న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs New Zealand: 18 రోజుల విరామం తర్వాత పాండ్యా ఏమని ట్వీట్ చేశాడో తెలుసా!

India vs New Zealand: Thank you, Hardik Pandya tweets after strong comeback

హైదరాబాద్: నిషేధం ఎత్తివేత తర్వాత టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు కారణంగా న్యూజిలాండ్‌తో తొలి రెండు వన్డేలకు దూరమైన పాండ్యా మూడో వన్డేలో విజయ్ శంకర్ స్థానంలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

న్యూజిలాండ్‌పై వన్డే సిరిస్ విజయం: కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో రికార్డున్యూజిలాండ్‌పై వన్డే సిరిస్ విజయం: కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో రికార్డు

ఈ మ్యాచ్‌లో కీలక సమయంలో రాణించి తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. టాక్ షో వివాదంపై క్షమాపణలు చెప్పిన తర్వాత సోషల్ మీడియాకు దూరంగా ఉన్న హార్ధిక్ పాండ్యా మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించిన తర్వాత ట్విట్టర్‌లో 'Thank you' అంటూ మూడో వన్డే ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు.

18 రోజుల విరామం పాండ్యా ట్వీట్

18 రోజుల విరామం పాండ్యా ట్వీట్

సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే హార్దిక్‌ పాండ్యా 18 రోజుల విరామం తర్వాత ట్వీట్‌ చేయడం గమనార్హం. కాగా, మూడో వన్డేలో హార్దిక్ పాండ్యా 10 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసుకుని 45 పరుగులు ఇచ్చి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యాపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రశంసలు కురిపించాడు.

కోహ్లీ మాట్లాడుతూ

కోహ్లీ మాట్లాడుతూ

కోహ్లీ మాట్లాడుతూ "పాండ్యా తిరిగి జట్టులో చూడటం సంతోషంగా ఉంది. త‌ల తిప్ప‌కుండా వికెట్ మీదే దృష్టి పెట్టి పాండ్యా బౌలింగ్ చేశాడ‌ు. పాండ్యా బౌలింగ్ చేసిన విధానం చూస్తే అత‌నెంత ఫోక‌స్ చేశాడో అర్థ‌మ‌వుతుంది. ప‌ది ఓవ‌ర్లు వేసిన పాండ్యా 2 వికెట్లు తీసుకుని 45 ర‌న్స్ ఇచ్చాడు. జ‌ట్టు త‌ర‌పున‌ కీల‌క పాత్ర పోషించే ప్లేయ‌ర్. పాండ్యాతో తుది జ‌ట్టులో బ్యాలెన్స్ వచ్చింది" అని కోహ్లీ అన్నాడు.

గవాస్కర్ సైతం పొగడ్తలు

గవాస్కర్ సైతం పొగడ్తలు

మరోవైపు మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ కూడా హార్దిక్‌ పాండ్యాను పొగడ్తల్లో ముంచెత్తాడు. మూడో వన్డేలో అద్భుతంగా ఆడాడని మెచ్చుకున్నాడు. వివాదాలను మర్చిపోయి మైదానంలో ఆటపై దృష్టి పెట్టడం మామూలు విషయం కాదన్నాడు. దేశం కోసం ఆడుతున్నామన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని గవాస్కర్ సూచించాడు.

Story first published: Tuesday, January 29, 2019, 9:14 [IST]
Other articles published on Jan 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X