న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'సొంతగడ్డపై కివీస్‌ను ఓడించడం అంత సులువు కాదు.. కోహ్లీకి అతి పెద్ద చాలెంజ్‌ ఇదే'

India vs New Zealand 1 st T20 : Eager To See How Kohli Deals With NZ Seamers On Tour || Oneindia
India vs New Zealand: Mike Hesson points out biggest test for Virat Kohli ahead of first T20I

ఆక్లాండ్‌: భారత్‌లో టీమిండియా ఎంత పటిష్టంగా ఉంటుందో.. న్యూజిలాండ్‌లో కివీస్‌ కూడా అంతే బలంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌ను ఓడించడం అంత ఈజీ కాదు అని కివీస్ మాజీ కోచ్‌ మైక్‌ హెస్సెన్‌ అంటున్నాడు. భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య రసవసత్తర పోరు ఖాయం అని జోస్యం చెప్పాడు. ఈ ద్వైపాక్షిక సిరీస్‌ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అతి పెద్ద చాలెంజ్‌ అని హెస్సన్‌ అభిప్రాయపడ్డాడు.

<strong>తొలి టీ20లో బెంచ్‌కే శాంసన్‌, పంత్.. ఆరుగురు బౌలర్లతో బరిలోకి.. తుది జట్టు ఇదే?!!</strong>తొలి టీ20లో బెంచ్‌కే శాంసన్‌, పంత్.. ఆరుగురు బౌలర్లతో బరిలోకి.. తుది జట్టు ఇదే?!!

కివీస్‌ను ఓడించడం అంత సులువు కాదు

కివీస్‌ను ఓడించడం అంత సులువు కాదు

విరాట్ కోహ్లీ సారథ్యం వహించే ఐపీఎల్ జట్టు బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌కు హెడ్‌ కోచ్‌గా ఉన్న మైక్‌ హెస్సెన్‌ మాట్లాడుతూ... 'భారత్‌-న్యూజిలాండ్‌ జట్లలలో టాప్ ప్లేయర్లు ఉన్నారు. పోరు హోరాహోరీగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే న్యూజిలాండ్‌ను వారి దేశంలో ఓడించడం అంత ఈజీ కాదు. సొంతగడ్డపై టీమిండియా ఎంత పటిష్టంగా ఉంటుందో.. న్యూజిలాండ్‌లో కివీస్‌ కూడా అంతే. అయితే ప్రస్తుతం కివీస్‌ను వారి దేశంలో ఓడించాలంటే టీమిండియానే అసలైన ప్రత్యర్థి' అని పేర్కొన్నాడు.

కోహ్లీకి అతి పెద్ద చాలెంజ్‌

కోహ్లీకి అతి పెద్ద చాలెంజ్‌

'న్యూజిలాండ్‌ సీమర్లను విరాట్‌ కోహ్లీ ఎలా ఎదుర్కొంటాడో చూడాలని ఆసక్తిగా ఉంది. పేసర్ల నుంచి ఎదురయ్యే తొలి 10 నుంచి 20 బంతులు అతనికి అత్యంత కిష్టం. ఒకసారి విరాట్ గాడిలో పడ్డాడంటే ఏ పిచ్‌లోనైనా చెలరేగిపోతాడు. ఒకవేళ కోహ్లీని ఆదిలో ఔట్‌ చేయకపోతే.. విల్లియంసన్ సేన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ ద్వైపాక్షిక సిరీస్‌ కోహ్లీకి అతి పెద్ద చాలెంజ్‌' అని మైక్‌ హెస్సెన్‌ అన్నాడు.

రోహిత్‌ vs బౌల్ట్‌

రోహిత్‌ vs బౌల్ట్‌

'టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ల మధ్య పోరు కూడా బాగుంటుంది. ప్రధానంగా వన్డేల్లో బౌల్ట్‌, రోహిత్‌ మధ్య గట్టి పోటీ ఉంటుంది. న్యూజిలాండ్ ఇటీవలి రికార్డు గమనిస్తే.. సొంతగడ్డపై వారిని ఓడించడం చాలా కష్టం. అయితే టీమిండియా 2014 కంటే చాలా పటిష్టంగా ఉంది. ముఖ్యంగా బలమైన సీమ్ బౌలింగ్ దాడి ఉంది. కచ్చితంగా ఇది పోటీ సిరీస్ అవుతుంది' అని మైక్‌ హెస్సెన్‌ చెప్పుకొచ్చాడు.

ఆక్లాండ్‌లో తొలి టీ20:

ఆక్లాండ్‌లో తొలి టీ20:

సుదీర్ఘ న్యూజిలాండ్‌ పర్యటనలో టీమిండియా ఐదు టెస్టులు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. శుక్రవారం ఆక్లాండ్‌లో జరిగే తొలి టీ20తో కివీస్ పర్యటనను టీమిండియాను ఆరంభించనుంది. ఈ ఏడాదిలో టీ20 ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో ఈ టీ20 సిరీస్‌ను సద్వినియోగం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మెగా టోర్నీ కోసం కోహ్లీసేన ఇప్పటినుండే వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగా జట్టు కూర్పులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో. వికెట్‌ కీపర్‌గా లోకేష్ రాహుల్‌ సక్సెస్ అవ్వడంతో.. యువ వికెట్‌ కీపర్‌లు సంజూ శాంసన్‌, రిషభ్‌ పంత్‌ తుది జట్టులో ఆడకపోవచ్చు.

Story first published: Thursday, January 23, 2020, 16:42 [IST]
Other articles published on Jan 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X