లక్షాన్ని ఉంచనుంది.

విహారి సెంచరీ:

ఇన్నింగ్స్‌లో భారత్ మోస్తరు స్కోరుకే పరిమితమైన విషయం తెలిసిందే. 78.5 ఓవర్లలో 263 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తెలుగు ఆటగాడు హనుమ విహారి (101 రిటైర్డ్‌హర్ట్‌; 182 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ చేయగా.. నయా వాల్ ఛతేశ్వర పుజారా (93; 211 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) తృటిలో సెంచరీ కోల్పోయాడు. కివీస్ బౌలర్లలో కుగ్లీజిన్‌, ఇష్‌ సోథీలు తలో మూడు వికెట్లు తీశారు.

Story first published: Saturday, February 15, 2020, 11:14 [IST]
Other articles published on Feb 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X