న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

200th ODI: మరో మైలురాయి ముంగిట రోహిత్ శర్మ, గణాంకాలివే!

India vs New Zealand: Rohit Sharma set to play his 200th ODI - A look at his stats

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ వన్డేల్లో మరో మైలురాయిని అందుకోనున్నాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా గురువారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే నాలుగో వన్డే రోహిత్ శర్మకు 200వ వన్డే. ఇప్పటికే 3-0తో టీమిండియా సిరిస్‌ను చేజిక్కించుకోవడంతో రోహిత్ శర్మపై పెద్దగా ఒత్తిడి ఉండదు.

ప్రేక్షకులపై తేనెటీగలు దాడి: 15నిమిషాల పాటు నిలిచిన మ్యాచ్ (వీడియో)ప్రేక్షకులపై తేనెటీగలు దాడి: 15నిమిషాల పాటు నిలిచిన మ్యాచ్ (వీడియో)

31 ఏళ్ల రోహిత్ 2007లో బెల్ ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌పై తొలివన్డే మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకూ భారత్ తరుపున 199 వన్డేలాడిన రోహిత్ శర్మ 7799 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే తన 200వ వన్డేలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించడం.

మూడు డబుల్ సెంచరీలు

మూడు డబుల్ సెంచరీలు

వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్. అయితే రోహిత్ శర్మ ఇప్పటికే మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. 2013లో బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాపై 209, 2014లో శ్రీలంకపై 264 పరుగులు సాధించాడు. వన్డేల్లో ఇప్పటికీ ఇదే అత్యధిక స్కోరు. 2014లో శ్రీలంకతో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన వన్డేలో రోహిత్‌ 264 పరుగులు చేశాడు. మార్టిన్‌ గప్తిల్‌(237), అమీలియా కెర్‌(232), బెలిండా క్లార్క్‌(229) వీరేందర్‌ సెహ్వాగ్‌(219) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక మూడో డబుల్ సెంచరీని 2017లో మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 208 పరుగులు చేసి సాధించాడు.

16 సిక్సులు

16 సిక్సులు

2013లో బెంగళూరులో ఆస్ట్రేలియాపై రోహిత్‌ తన కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీ సాధించాడు. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీని సాధించే క్రమంలో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ 16 సిక్సులు బాదాడు. అప్పట్లో ఇది ప్రపంచ రికార్డు కావడం విశేషం. దీంతో ఏబీడివిలియర్స్‌, క్రిస్‌గేల్‌ వంటి దిగ్గజాల రికార్డులను సమం చేశాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాపై రోహిత్‌ ఇప్పటి వరకు 66 సిక్స్‌లు కొట్టాడు. ఒక ప్రత్యర్థి జట్టు పై ఇన్ని భారీ షాట్లు కొట్టిన రికార్డు ఇతడిదే. రోహిత్ శర్మ డబుల్ సెంచరీ సాధించినప్పుడు అవతలి ఎండ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ఉన్నాడు.

నిలకడ బ్యాట్స్‌మన్

నిలకడ బ్యాట్స్‌మన్

వన్డేల్లో రోహిత్ శర్మ రెగ్యులర్ ఓపెనర్‌గా కొనసాగుతున్నాడు. 2013 నుంచి 2018 వరకు రోహిత్ శర్మ యావరేజి 50కిపైగా ఉండటం విశేషం. ఎక్కువ సీజన్లలో 50కిపైగా యావరేజిని కలిగి ఉన్న ఏకైక భారత ఆటగాడు రోహిత్ శర్మనే. 2009 నుంచి 2015 మధ్య కాలంలో 50కిపైగా యావరేజిని ఏబీ డివిలియర్స్ ఏడు సార్లు కలిగి ఉన్నాడు.

రోహిత్ శర్మ యావరేజి బ్రేకప్:

2013: M: 28, R: 1196, Avg: 52, 100s: 2.

2014: M: 12, R: 578, Avg: 52.54, 100: 1.

2015: M: 17, R: 815, Avg: 50.93, 100: 3.

2016: M: 10, R: 564, Avg: 62.66, 100: 2.

2017: M: 21, R: 1293, Avg: 71.83, 100: 6

2018: M: 19, R: 1030, Avg: 73.57, 100: 5.

అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు 'హిట్ మ్యాన్‌'

అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు 'హిట్ మ్యాన్‌'

2007లో దక్షిణాఫ్రికా-ఐర్లాండ్-ఇండియా జట్ల మధ్య జరిగిన ముక్కోణపు సిరిస్ ద్వారా రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశాడు. 2013కు ముందు డోలాయమానంలో పడ్డ రోహిత్‌ కెరీర్‌ను ధోనీ గాడిలో పెట్టాడు. రోహిత్‌ మీద నమ్మకం పెట్టి అతడిని ఓపెనర్‌గా బరిలోకి దింపాడు. 2013లో ఓపెనర్‌గా ప్రమోట్ అయిన తర్వాత రోహిత్ శర్మ భారత వన్డే జట్టుకు వెన్నుముకగా మారాడు. ఓపెనర్‌గా టీమిండియాకు అనేక అద్భుతమైన భాగస్వామ్యాలను నమోదు చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి రోహిత్ శర్మ 50 ఓవర్ల పాటు మ్యాచ్ ఆడిన సందర్భాలు కూడా అనేకం. ఇప్పుడు విజయవంతమైన ఓపెనర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో ‘హిట్‌మ్యాన్‌'గానూ పేరు తెచ్చుకున్నాడు.

Before opening: 2007-2012: M: 86, R: 1978, Avg: 30.43, SR: 77.94, 100: 2.

2013 onwards: M: 113, R: 5821, Avg: 60.01, SR: 92.94, 100: 20.

Story first published: Wednesday, January 30, 2019, 17:49 [IST]
Other articles published on Jan 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X