న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కివీస్‌పై 10 ఇన్నింగ్స్‌లు.. 6 సార్లు సింగిల్‌ డిజిట్‌కే రోహిత్ ఔట్.. ఆందోళనలో భారత్

India Vs New Zealand 2nd T20 : Rohit Sharma Stats On New Zealand Worrying Team India
India vs New Zealand: Rohit Sharma’s numbers pose a big concern for TeamIndia ahead of 2nd T20I

ఆక్లాండ్‌: టీమిండియా ఓపెనర్‌ 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ ఎంతటి విధ్వంసక ఆటగాడో మనందరికీ తెలుసు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే భారీ ఇన్నింగ్స్‌లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడు. వన్డే క్రికెట్‌ ఫార్మాట్‌లో మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయంటేనే అర్ధంచేసుకోవచ్చు ఎలా చెలరేగుతాడో. టీ20ల్లో రోహిత్‌ అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. అలాంటి హిట్‌మ్యాన్‌ న్యూజిలాండ్‌పై పెద్దగా రాణించకపోవడం ఆందోళనకరం.

పాకిస్థాన్‌లో ఆసియాకప్‌ ఆడాలి.. బీసీసీఐకి పీసీబీ బెదిరింపులు!!పాకిస్థాన్‌లో ఆసియాకప్‌ ఆడాలి.. బీసీసీఐకి పీసీబీ బెదిరింపులు!!

6 సార్లు సింగిల్‌ డిజిట్‌కే ఔట్:

6 సార్లు సింగిల్‌ డిజిట్‌కే ఔట్:

రోహిత్‌ శర్మకు కివీస్‌ న్యూజిలాండ్‌పై సరైన రికార్డు లేదు. అందుకు అనుగుణంగానే ఆక్లాండ్‌ వేదికగా జరిగిన తొలి టీ20లో రోహిత్ (7) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగబోయే రెండో మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడనే దానిపై భారత జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. టీ20 ఫార్మాట్‌లో రోహిత్‌ శర్మను ఇబ్బంది పెట్టిన జట్లలో న్యూజిలాండ్‌ అగ్రస్థానంలో ఉంది. కివీస్‌పై ఆడిన పది ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ ఆరు సార్లు సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే ఔట్ అయ్యాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి మాత్రమే నాటౌట్‌గా నిలిచాడు. 22.77 సగటుతో 205 పరుగులే చేశాడు.

న్యూజిలాండ్‌పైనే అత్యల్ప సగటు:

న్యూజిలాండ్‌పైనే అత్యల్ప సగటు:

ఇతర జట్లతో పోలిస్తే రోహిత్ న్యూజిలాండ్‌పైనే అత్యధికంగా 60 శాతంతో సింగిల్‌ డిజిట్‌కే ఔటయ్యాడు. కివీస్‌ తర్వాత అంతగా ఇబ్బంది పెట్టిన మరో జట్టు ఆస్ట్రేలియా. కంగారూలపై రోహిత్ 50 శాతంతో నిలిచాడు. అలాగే టీ20ల్లో న్యూజిలాండ్‌పైనే అత్యల్ప సగటు 22.77 కలిగిన నాలుగో ఆటగాడిగా రోహిత్ కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడనే దానిపై ఆసక్తి నెలకొంది.

ఈడెన్‌ పార్క్‌లో రెండో మ్యాచ్‌:

ఈడెన్‌ పార్క్‌లో రెండో మ్యాచ్‌:

సుదీర్ఘ పర్యటనలో భాగంగా తొలి టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్‌ను చిత్తుచేసిన భారత్‌.. ఆదివారం ఈడెన్‌ పార్క్‌లోనే కివీస్‌ను మరోసారి ఢీకొననుంది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గితే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచవచ్చు. ఎందుకంటే.. కివీస్‌ ఈ మ్యాచ్‌ ఓడితే మిగతా మూడింట్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ ఏడాది చివర్లో పొట్టి ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో లోటుపాట్లు సరిదిద్దుకునేందుకు కోహ్లీసేనకు ఇది చక్కటి అవకాశం. తొలి మ్యాచ్ జోరు కొనసాగించాలని భారత్‌ భావిస్తుంటే.. అడ్డుకట్ట వేసేందుకు కివీస్‌ కసరత్తులు చేస్తోంది.

తుది జట్టు (అంచనా):

తుది జట్టు (అంచనా):

భారత్‌: రోహిత్‌ శర్మ, లోకేష్ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చహల్‌, జస్ప్రిత్‌ బుమ్రా, నవదీప్‌ సైనీ, మహ్మద్‌ షమీ.

Story first published: Sunday, January 26, 2020, 12:02 [IST]
Other articles published on Jan 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X