న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final Draw:రిజర్వ్‌ డే కలుపుకున్నా.. డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతను చూడడం కష్టమే!కోహ్లీకి నిరాశ తప్పదు!

India vs New Zealand: Southampton weather Seems WTC Final 2021 Will End as a Draw

సౌథాంప్టన్‌: భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఒక జట్టు ఓడే పరిస్థితి లేదు..మరో జట్టు గెలిచేందుకు అవకాశం కనిపించడంలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఫలితం వచ్చేలా కనిపించడం లేదు. ఐదు రోజుల నుంచి సౌథాంప్టన్‌లో వర్షం పడటమే ఇందుకు కారణం. వరుణుడి వల్ల తొలి రోజు పూర్తిగా మ్యాచ్‌ జరగలేదు.

రెండో రోజు 64.4 ఓవర్ల ఆట సాధ్యమైంది. ఆ రోజు భారత్ ఆధిపత్యం సాధించింది. మూడో రోజు కివీస్‌దే పైచేయి. భారత్‌ను 217కు ఔట్‌ చేయడమే కాకుండా.. 101/2తో నిలిచింది. నాలుగో రోజు నిరంతరాయంగా వర్షం కురవడంతో ఆట మొత్తంగా సాధ్యపడలేదు. ఇక మిగిలింది చివరి రోజైన మంగళవారం.

మబ్బులు పట్టడంతో

మబ్బులు పట్టడంతో

ఛాంపియన్‌షిప్‌ ఐదో రోజు ఆట కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరుజల్లులు కురిసేందుకు ఆస్కారం ఉన్నా.. ఎండ కాస్తుందని సౌథాంప్టన్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరం వైపు చల్లని గాలులు వీస్తాయని పేర్కొంది. అయితే మబ్బులు పట్టడంతో వెలుతురు తక్కువగా ఉంటుందని వెల్లడించింది. దీంతో మూడో సెషన్ సాగడంపై అనుమానులు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఆట సాధ్యమైన రెండు, మూడు రోజుల్లో వెలుతురులేమి కారణంగా ఆట అర్ధగంట ముందే ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ఈరోజు కూడా పూర్తి ఓవర్ల కోట సాధ్యమవడం కష్టమే.

సంయుక్త విజేతే

సంయుక్త విజేతే

మంగళవారం సరైన సమయానికి ఆట మొదలైనా.. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్ కొనసాగిస్తుంది. ఇప్పటికే 116 రన్స్ పరుగులు వెనకపడిన నేపథ్యంలో.. ఆ పరుగులు చేయడానికి తొలి సెషన్ పూర్తవుతుంది. ఆధిక్యం సాధించాలంటే.. రెండు సెషన్ల ఆట ఆడాల్సి ఉంటుంది. దీంతో ఐదవ రోజు పూర్తవనుంది. లేదా కివీస్ ఎప్పుడైనా ఆలౌట్ కావొచ్చు. కివీస్ ఆలౌట్ అయితే భారత్ రెండో ఇన్నింగ్స్ మొదలు పెడుతుంది. భారత్ ఆలౌట్ అవడం, కివీస్ ఇంకో ఆడడం సాధ్యం కాదు. రిజర్వ్ డే ఉన్నా.. ఫలితం వచ్చే అవకాశం ఉంటేనే ఉపయోగించనున్నారు. కాబట్టి దాదాపు రిజర్వ్ డే ఉండదు. అప్పుడు మ్యాచ్ డ్రా కానుంది. ఇదీ జరిగితే భారత్, న్యూజిలాండ్ జట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు.

WTC Final డ్రాగా ముగిస్తే..విజేతను ప్రకటించడానికి ఐసీసీ ఒక సూత్రాన్ని కనుగొనాలి! ఫుట్‌బాల్‌, టెన్నిస్‌ మాదిరి!

కోహ్లీకి నిరాశ తప్పదు

కోహ్లీకి నిరాశ తప్పదు

ఐసీసీ ప్రవేశపెట్టిన అన్ని టోర్నీలను టీమిండియా కైవసం చేసుకుంది. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ టైటిళ్లను భారత్ సొంతంచేసుకుంది. ఈ ట్రోఫీలు అన్ని మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడే భారత్ సాధించింది. దీంతో ప్రపంచ క్రికెట్‌లో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక సారథిగా ధోనీ నిలిచాడు.

ధోనీని గురువుగా భావించే విరాట్ కోహ్లీ మాత్రం ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవలేదు. కోహ్లీ సారథ్యంలో భారత్ ఈ ఐదేళ్ల కాలంలో ఓసారి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరుకుని ఓడిపోయింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ నుంచి ఇంటికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌ రూపంలో ఐసీసీ ట్రోఫీ అందుకునే సువర్ణావకాశం కోహ్లీ వచ్చిందనుకుంటే.. వరణుడు అడ్డుపడుతున్నాడు. దాదాపు కోహ్లీకి నిరాశ తప్పదు.

వర్షం రూపంలో దురదృష్టం

వర్షం రూపంలో దురదృష్టం

న్యూజిలాండ్ జట్టు కూడా ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవలేదు. 2015, 2019 వన్డే ప్రపంచకప్‌లలో ఆ అవకాశం వచ్చినా.. కివీస్ అందుకోలేకపోయింది. రెండు ప్రపంచకప్‌లలో వరుస విజయాలతో దుమ్మురేపిన కివీస్.. ఫైనల్లో మాత్రం చేతులెత్తేసింది. ముఖ్యంగా 2019 వన్డే ప్రపంచకప్‌ చేతులోకి వచ్చినట్టే వచ్చి చేజారింది. దీంతో మర్యాదకు మారుపేరైన కివీస్‌ ఈ ఛాంపియన్‌షిప్‌ గెలవాలని పట్టుదలతో బరిలోకి దిగింది. కానీ వర్షం రూపంలో కివీస్ జట్టును దురదృష్టం వెంటాడుతోంది.

Story first published: Tuesday, June 22, 2021, 12:13 [IST]
Other articles published on Jun 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X